జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ అంత మంచివాడు కాదని, వైఎస్సార్ కు జగన్ కు అసలు పోలికే లేదంటూ నిన్న కొందరు వైఎస్సార్ సమకాలీనులు ఒక పచ్చ ఛానెల్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీరిలో జగన్ కు ఆగర్భ శత్రువు తులసిరెడ్డి ఒకరు. అలాగే సబ్బం హరి, మరికొందరు నాయకులు జగన్ మీద నిప్పులు కక్కుతుంటారు. వారి బాధ ఏమిటో వారికే తెలియాలి.
వైఎస్సార్ కాలంలో ఆయనకు అత్యంత సన్నహితంగా మెలిగిన కొందరు నాయకులు జగన్ కు దగ్గర కాలేకపోయారు. ఎందుకంటే జగన్ కన్నా తాము వయసులో, అనుభవంలో పెద్దవాళ్ళం అనే ఈగో వారిని వదలడం లేదు. అందుకే అప్పుడప్పుడు చుట్టపుచూపుగా టీవీల్లో, పత్రికసమావేశాల్లో నోళ్లు పారేసుకుంటారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. జగన్ తన సొంత పార్టీకి నాయకుడు. వైఎస్ సోనియాగాంధీ నీడలో ముఖ్యమంత్రిగా ఎదిగి చివరకు సోనియానే శాసించే స్థాయికి కేవలం తన పాలనాదక్షతతో ఎదిగిన స్వయంప్రకాశం కలిగిన నాయకుడు. జగన్ తన సొంత నీడను తానే ఏర్పాటు చేసుకుని మహావృక్షంగా ఎదిగి వేలాదిమందికి నీడను కల్పించిన నాయకుడు. వైఎస్ ఎంత గొప్ప నాయకుడైనా సోనియా ఆదేశిస్తే పదవి వదులుకోవాల్సిందే. కానీ, జగన్ ను దించడం ప్రజలకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. ఈ మర్మాన్ని గ్రహించకుండా, కొందరు వృద్ధతరం నాయకులు కేవలం అసూయ, ద్వేషంతో జగన్ ను విమర్శిస్తారు. వారంతా జగన్ గూర్చి ఊహించుకున్నది వేరు..కానీ, ఇప్పుడు వారు చూస్తున్న త్రివిక్రమావతార సముడైన జగన్ వేరు!
Read More : బాలీవుడ్ లో మరో విషాదం
ఇక నిన్న వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన సమధికోత్సాహంతో జరుపుకున్నారు. వైఎస్ జన్మదినోత్సవాన్ని “రైతు దినోత్సవం” గా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. జీవితాంతం రైతుల మేలుకోసం పరితపించిన మహా నాయకుడు వైఎస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ, వారి మరణాంతరం వారిని పట్టించుకున్న వారు లేరు. ఎవ్వరూ ప్రజల మదిలో చోటు సంపాదించలేకపోయారు. వారి పుత్రరత్నాలు పండితపుత్రులుగా మిగిలిపోవడంతో పాపం దివంగతనేతలకు కనీసం నివాళులు అర్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఎన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నప్పటికీ, ఒక్కరు కూడా తండ్రి పేరును నిలబెట్టే సమర్థులు లేకపోవడం ఎన్టీఆర్ దురదృష్టం. వందలకోట్ల రూపాయలను ఎన్టీఆర్ వారికి సమకూర్చి పెట్టినా, ఎన్టీఆర్ పేరుతో ఒక్క అవార్డు ను నెలకొల్పి సినిమారంగం, రాజకీయరంగ ప్రముఖులను ఆహ్వానించి ప్రదానం చేసి తండ్రి పేరుతో ఏడాదికి కనీసం రెండు మంచి కార్యక్రమాలు అయినా చెయ్యాలన్న కనీస ఆలోచన కూడా రాని పరమశుంఠలు.
Read More : Sad- Yet another Kannada actor passes away
అలాగే మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి సమర్థులు రాష్ట్రాన్ని పాలించారు. అయినప్పటికీ వీరి వారసులు ఒక్కరు కూడా కనీసం సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలిచే దమ్మున్నవారు కారు. అందరూ నిష్ప్రయోజకులు. రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి కడుపున పుట్టినవాడు ముఖ్యమంత్రి కావడం వైఎస్ జగన్ తోనే మొదలైంది. జగన్ లాంటి ప్రయోజకుడు, వీరుడు తన రక్తం పంచుకుని జనించడం వల్లనే ఇవాళ వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని రాష్ట్రం మొత్తం పండుగలా జరుపుకుంది. అలా జరుపుకునేట్లు చేసిన జగన్ ధన్యజీవి. తండ్రి బాటలోనే నడుస్తూ సంక్షేమ రధాన్ని పరిగెత్తిస్తూ అన్ని వర్గాల ఆదరణ చూరగొంటున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలవలన లబ్ది పొందని కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు. గ్యాస్ మీద వచ్చిన సబ్సిడీ యాభై రూపాయలను అందుకోని కుటుంబం ఉన్నదా? ప్రాంతభేదం లేకుండా తెలంగాణాలో కూడా నీటి ప్రాజెక్టులను, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఔటర్ రింగ్ రోడ్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి బీజం వేశాడు. మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు తొలిసారిగా చోటు కల్పిస్తే, అందులో నలుగురు మహిళలు తెలంగాణ ప్రాంతం వారు. అతి క్లిష్టమైన హోమ్ మంత్రి బాధ్యతలను తెలంగాణ మహిళ సబితా ఇంద్రారెడ్డికి అప్పగించిన సాహసి వైఎస్.
Read More : Will Jagan take Modi’s cabinet offer?
అలాగే తండ్రి బాటలో నడుస్తూ ముప్ఫయి ఏళ్ళు కూడా లేని పుష్పశ్రీవాణిని ఏకంగా ఉపముఖ్యమంత్రిగా చెయ్యడమే కాకుండా, దళిత మహిళ మేకతోటి సుచరితను హోమ్ మంత్రిగా నియమించి తండ్రి సాహసాన్ని పుణికిపుచ్చుకున్న ధైర్యవంతుడు జగన్. అలాంటి జగన్ ను ఈ పనికిమాలిన వృద్ధ జంబూకాలు విమర్శిస్తుంటే మత్తేభం నడుస్తుంటే వీధి భైరవాలు రొప్పుతున్నట్లు లేదూ!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు