KTR Counter: ఆ లీడర్లకు వాత పెట్టాలి.. కేటీఆర్ స్టన్నింగ్ కౌంటర్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఓ పెద్ద మోసం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అభయహస్తం హామీలే ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం “నిందలు – దండాలు – చందాలు” అనే విధానంతో నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా మద్దతును కోల్పోతోందని, ముందస్తు ఎన్నికల భయంతో అధికారాన్ని తప్పుగా వాడుతోందని ఆరోపించారు. “ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేల గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులతో కలిసి బూత్ స్థాయి నుండి తిరిగి మద్దతు చేకూర్చే పనిలో దిగినట్లు తెలిపారు. పార్టీ ప్రగతిని పునరుద్ధరించేందుకు జూన్ నుంచి సభ్యత్వ నమోదు, కమిటీ ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రజల్లో కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తి నెలకొంది అని పేర్కొన్న కేటీఆర్, “ఇప్పటికే ఇచ్చిన హామీలలో 10% కూడా నెరవేర్చలేదు. ఇప్పుడే ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రజల మద్దతుతో నిలిచేది బీఆర్ఎస్‌నే అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండించిన కేటీఆర్, ప్రజా విశ్వాసాన్ని ద్రోహించిన వారిని ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

విజయసాయికి జగన్ చావుదెబ్బ || Analyst Ks Prasad EXPOSED Vijaya Sai Reddy Video Leak || Telugu Rajyam