ఏపీలో కమ్మలు బలమైన సామాజిక వర్గం. తెలుగుదేశం పార్టీలో పదవులు పొందడం నుంచి ప్రభుత్వంతో పనులు చేయించుకోవడంలోనే కాదు పార్టీని ఆదుకోవడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అది ఎన్టీఆర్ అయిన చంద్రబాబు అయిన తమ నాయకుడిని కాపాడుకోవడంలో ఈ సమాజిక వర్గానికి మరొకరు సాటి రారు. అయితే ఇప్పుడు ఈ సమాజిక వర్గానికి కొత్త సమస్య వచ్చి పడింది. మోసేందుకు సిద్ధంగా ఉన్నా సామర్థ్యం ఉన్న నాయకుడు దొరక్కపోవడంతో తమ భవిష్యత్తుపై వీళ్లకు బెంగపట్టుకుందంటా. ఈ సమాజిక వర్గం ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందనే టాక్ బలంగా వినబడుతోంది. చంద్రబాబు మాత్రం తన తర్వాత చిన్నబాబు లోకేష్ పర్యవేక్షనలో పార్టీ ముందుగు సాగాలని కోరుకుంటున్నారు. అయితే లోకేష్ కు అంత సామర్థ్యం లేదని పార్టీలోని పలువురు పెద్దలే చంద్రబాబు ముందు గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో కొంత మంది పక్క చూపులు చూస్తున్నారని టాక్.
వాస్తవానికి టీడీపీలో కమ్మ నాయకులే బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు. ఈ లాబీ ఎంత బలంగా ఉంటుందో చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే నాయకుడికి అందరి అవసరాలు తీర్చగలగే శక్తి ఉండాలని ఈ లాబీ చేస్తున్న వాదనలను చంద్రబాబు కూడా కాదనలేకపోతున్నారంటా. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఫ్యూహాంతో తెలుగు దేశం పార్టీ పలు సంవత్సరాలు తెలుగు నేలను ఏలింది. చంద్రబాబు చలవతో ఎంతో మంది కమ్మలు కోట్లకు కోట్లు ఆర్జించారు. ఇలా లాభపడ్డ బ్యాచ్ అంత కాలం చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంది. చంద్రబాబు కోరినా కోరక పోయినా.. వీళ్లంతా చంద్రబాబుకు జై కొట్టారు. కాని మారిన కాలమాన పరిస్థితుల కారణంగా ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు మార్పు కోరుకుంటోందని సమాచారం.
వైసీపీ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం నేపథ్యంలో ఇప్పటికి కాకపోయినా మరో ఐదేళ్ల తర్వాత అయినా చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేసే వారు ఎవరున్నా ఉన్నారని వెతుకుతున్నారు. ఏ పార్టీలో ఏ స్థానంలో ఉన్నా సరే సత్తా ఉంటే చాలు మద్ధతు పలికేందుకు కమ్మ సామాజిక వర్గం సిద్ధంగా ఉందంటా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తమ భవిష్యత్తుకు ఢోకా లేని విధంగా కొత్త నాయకుడు ఉంటే చాలని కోరుకుంటోంది. కమ్మల్లోంచి కొత్త నాయకుడు పుట్టుకొస్తే….ఒక్క టీడీపీలో నుంచే కాదు వైసీపీలో ఉన్న కమ్మలు వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటా. అయితే ఎంత వెతికినా అలాంటి నాయకుడు దొరక్కపోవడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లో తలలు పట్టుకుంటున్నారంటా.
ఎన్టీఆర్ తర్వాత కమ్మల వెనక చంద్రబాబు పడ్డాడు అనడం కంటే బాబు వెంటే కమ్మలు నడిచారనేది వాస్తవరం. అవి వారి రాజకీయ అవసరాలు కావొచ్చు. వ్యాపార, ఇతరత్రా అవసరాలు కావచ్చు. కారణం ఏదైనా ఇంత కాలం అందరి బరువు మోసిన చంద్రబాబుపై వయోభారం కారణంగా కమ్మలకు అభద్రతా భావం పట్టుకుంది. కులం కోసం అవసరం అయితే నందమూరి కూటుంబాన్ని పక్కకు తప్పించినా తప్పులేదని కొంత మంది ఇంటర్నల్ టాక్స్ లో బలంగా వాదిస్తున్నారంటా. కొంత మంది జూనియర్ ఎన్టీఆర్ అని మరికొంత మంది బాలయ్య అని ఇలా రకరకాల పేర్లు తెరపైకి తెస్తున్నా సామర్థ్యంతో పాటు సర్వసమ్మతి ఉన్న నాయకుడు దొరకడం లేదంటా. మారిన తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఒకప్పుడు చంద్రబాబును మోసిన కమ్మబోయిలాలే ఎప్పుడో ఒకరోజు చంద్రబాబును పల్లకిని దించేస్తాయనే ప్రచారం జరుగుతోంది.