చంద్ర బాబుపై ‘ఓటుకు నోటు’ కేసుకు ఐదేళ్లు

Cash for Vote case

ఓటుకు నోటు కేసుకు ఐదేళ్లు నిండిపోయాయి. ఈ కేసులో అప్పటి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటుకు కొనుగోలు చేయడానికి తెలుగుదేశం నాయకులు 2015  లో 50 లక్షల రూపాయలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఈ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటూ వై ఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఇంకా  విచారణకు రాలేదు. ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ, అవినీతి నిరోధక శాఖ అందించిన సమాచారంతో ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రమేయాన్ని తెలియజెప్పే ఆడియో టేపు వైరల్ అయింది.

Read Moreసోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న బిత్తిరి స‌త్తి ప్యాకేజ్..!

హైదరాబాద్ ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద కొత్త రాజధానిని వెదుక్కుంటూ హైదరాబాద్ విడిచి వెళ్ళిపోయింది ఈ కేసు వల్లనేనని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద కష్టం తెచ్చిపెట్టిన ఈ కేసుకు అందుకే అంత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఐదేళ్లు గడిచిపోవడంతో ఈ కేసు క్రమంగా ప్రజల జ్ఞాపకాల నుంచి క్రమంగా తొలగిపోతున్నట్టు కన్పిస్తోంది. చంద్రబాబు నాయుడు తల ఎగరేసినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కేసును ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు కేసీఆర్ రెండేళ్ల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More :  ర‌ఘురాంపై పోటీకి సై అన్న 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీ పృథ్వీ

ఈ కేసుపై కోర్టులలో విచారణ పెండింగ్ లో ఉండగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష జరపాల్సిన అవసరం ఎందుకొచ్చిందని  తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వర్ల రామయ్య అప్పట్లో ప్రశ్నించారు. దీనిపై టిఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ‘ఓటుకు నోటు’ తో సహా ఏ కేసుపైన అయినా సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉంట్టుందని వారు అన్నారు. ఈ కేసు విచారణను సత్వరం చేపట్టాలని, కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను 2019 ఫిబ్రవరికి వాయిదా వేసినా ఇప్పటికీ విచారణకు రాలేదు. ఈ కేసును విచారణకు చేపట్టే సమయంలో చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది వాదిస్తూ రాజకీయ శత్రుత్వంతోనే ఈ కేసు దాఖలైనందువల్ల దీనిని విచారణకు చేపట్టవద్దని కోరారు. చంద్ర బాబు  నాయుడుకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు ఆడియో టేపుల సాక్ష్యాధారాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

Read More : Osmania scares Bihar

కేసులో ఒక నిందితుడైన జెరూసెలం మత్తయ్య తాను అప్రూవర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నానని  సుప్రీం కోర్టుకు నివేదించడం మరొక ట్విస్ట్ . అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.