కర్ణాటకలో ప్రచారానికి పవన్… ఈ కండిషన్ పెడతారా?

ఉత్తరంధ్రలో ఎంత హడావిడి చేస్తున్నా… దక్షిణాదిలో మాత్రం బీజేపీ పాచికలు పారడం లేదు. కర్ణాటకలో గత ఎన్నికల్లో సెట్ అయినా… గడిచిన ఐదేళ్లలో అక్కడ బీజేపీకి వచ్చిన “మాంచి” పేరుతో ఈసారి డౌట్ అని అంటున్నారు. దీంతో అది కూడాపోతే… బీజేపీకి దక్షిణాదిలో జెండా పతే సినిమా లేనట్లే! పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో… కర్ణాటకలో ఏదో ఒకటి చేసి మళ్లీ గద్దెనెక్కాలని చూస్తుంది బీజేపీ.

అవును… కర్ణాటకలో ఈసారి అధికారంలోకి రానీపక్షంలో ఆ ప్రభావం దేశ వ్యాప్తంగా ఎంతుంటుందన్న సంగతి కాసేపు పక్కనపెడితే… బీజేపీ కలలు కంటున్న తెలంగాణలో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో… అందుబాటులో ఉన్న అన్ని శక్తులనూ కర్ణాటకలో వాడేయాలని బీజేపీ పెద్దలు ఫిక్సయ్యారంట. అందులో భాగంగా టాలీవుడ్ పవర్ స్టార్ ని కన్నడ సీమలో ప్రచారానికి దింపాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.

అయితే ఏపీ బీజేపీతో జనసేన స్నేహ బంధం ఎన్ని సందేహాలకు తావిస్తోందో అందరికీ తెలిసిందే. ఏపీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అయితే… జనసేన తమ మిత్ర పక్షమేనా? అని ప్రశ్నించారు కూడా! పరిస్థితి ఇలా ఉంటే… పవన్ మనసులో మాత్రం 2014 బ్యాచ్ లా కలిసి వెళ్లాలని బలంగా ఉందని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో… బీజేపీ రిక్వస్ట్ పై పవన్ ఎలాంటి కండిషన్స్ పెడతారనేది ఆసక్తిగా మారింది.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో… ఎటూ బీజేపీ కేంద్ర పెద్దలకు పవన్ తో రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి.. తన రాజకీయ వ్యూహాలను, కోరికలను కూడా పవన్.. వారి ముందు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో జనసేన కలవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుందని కథనాలొస్తున్న తరుణంలో… ఇక బీజేపీ విషయంలో వేచి చూసే ధోరణి వదిలి… ఏదోలా బీజేపీ – జనసేన – టీడీపీ ల కలయికకు పవన్ పట్టుబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ఒకవేళ అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేయని పక్షంలో… బాబు కోసం మోడీతో విభేదిస్తారా.. లేక, మోడీ కోసం బాబు ని సైడ్ చేస్తారా అనంది వేచి చూడాలి. ఏది ఏమైనా… పవన్ ని మాగ్జిమం యుటిలైజ్ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ పెద్దలు… ప్రస్తుతానికి కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఫుల్ గా వాడేయాలని ఫిక్సయినట్లు సమాచారం.