చాలా మంది విషయంలో ఏమో కానీ మన తెలుగు ప్రజలలో నమ్మకాలూ అనేవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. చాలా మంది వారి పర్శనల్ జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలు ఆధారంగా ఇవి నెలకొంటాయి. మరి వీటికి ఎవరూ కూడా అతీతులు కారని కూడా చెప్పాలి.
వెండితెరపై కనిపించే హీరోలు కూడా మనుషులే కదా వారికీ జీవితాలు ఉంటాయి. వారికీ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాత్రం ఈ ఏడాది అసలు తన జీవితంలో మర్చిపోలేని ఒక కాల ఏడాదిలా నిలిచిపోయింది అని చెప్పక తప్పదు.
ఈ ఒక్క ఏడాదిలోనే తన రక్త సంబంధీకులును ముగ్గురుని పోగొట్టుకోవడం అనేది అసలు చెప్పుకోలేని నరకం. ఈ ఏడాది ఆరంభంలోనే మహేష్ కి తన సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు మరణంతో షాక్ తగలగా నెక్స్ట్ గత తొమ్మిదో నెల లోనే మహేష్ తల్లి గారు మరణించడం తీవ్ర విషాదంగా మారింది.
మరి నిన్న తన తండ్రి కృష్ణ గారు కూడా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అనే వార్త కాస్త కంగారు పెట్టగా కానీ ఒక్క రోజు పూర్తి కాకుండానే కృష్ణ గారు ఇక లేరు అనే వార్త వినాల్సి వస్తుంది అని ఎవరూ అనుకోని ఉండరు. కానీ చివరికి చేరు వార్తే మిగిలింది.
మరి దీనితో అయితే ఈ ఒక్క ఏడాదిలోనే మహేష్ మూడు సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది చాలా బాధాకరం. ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, ప్రముఖులు అంతా కూడా మహేష్ ని కలిసి సంతాపం వ్యక్తం చేస్తూ కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.