వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల రోమాన్ని కూడా పెకలించలేకపోయింది.
 
అత్యంత ప్రసిద్ధినొందిన తిరుమల, కాళహస్తి, షిరిడి, శ్రీశైలం లాంటి దేవాలయాలను మూసేశారు.  వందలకోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టిన కర్మాగారాలను, షాపింగ్ మాల్స్ ను,  బార్లు, ఆఫీసులను మూసేశారు.  రైళ్లను, బస్సులను, విమానాలను సైతం ఆపేశారు.  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు.  కఠినంగా అమలు చేస్తున్నారు.  ప్రజలు ఎవ్వరూ రోడ్ల మీదకు రావడం లేదు.   పోలీసులతో దెబ్బలు తినడం దేనికి, కేసుల్లో ఇరుక్కోవడం దేనికి అని కావచ్చు…అనవసరంగా గాలికి తిరిగి వైరస్ ను అంటించుకోవడం దేనికి అనే చింత కావచ్చు…
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయినప్పటికీ, ఆ రెండు మూడు గ్రామాల్లో పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం గుడారాలలోనుంచి లేవడం లేదు.  మూతులకు గుడ్డలు కట్టుకుని, చేతిలో ప్లకార్డులను పట్టుకుని, పచ్చ ఛానెల్స్ వారు నోటివద్ద  పెట్టే గొట్టాల ముందు రెచ్చిపోవడం, ముఖ్యమంత్రిని తిట్టిపోయ్యడం మాత్రం మానలేదు.   ఆ పచ్చ ఛానెల్స్ లో కూడా చాలావరకు ఆ పెట్టుడు నిరసనలను పట్టించుకోవడం తగ్గించాయి.  కానీ, టీవీ అయిదు అనే ఒకే ఒక్క దుష్ట నీచ నికృష్ట క్షుద్ర  ఛానెల్ మాత్రం ప్రపంచం మొత్తం కరోనాతో సర్వనాశనం అయినా సరే, ప్రళయం వచ్చి సముద్రాలన్నీ పొంగి యుగాంతం అయినా సరే,  పెయిడ్ ఆర్టిసుల పిల్లికూతలను ఇరవైనాలుగు గంటలు ప్రసారం చెయ్యడమే తమ లక్ష్యంగా, తాము అందుకోసమే జీవిస్తున్నామన్నంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.  
 
అసలు మనుషులు బయటకు వస్తేనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని,  ఏ వస్తువును ముట్టుకున్నా చేతులు కడుక్కోవాలని, వ్యక్తులు ఎవరూ ఒకచోట గుమికూడవద్దని  వైద్యులు, ప్రభుత్వం ఘోషిస్తుంటే ఈ ఆర్టిస్టులు అసలు లెక్క చెయ్యడం లేదేమి?   వీరందరిని రెచ్చగొట్టి నకిలీ ఉద్యమంలోకి దింపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం కరోనా భయంతో ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణలోని తన రాజభవనంలో భార్యాపిల్లలతో సుఖంగా సేదదీరుతున్నాడు.  మరి ఈ కూలీవారు మాత్రం ఆ గుడారాలలోంచి కదలడం లేదు.  
 
గత రెండు రోజులుగా దేశ ప్రధాని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అత్యంత మర్యాదగా ప్రజలకు విన్నపాలు చేస్తున్నారు.  లాక్ డౌన్ నిబంధనలు పాటించమని, ప్రజారోగ్యానికి సహకరించమని వేడుకుంటున్నారు.  మొదటిరోజు బతిమాలుకున్న పోలీసులు రెండోరోజు నుంచి లాఠీలకు పనిచెప్పారు.  కనిపించినవాడు బైక్ మీదొస్తున్నాడా లేక కారులో వస్తున్నాడా అని చూడటం లేదు.  బయటకి లాగి విరగ్గొడుతున్నారు.  రోడ్ల మీద బహిరంగంగా గుంజీలు తీయిస్తున్నారు.  ఫ్రెండ్లీ పోలీసులు తమలోని నిజమైన పోలీసులను బయటకు తీసి, తమ కుటుంబాలను కూడా వదిలేసి రాత్రనక పగలనక శ్రమిస్తున్నారు.  మరి వారి లాఠీలు ఆ రెండు గ్రామాల్లో ఎందుకు పని చెయ్యడం లేదు?  తొంభై ఎనిమిదో రోజు దీక్ష అంటూ ఈరోజు కూడా గుడారాల్లో కూర్చుని గోల చేస్తున్నారు.  
 
ప్రభుత్వం ఎందుకు వీరిమీద చర్యలు తీసుకోవడం లేదు?  అరిచి అరిచి వారే వెళ్ళిపోతారన్న అలక్ష్యం సాధారణ పరిస్థితుల్లో ఉపేక్షించ తగినదే.  కానీ, ప్రపంచం మొత్తం ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో వీరి ఆగడాలను సహించడం సమర్ధనీయమేనా?   రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని వికేంద్రీకరించాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయం కేవలం ఓ వందమంది కిరాయి జనం ఆపగలరా?    అసలు వీరంతా నిజంగా రైతులా?  కానే కాదు.  నిజంగా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు నష్టపోతే…ఒక్కో గ్రామం నుంచి వెయ్యి మంది వచ్చినా కనీసం పాతికవేలమంది ఉద్యమకారులు (రైతులు) కనిపించాలి కదా!  కానీ, ఏ టెంట్ దగ్గరకు వెళ్లినా  వందమంది కూడా కనిపించడం లేదు.  మిగిలినవారందరికీ నొప్పి లేదా?  ఎందుకుంటుంది?  అమరావతి పేరుతో చంద్రబాబు ఆడిన దుర్మార్గపు డ్రామాకు అక్కడి రైతులందరూ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించారు.  పది జన్మలు ఎత్తినా సంపాదించని డబ్బును సంపాదించి దర్జాగా బతుకుతున్నారు.  అమరావతి రాజధానిని నిర్ణయించింది ఎవరు?  కేంద్రమా?  న్యాయస్థానమా?  అయిదుకోట్లమంది ప్రజలా?    పోనీ, ప్రభుత్వమా?  కాదు కదా!  కేవలం తమ సామాజికవర్గం వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒక్క చంద్రబాబు, మరికొందరు పెట్టుబడిదారులు మాత్రమే అమరావతిని రాజధానిగా నిర్ణయించి భూముల త్యాగం పేరుతో కోట్లను సంపాదించారు.  వారివద్ద భూములను కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నష్టపోయారు.  చంద్రబాబును పరిశ్రమలను ఆకర్షించే సత్తా ఉన్న నేతగా ప్రపంచానికి ప్రాజెక్ట్ చెయ్యడానికి కొన్ని కులగజ్జి   పత్రికలు, కొందరు ఒళ్ళు కొవ్వెక్కిన కమ్మ సామాజికవర్గం వారు  చంద్రబాబుకు పెట్టుబడులు పెట్టారు.  అమరావతి బాండ్లు కొన్నది ఎవరు?  అమరావతి ఇటుకలు కొన్నది ఎవరు?  అందరూ ఆ కులం వారే కదా!   జగన్ అధికారంలోకి రాగానే వారంతా ఎటు పోయారో?  నిజమైన  పెట్టుబడిదారులు,  పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం మారినంత మాత్రానా పారిపోతారా?  ఎంతమందికి గుర్తుందో తెలియదు….2014  ఎన్నికల ప్రచార సమయంలో ఒక ఎన్నారై తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తూ “చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామంతా ఇండియా వచ్చి పెట్టుబడులు పెడతాము”  అని మీడియా ముందు వాగాడు.  ఆ తరువాత ఆయన పత్తాలేడు.  ఈ విధంగా చంద్రబాబు కాలంలో ప్రజలను మాయ చెయ్యడం, మోసం చెయ్యడం లక్ష్యంగా వచ్చిన పెట్టుబడులు చంద్రబాబు ఓడిపోగానే మాయమైపోయాయి!   జగన్ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం, తమ బానిస మీడియా ద్వారా దుష్ప్రచారం చెయ్యడమే ధ్యేయంగా వారి దుర్మార్గాలు సాగిపోతున్నాయి.  లేకపోతె, అమరావతి కదల్చడానికి వీలులేదని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు వెయ్యడం ఏమిటి?  ఆ రెండు కలిసి జగన్ వెంట్రుకను కూడా పీకలేవని వారికీ తెలుసు.  అయినప్పటికీ, అమాయక జనాన్ని ఎదో రకంగా మోసం చెయ్యాలి…చంద్రబాబు ప్రయోజనాలను కాచుకోవాలి.  తమ కులం వారిని రక్షించుకోవాలని కుత్సితపు ఆలోచనలు తప్ప మరొకటి ఉన్నదా?  కేవలం కులగజ్జి, మతపిచ్చితో ప్రభుత్వానికి చీకాకులు తెచ్చిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న సంఘవిద్రోహశక్తులను దునుమాడకుండా ఉదాసీనంగా వ్యవహరించడం ఎలా అంగీకరించగలం?  కనీసం ఇలాంటి క్లిష్టసమయాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని  దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం ఈ కుహనా ఉద్యమాలపట్ల నిర్దాక్షిణ్యంగా తన రాజధర్మాన్ని నిర్వర్తించాలి.  
 
“ఉత్తరాదిన మత పిచ్చి… దక్షిణాదిన కులపిచ్చి…
ఈ కులపిచ్చిని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపెయ్యాలి… 
అప్పుడు గానీ ఈ దేశం బాగుపడదు” 
ఎప్పుడో అరవై ఏళ్ళక్రితం రక్తకన్నీరు డ్రామాలో నాగభూషణం చెప్పిన డైలాగ్ అది!  ఇప్పటికీ వర్తించడం దురదృష్టం.  
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు