తెలంగాణలో ‘పది’పై కన్నేసిన జనసేన.! ఇదేం ట్విస్టు.!

అసలు తెలంగాణలో జనసేన పార్టీ వుందా.? లేకనేం.? ఆ పార్టీకి కొందరు నాయకులున్నారు. కాకపోతే, వాళ్ళ పేర్లు పెద్దగా పరిచయం వుండదు జనసైనికులకి సైతం.! జనసేన అధినేత అన్న కోణంలో కాదు, పవర్ స్టార్.. అన్న కోణంలో పవన్ కళ్యాణ్‌కి క్రేజ్ వుంది తెలంగాణలో కూడా.! అదే, ఆ సినీ అభిమానమే.. రాజకీయ అభిమానంగా మారింది. అయితే, ఓట్ల దగ్గరకు వచ్చేసరికి, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అభిమానులూ పెద్దగా పట్టించుకోవడంలేదన్న విమర్శ వుంది. కానీ, గతం వేరు.. ప్రస్తుతం వేరని అంటోంది జనసేన పార్టీ. వచ్చే ఎన్నికల్లో దాదాపు కనీసం ముప్ఫయ్ సీట్లలో పోటీ చేయాలని జనసేన పార్టీ అనుకుంటోంది.

అందులో, గట్టిగా 10 సీట్లలో విజయావకాశాలు వున్నాయి జనసేన పార్టీ బలంగా నమ్మతోందట. పది నుంచి పన్నెండు స్థానాల్లో గెలవగలం. స్థానికంగా బలోపేతమయ్యేందుకు ప్రయత్నించండంటూ ఇటీవల జనసేన అధినేత, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలకు సూచించారట. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ ఎన్నికల ప్రచారం చేస్తాననీ, ఆయా నియోజకవర్గాల్లో వారాహి ద్వారా యాత్రలు వుంటాయనీ జనసేన అధినేత చెబుతున్నారట.

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మూడు సీట్ల వరకు జనసేన ఆశిస్తోందిగానీ, అంత సీన్ వుందా.? అన్నదే పెద్ద ప్రశ్న. జనసేనకైతే అంచనాలు గట్టిగానే వున్నాయి. ఓ ఎంపీ సీటు మీద కూడా జనసేన పార్టీ గట్టిగా కసరత్తులు చేస్తోందిట. మూడు స్థానాల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట. బీజేపీ మాత్రం జనసేనతో తెలంగాణలో పొత్తు వద్దనుకుంటోంది. టీడీపీ కలిసొస్తే, జనసేనకు కొంత ఊరట దక్కొచ్చు.