‘గేమ్ ఛేంజర్’‌కి చిరంజీవి దూరం.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించాల్సి వుందట. ఓ గెస్ట్ రోల్ కోసం దర్శకుడు శంకర్, మెగాస్టార్ చిరంజీవిని అడిగారట.

అయితే, చిరంజీవి అందుకు నో చెప్పారట. అందుకు కారణాలేంటో తెలీవు కానీ, చిరంజీవిని డైరెక్ట్ చేయాలని శంకర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ్. అయితే, ఈ లోపే తనయుడు రామ్ చరణ్ సినిమా కోసం శంకర్, చిరంజీవిని రిక్వెస్ట్ చేయగా, అంత పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చినట్లు లేదనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

బహుశా ‘ఆచార్య’ ఎఫెక్ట్ కూడా చిరంజీవి నో చెప్పడానికి ఓ రీజన్ కావచ్చని అనుకుంటున్నారు. కాదు కాదు, శంకర్‌తో త్వరలో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టే కారణమని ఇంకొందరు అనుకుంటున్నారు.

ఏది ఏమైనా, చిరంజీవి ఓకే అంటే, మరోసారి మెగా ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్‌ని తెరపై చూసే అవకాశం ఫ్యాన్స్‌కి దక్కి వుండేది. ఏమో, గుర్రం ఎగరా వచ్చు. శంకర్ ఇంకాస్త గట్టిగా అడిగితే, చిరంజీవి యస్ అనేయొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!