Anumana Pakshi: DJ టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ఫిబ్రవరిలో విడుదల

Anumana Pakshi: DJ టిల్లుతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ హీరో గా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ అనుమాన పక్షి మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాతలు రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి.

మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైంని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్ ఆకట్టుకుంది. ప్రోమోతో పాటు, చిత్ర ప్రచార కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలియజేశారు. ఖచ్చితమైన తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు

బలమైన పాత్రలతో అలరించే దర్శకుడు విమల్ కృష్ణ, ప్రత్యేకంగా రాగ్ మయూర్ కోసం రూపొందించిన యూనిక్ క్యారెక్టర్ తో వస్తున్నారు. అతని సిగ్నేచర్ స్టైల్, హాస్యభరితమైన కథ ప్రమోషనల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినవ్ కునపరెడ్డి ఎడిటర్.

తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్: చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి
డిఓపి: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

పవన్ మాటే శాసనం || Chalasani Srinivas Fires On CM Chandrababu Comments On Pawan Kalyan || TR