రాజకీయాల్లో ఎదగాలంటే కష్టపడే తత్వంతోపాటు అదృష్టం, అధిష్టానం నాయకులతో మంచి అనుబంధం కూడా ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో మంది కష్టపడి పని చేస్తున్నా కూడా ఎదగలేరు. ఇప్పుడు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు పదేళ్లు అయినా కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. వైసీపీలో ఇలా కష్టపడుతున్న నేతల్లో ఇప్పుడు అసహనం పెరిగిపోయిందని ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒక వైసీపీ ఎమ్మెల్యే బీఎస్పీ నేతలకు అనుకూలంగా ఉంటూ, వైసీపీ నేతలను పట్టించుకోవడం లేదని ఎప్పటి నుండో పార్టీ కోసం పడుతున్న వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలుగా జెండా మోస్తే.. ప్రకాశం జిల్లాలో పక్కపార్టీ వారికి పదవులు ఇస్తున్నారని ఆ జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఒక వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జికి ఏకంగా వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇస్తున్నారట. ఏరోజు పార్టీకి పనిచేయని వ్యక్తి, వైఎస్ఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన వ్యక్తికి, జగన్ అంటే పడని వ్యక్తికి, బహిరంగంగా జగన్ ను తిట్టే వ్యక్తికి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇస్తున్నారంటే నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. తాము ఏం అయిపోవాలని నియోజకవర్గం వైసీపీ నేతలంతా వాపోతున్నారు.
10 పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న బీసీ నేతలకు ఇవ్వకుండా వైసీపీని వ్యతిరేకించిన వ్యక్తికి ఇవ్వడం సరికాదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుందని, ఆయన ఇచ్చిన పర్మిషన్ వల్లే ఈ ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నిర్ణయం కొన్ని సమీకరణాల వల్ల తీసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ నిజంగా ఈ నిర్ణయం తీసుకొని ఉంటే రానున్న రోజుల్లో వైసీపీ నేతలు పార్టీ నుండి వదిలి వెళ్లిపోతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.