వినాయక్, కొడాలి నాని.! ఓ వైసీపీ సినిమా.?

వివి వినాయక్ అంటే మాస్ డైరెక్టర్.! మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. కానీ, ఆయనకు అటు నందమూరి బాలకృష్ణతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ మాటకొస్తే వినాయక్‌ని అజాత శతృవు అనొచ్చు. రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వుంది.

జనసేన నుంచి టిక్కెట్ కోసం ఆశిస్తున్నాడు వినాయక్. అలాంటి వినాయక్, తాజాగా కొడాలి నానితో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీలో వినాయక్ చేరతారన్న ప్రచారం మొదలైంది.

కాదు, కేవలం సినిమా సంబంధిత అంశాలే చర్చకు వచ్చాయన్నది వీరిద్దరి భేటీపై ఓ వాదన. వినాయక్ సమయం ఇస్తే సినిమా చేస్తానని కొడాలి నాని చెప్పగా, కొడాలి నాని అడిగితే తాను రెడీ.. అని వినాయక్ కూడా చెప్పాడు. ఈ ఇద్దరూ గతంలో ‘ఆది’ సినిమా చేశారు. ‘అదుర్స్’ కూడా వీరి నుంచి వచ్చింది.

సో, ఎన్టీయార్ హీరోగానే మళ్ళీ ఈ ఇద్దరూ సినిమా చేయొచ్చంటున్నారు. కానీ, 2024 ఎన్నికలే లక్షంగా ఓ సినిమా చేయాలని వైసీపీ అనుకుంటోందనీ, దానికి గతంలో ఆర్జీవీని అనుకున్నా, ఇప్పుడు వినాయక్ అయితే బెటర్ అని భావిస్తున్నారని అంటున్నారు.