ఇది మధ్యతరగతి మొనగాళ్ల గెలుపు .. జో బైడెన్ గెలుపు వెనక అసలు కథ ఇదే ! 

Joe Biden victory is middle class man victory 
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు.  డెమొక్రాటిక్ పార్టీ తరపున ఒబామా తరవాత అధ్యక్ష పదవిలో కూర్చోబోతున్నారు.  వచ్చే ఏడాది జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఈనాడు అమెరికా అధ్యక్షుడిగా కూర్చున్న జో బైడెన్ కు ఆ పదవి మూడున్నర దశాబ్దాల కల.  ఈ కల 290 ఎలక్టోరల్ ఓట్లతో భారీగాన్ నెరవేరింది.  బైడెన్ ఇంత అపురూపమైన విజయం సాధించడానికి ఆయన మధ్యతరగతి నేపథ్యం కూడ ఒక కారణం.  జో బైడెన్ ను అమెరికాలో ‘మిడిల్ క్లాస్ జో’ అని పిలుస్తుంటారు.  పెన్సిల్వేనియాలోని స్ర్కాన్‌టన్‌లో ఆర్థికంగా చితికిపోయిన ఒక కుటుంబంలో బైడెన్ 1942 నవంబర్ 20న పుట్టారు.  
Joe Biden victory is middle class man victory 
Joe Biden victory is middle class man victory
ఆయన పుట్టేనాటికే ఆయన కుటుంబం పీకల్లోతు అప్పుల్లో కూరుకునిపోయి ఉంది.  ఆ తర్వాత ఎలాగో కష్టపడి బైడెన్ కు ఊహ తెలిసే నాటికి మధ్యతరగతి స్థాయికి చేరుకున్నారు.  అప్పటి నుండి బైడెన్ సగటు మధ్యతరగతి వ్యక్తిలానే ఉంటూ వచ్చారు. 1972లో జూనియర్‌ సెనెటర్‌గా ఎన్నికయ్యారు.  కానీ అదే ఏడాది ఆయన భార్య, ఏడాది వయసున్న కుమార్తె కారు ప్రమాదంలో మరణించగా తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమారులు ఆసుపత్రి పాలయ్యారు.  కుమారులున్న ఆసుపత్రి గాడి నుండే బైడెన్ సెనెటర్ బాద్యతలను స్వీకరించారు.  
 
 
1988లో తొలిసారి అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నించారు బైడెన్.  తిరిగి 2008లో కూడ ప్రయత్నించారు.  కానీ అభ్యర్థిగా నామినేట్ కాలేకపోయారు.  ఆ తర్వాత ఒబామా ఆయన్ను ఉపాధ్యక్షుడిగా నియమించుకుని ఆయన సేవలను వినియోగించుకున్నారు.  అలా రెండుసార్లు పదవికి పోటీపడాలని ప్రయత్నించి నిరాశ చెందిన మధ్యతరగతి బైడెన్ మూడవసారి అభ్యర్థిత్వాన్ని సాధించి డోనాల్డ్ ట్రంప్ మీద భారీ మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందారు.  రాజకీయ విశ్లేషకులు ఆయన్ను గెలిపించుకున్నది మధ్యతరగతి జనమేనని, ఇది మద్యతరగతి మొనగాడి విజయమని అభివర్ణిస్తున్నారు.