కమ్మ కరోనాతో కుళ్లిపోతున్న రాధాకృష్ణ 

“తలనుండు విషము ఫణికిని 
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ 
దలతోక యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!”  
 
భవిష్యత్తులో ఏనాటికైనా వేమూరి రాధాకృష్ణ వంటి ఖలుడు పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి ఒక పత్రికకు సంపాదకుడై పాత్రికేయ విలువలను భ్రష్టు పట్టిస్తాడని  బద్దెన మహాశయుడు వందల ఏళ్ళక్రితమే ఊహించి పై సత్యాన్ని కందపద్యం ద్వారా ప్రబోధించాడు!  
 
నరనరానా కమ్మగజ్జిని నింపుకుని, ఇతర కులస్తులను విపరీతంగా ద్వేషించే రాధాకృష్ణ లాంటి క్షుద్రజీవులు ఎంతో గౌరవనీయులైన  కమ్మకులంలో పుడతాడని ఎవరు ఊహించారు?  జగన్మోహన్ రెడ్డి ఏ చర్య తీసుకున్నా దానికి కమ్మ గజ్జిని అంటించి వాడి అయిన దువ్వెనతో గోక్కోవడం, రసి కార్చుకుని హాయిని అనుభవించడం   ఆయనకు పుట్టుకతో అబ్బింది.   ఈవారం తన చెత్తపలుకులో  కమ్మగజ్జిని కురుక్షేత్రంలో  శ్రీకృష్ణుని విశ్వరూపంలా ప్రదర్శించాడు.  
 
 ”మనమంతా ప్రజా సేవకులం.. ప్రజలు అధికారమిచ్చింది వారికి సేవ చేయడానికి మాత్రమే”.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్న మాటలివి. పది నెలలు గడిచేసరికి ‘అధికారమంతా నాదే.. మరే ఇతర రాజ్యాంగబద్ధమైన సంస్థకు కూడా అధికారాలు ఉండవు’ అని హూంకరిస్తున్నారు.”
 
మొన్న సుప్రీమ్ కోర్ట్ తన తీర్పులో ఏమని చెప్పింది?  స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఎన్నికల కమీషనర్ ను తలంటిందా లేదా?  అలాగే ఎన్నికల తేదీలను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయించాలని, ఎన్నికలు వాయిదా వేసిన తరువాత కోడ్ ఎలా అమలులో ఉంటుందని నిలదీసిందా లేదా?  దీన్నిబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియంతగా, తనకు తానే వ్యవస్థగా భావించి లేని అధికారాలు చెలాయించడాన్ని కోర్ట్ తప్పు పట్టింది కదా!    కోర్ట్ కు వెళ్లడం ద్వారా ఎన్నికల కమీషన్ హద్దులు ఏమిటో జగన్ తెలియజెప్పాడు.  ఆ మాటను మాటమాత్రం కూడా రాయకపోవడం రాధాకృష్ణ గడుసుదనం మరి!  
 
***
 
“రమేశ్‌కుమార్‌ పేరిట ఆయన సంతకంతో ఉన్న లేఖను ఆకాశరామన్న లేఖ అని ప్రచారం చేయడం వైసీపీ నాయకులకే చెల్లుతుంది. రమేశ్‌కుమార్‌ లేఖ రాసిన విషయం వాస్తవమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితిలో ఉన్న వైసీపీ నాయకులు.. ”రమేశ్‌కుమార్‌ అలా ఎలా లేఖ రాస్తారు?” అంటూ తిట్ల దండకం మొదలెట్టారు. “
 
వైసిపి నాయకుల సంగతి పక్కన పెడదాము.   ఇంతకూ ఆ లేఖను రమేష్ కుమార్ రాశారా?  విలేఖరులు అడిగినపుడు తాను ఆ లేఖను రాయలేదని ఎందుకు చెప్పారు?  తానే రాస్తే, రాశానని చెప్పడానికి ఎందుకు భయం?  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాడు..చంద్రబాబు చెప్పాడు…లోకేష్ చెప్పాడు…ఇంకా రాధాకృష్ణ కూడా చెప్పాడు.  ఒప్పుకుందాం.  మరి అసలు విలన్ ఎందుకు చెప్పడు?  “ఆ లేఖను ఆకాశరామన్న రాశాడో లేక ఆకాశచంద్రన్న రాశాడో అని దక్షిణభారతానికి బీజేపీ అధికారప్రతినిధి జీవీఎల్ చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?  “ఎన్నికల కమీషనర్ లేఖను రాస్తే దానికి అధికారిక మెయిల్ ఐడి ఉంటుంది.  రాస్తే ఆ మెయిల్ ద్వారానే రాయాలి తప్ప వ్యక్తిగత మెయిల్ నుంచి రాయడం కుదరదు”  అని మరొక బీజేపీ నాయకుడు కోట సాయికృష్ణ చెబుతున్నాడే!   ఒక రాజ్యాంగ వ్యవస్థ రాశారని చెప్పబడుతున్న లేఖ మీద ఇంత గందరగోళమా?  అవ్వ!!   గతంలో ఎన్నడైనా చూశామా ఈ విడ్డూరం! 
 
***
 
 “అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నేతల్లాగా దిగజారి ఎన్నికల కమిషన్‌పై నిందారోపణలు చేయలేదు.”
 
అరెరెరెరె…ఇది మైమరపా?  లేక ప్రజలను వెర్రివాళ్ళుగా భావించే రుగ్మతా?    శాసనసభ ఎన్నికలు అయిపోగానే శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు తన రౌడీమూకను వెంట వేసుకుని ఎన్నికల కమీషనర్ ఆఫీసుకు వెళ్లి ఆయన్ను నానా దుర్భాషలు ఆడిన విషయం, ఆయనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వేళ్ళు చూపి బెదిరించిన వైనం బుర్రలో కులబూజు నిండిన  రాధాకృష్ణ మరచాడేమో కానీ, జనం మరచిపోతారా?  
 
” ఎన్నికల తేదీలను తాను ప్రకటించక ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని అభ్యంతరపెట్టవలసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్థులను అడ్డుకున్నప్పుడే చర్యలు తీసుకుని ఉండాల్సింది. నిష్పక్షపాతంగా వ్యవహరించని అధికారులను అప్పుడే బదిలీ చేసి ఉండాల్సింది. ఈ అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఆయన ఆయా ఘటనలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు.”
 
నిజమే మరి…ఎందుకు మౌనంగా ఉన్నాడు నిమ్మగడ్డ?   స్థానిక సంస్థలకు  ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదే కానీ, తనది కాదని ఆయనకు తెలుసేమో?   రాష్ట్రంలో వైసిపి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, మళ్ళీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీదే విజయం అని రాధాకృష్ణ, రామోజీ లాంటి క్షుద్రకీటకాలు ప్రతిరోజూ రొదచేస్తున్నాయి కనుక చంద్రబాబుకే ఎక్కువ సీట్లు వస్తాయని నిమ్మగడ్డ అమాయకంగా నమ్మేశాడు గనుక…. తీరా నామినేషన్లు వేశాక ఇరవైనాలుగు శాతం వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవాలు కావడంతో చంద్రబాబు కంగు తిని ఎన్నికలకు బ్రేక్ వేయించాడని లోకమంతా కోడై కూస్తున్నది కదా!  
 
“శాసనసభల స్పీకర్లకు ఎవరూ ఆదేశాలు జారీ చేయలేని వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది. ఈ పరిస్థితిని పలు రాష్ట్రాల్లో దుర్వినియోగం చేస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతోంది. “
 
సభాపతులకు ఆదేశాలు జారీ చెయ్యలేని వెసులుబాటు రాజ్యంగంలో ఉన్నది.  నిజమే అనుకుందాం.  మరి అలాంటి  వెసులుబాటు ఉంటె మొన్ననే మధ్యప్రదేశ్ సభాపతి నిర్ణయాన్ని సుప్రీమ్ కోర్ట్ ఎందుకు పక్కన పెట్టింది?  బలపరీక్షను కేవలం పరిరోజులు వాయిదా వేస్తె..సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకుని కమల్ నాథ్ ప్రభుత్వం ఉసురు ఎలా తీయగలిగింది?  ఇదే సుప్రీమ్ కోర్ట్ చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా మానభంగం చేసినపుడు సభాపతి అధికారుల్లో జోక్యం చేసుకోబోమని ఎందుకు పలికింది?  
 
***
 
” ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, ఆయన అనుయాయులకు కమ్మ కులస్థులపై ఏ స్థాయిలో ద్వేషం ఉందో ఈ ఉదంతంతో మరింత తేటతెల్లం అవుతోంది. ఇతర కులాల వారిలో కమ్మవారిపై ద్వేషాన్ని వ్యాపింపజేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కూడా ఆ కులంవారిని అంటరానివారుగా చూస్తున్నారు. ఆ కులంపై కక్షతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్న ఆయన.. అంతటితో ఆగకుండా అడుగడుగునా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కమ్మవాడే కావొచ్చు గానీ చంద్రబాబుకు, ఆయనకు సరిపడదు…”
 
అసలు కమ్మకులం గూర్చి మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగుదేశం పార్టీకి తరువాత అని చెప్పుకోవాలి.  1980  ల వరకు అసలు తెలుగువారిలో కమ్మ రెడ్డి భేదం చాల తక్కువ.  కమ్మవారు వ్యాపారవేత్తలుగా, రైతులుగా, పెద్దమనుషులుగా, ఉపాధిని కల్పించేవారుగా గొప్ప కీర్తిని, ప్రతిష్టను సమాజంలో అనుభవిస్తున్నారు.  అక్కడక్కడా ఒకరిద్దరు ఉంటె ఉండవచ్చు కానీ, రెడ్డి కులస్తులు రాజకీయాల్లో ఉంటె కమ్మ కులస్తులు సమాజసేవ, వ్యాపారాల్లో రాణించారు.  గొప్ప దాతలుగా, వదాన్యులుగా, విద్యాసంస్థలకు ఆద్యులుగా గణుతికెక్కారు.  అలాంటి సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి మొదటిసారిగా రాష్ట్రంలో కులచిచ్చు రగిలించారు.  ఆయనకు రామోజీరావు తోడై రాష్ట్రంలో కులమంటలను రేపారు.  ఇక చంద్రబాబు కరాళహస్తాల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయాక వెంకయ్యనాయుడు, రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కులగజ్జి పార్టీగా తయారు చేశారు.  మిగిలిన అన్ని కులాలవారు కమ్మ వారిని అసహ్యించుకునేట్లుగా, ద్వేషించేట్లుగా తయారు చేశారు.  నిజానికి చంద్రబాబు అమరావతిలో రాజధాని ప్రకటించడం కేవలం తన సామాజికవర్గం వారు అధికంగా నివసించే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ రెండు జిల్లాలను కమ్మ ప్రాబల్యం గలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తప్ప మరో ఉద్దేశ్యం లేనే లేదు.  చంద్రబాబు వచ్చాకే కమ్మసంఘాలు పెరిగాయి.  మిగిలిన కులాలను కమ్మవారు ద్వేషించడం కూడా చంద్రబాబుతోనే మొదలైంది.  ముఖ్యంగా కమ్మవారిని  బ్రాహ్మణ ద్వేషులుగా మలచడంలో చంద్రబాబు విజయం సాధించాడు.   నిజానికి చంద్రబాబు కరుడుగట్టిన బ్రాహ్మణ ద్వేషి.  2014 , 2019 ఎన్నికల్లో ఒక్క బ్రాహ్మణుడికి కూడా చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదంటే ఆ పార్టీలో బ్రాహ్మణద్వేషం ఎంతగా అంటువ్యాధిలా వ్యాపించిందో అర్ధం చేసుకోవచ్చు.  అనాదిగా బ్రాహ్మణులను ఎంతో గౌరవించే కమ్మవారు బ్రాహ్మణ ద్వేషులుగా మారిపోవడంతో చంద్రబాబు, వెంకయ్య నాయుడుల పాత్ర సామాన్యమైనది కాదు.  “మరో యాభై ఏళ్లపాటు మన కులం వారే అధికారంలో ఉండాలని” కులసంఘాలు నిర్వహించిన వనభోజనాల్లో నాటి సభాపతి కోడెల శివప్రసాదరావు వదరుబోతుతనం ప్రదర్శించాడంటే రాష్ట్రానికి  తెలుగుదేశం ఎక్కించిన కులపిచ్చి ఎంతగా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  ఇవాళ రాష్ట్రంలో కులపిచ్చి ముదిరిపోవడానికి కారణం ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయే.  ఇతర కులాలవారిని తక్కువచేసి మాట్లాడటం కూడా ఈ దేశంలో ఒక్క చంద్రబాబు మాత్రమే చెయ్యగలడు.  
 
***
 
“కమ్మ కులం వారిని పోలీసు శాఖలో వేధిస్తున్నా, ఇతర స్థానాల్లో ఉన్న అధికారులను మానసికంగా కుళ్లబొడుస్తున్నా కమ్మ సంఘాలు మాత్రం నోరు మెదపలేదు. అది సంస్కారమో, పిరికితనమో తెలియదు.    ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారతారు అని చెప్పడానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నామని వైసీపీకి చెందిన రెడ్డి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో కమ్మ ద్వేషం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ!”
 
కమ్మకులం వారిని పోలీసు శాఖలో వేధిస్తున్నా….అనగా అతిపెద్ద అవినీతిపరుడు ఎబి వెంకటేశ్వరరావును దృష్టిలో పెట్టుకుని రాధాకృష్ణ తన బాధను వ్యక్తం చేసి ఉండవచ్చు. ఈ ఎబి వెంకటేశ్వరరావుకు ట్రిబ్యునల్ లో కూడా చుక్కెదురైంది.  మరి కాట్ వారు కూడా కులాన్ని చూసే ఆ అధికారి సస్పెన్షన్ ను సమర్ధించారా?  ఆస్తులపై మమకారం ఎవరికైనా ఉంటుంది ఒక్క సంపాదించడం చేతకాని దరిద్రులకు తప్ప.  కమ్మవారు ఎన్నడూ అవమానాలను భరిస్తూ ఆస్తులు సంపాదించలేదు.  దర్జాగా వ్యాపారాలు చేస్తూ తమ అంతస్తులను పెంచుకున్నారు తప్ప ఎవరికో భయపడుతూ, బానిసగా బతుకుతూ డబ్బు సంపాదించలేదు.    కరణం బలరాం, వంశీ మొదలైన వారు చంద్రబాబుకు భవిష్యత్తు లేదని వైసిపిలో చేరారు తప్ప అవమానాలు భరించి కాదు.  ఎన్టీఆర్ లాంటివాడినే ఎదిరించిన చరిత్ర బలరాం కు ఉన్నది.  తన నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ ను ప్రోత్సహించి తనను అవమానాల పాలు చేసినందుకే ఇప్పుడు చంద్రబాబుపై బలరాం ప్రతీకారం తీర్చుకున్నాడనే నిజం రాధాకృష్ణకు తెలియదంటే నమ్మలేము.  
 
***
 
ఒక పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న రాధాకృష్ణ కులం పేరుతో ఇంత పెద్ద ఏడుపు ఏడవడం పత్రికారంగానికే అవమానం.  కులగజ్జి కరోనాకన్నా వేగంగా ఒడలంతా పాకిపోయిన రాధాకృష్ణ పాచినోట ఇలాంటి కులదుర్గంధ రోదనలు తప్ప మోహనరాగాలు వినిపిస్తాయా?  పన్నీటితో స్నానం చేయించినా, పంది సుఖాన్ని అనుభవించేది మురికిగుంటలోనే!   
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు