వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! 

“సలహా అనేది ఆముదం లాంటిది.  ఇవ్వడం చాలా సులభం.  పుచ్చుకోవడం మాత్రం బహు కష్టం”  అన్నారు మన పెద్దలు.  ఇతరులకు సలహాలు ఇవ్వడంలో నోబెల్ బహుమతికి అర్హుడైన మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధల గాధలు చికిత్సకు లొంగని సుఖరోగంలా వారం వారం పెరిగిపోతున్నాయి తప్ప రవంత కూడా తగ్గుముఖం పడుతున్న జాడ కనిపించడం లేదు.  ప్రతివారం గుండెలు బాదుకుని రోదించే తన అసిధారావ్రతాన్ని ఈవారం కూడా “తప్పంటే…రాక్షసులేనా” అనే ఈకలు రాలిన మకుటంతో  “చంద్రబాబు స్తుతి-జగన్ నింద” అనే ఫార్ములాను ప్రయోగించి ప్రజలను వంచించడానికి ప్రయత్నించాడు.  
 
“జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు వంచనతో కూడినవి కాగా, మరికొన్ని నిరుపయోగం కాబోతున్నాయి.  ఎప్పటినుంచో అమలులో ఉన్న స్కాలర్‌షిప్పులు, మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీల చెల్లింపులవంటివన్నీ నిలిపివేసి జగనన్న విద్యా వసతి దీవెన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి ఒకేసారి నగదు చెల్లింపు చేయడం వల్ల ఆ సొమ్ము దుర్వినియోగం అవుతుందే గానీ విద్యార్థులకు ఉపయోగపడదు. గతంలో ప్రభుత్వాలు నెలవారీగా మెస్‌ చార్జీలు విడుదల చేసేవి. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి చెల్లిస్తే.. అవి ఇతర అవసరాలకు వాడేసుకుంటే పిల్లలకు తిండి సమకూరేది ఎలా?”
 
భళారే  రాధాకృష్ణా!  జగనన్న విద్యావసతి దీవెన (ఈ పేరు ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు….అది వేరే సంగతి) కింద ఏడాదికి ఒకేసారి డబ్బు విడుదల చేయడం వలన దుర్వినియోగం అయిపోతుందట..నాకు తెలియక అడుగుతాను రాధాకృష్ణా…ఆ డబ్బును పిల్లలకు ఇస్తారా లేక తల్లులకు ఇస్తారా?  పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో తల్లులు సినిమాలు చూసి, ఏడువారాల నగలు చేయించుకుని తమ కన్నబిడ్డల భవిష్యత్తును బజారు పాలు చేసుకుంటారా?  రాధాకృష్ణ మట్టిబుర్రకు ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి పత్రికకు, నవ్య వార పత్రికకు ఆరు మాసాల చందా, ఏడాది చందా, జీవిత చందా అని కట్టించుకుంటారు కదా…ఆ చందాలు తీసుకుని,   సొంత అవసరాలకోసం వాడుకుని  చందాదారులకు  పత్రికలు పంపకుండా శఠగోపం పెట్టె అలవాటు ఏమైనా ఉందా?  
 
***
 
“కొన్ని పత్రికలు, న్యూస్‌ చానెళ్లు రాక్షసులుగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిట్టిపోయడం మొదలెట్టారు. తొమ్మిది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా జగన్‌ మీడియాను తిట్టిపోశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ ధోరణి పెరుగుతోంది. గిట్టని న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం.”
 
అడ్డెడ్డెడ్డే…ఎన్నో సెగగడ్డలు కోశాను కానీ నా గడ్డను కోసినప్పుడు కలిగినంత నెప్పి ఎప్పుడూ చూడలేదు అని ఎవరో డాక్టర్ ఏడ్చినట్లు….చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సాక్షిని తీవ్రంగా విమర్శించినపుడు, అనేకసార్లు సాక్షి ప్రసారాలను నిలిపివేయించినపుడు, సాక్షి పత్రిక ఆఫీసుల్లో సిబిఐ, సీఐడీ అధికారులను పంపించి సోదాలు చేయించి వారిని భయభ్రాంతులకు గురిచేసినపుడు, సాక్షి పత్రికను చదవొద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బహిరంగంగా పిలుపు ఇచ్చినపుడు,  సాక్షికి ప్రకటనలు నిలిపేసినపుడు,  తన మీడియా సమావేశాలకు సాక్షిని బహిష్కరించినపుడు, సాక్షిని టాయిలెట్ పేపర్ గా తెలుగుదేశం రాక్షసులు దుమ్మెత్తిపోసినపుడు రాధాకృష్ణకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు!  
 
***
“మీడియా సంస్థలు విమర్శలకు అతీతం కాకపోయినా, రాజకీయ పార్టీలు సహనం కోల్పోయి మీడియాకు కులం, రాజకీయం పులుముతుండటం తెలుగునాట అధికంగా ఉంటోంది. ఒకప్పుడు మీడియాలో అవాస్తవ వార్తలొస్తే ఆయా ప్రభుత్వాలు వివరణలు పంపేవి. ఇప్పుడు అలా కాకుండా ఎదురుదాడికి దిగుతున్నాయి. “
 
హమ్మయ్య…మీడియా మీద విమర్శలు చేయడం మహానేరం అన్నట్లు తొలిపలుకుల్లో వదరిన రాధాకృష్ణ అంతలోనే ప్లేటు ఫిరాయించి మీడియా సంస్థలు విమర్శలకు అతీతం కావని అంగీకరించినందుకు సంతోషం.  ఇక మీడియాకు కులం, రాజకీయం పులమడం తెలుగునాట అధికంగా ఉందట!  ఈ కులం, పులుముడు వ్యాధి తెలుగునాట ఎప్పుడు మొదలైంది?  ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన నాడు బీజం పడి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహావృక్షమై, నచ్చినవారికి చల్లని నీడ, నచ్చనివారికి చండ్రనిప్పులు అనే సూత్రాన్ని అమలు చెయ్యడం మొదలుపెట్టింది.  ఒకప్పుడు పత్రికల్లో అవాస్తవ వార్తలు చాలా అరుదుగా వచ్చేవి.  నెలకు ఒకసారో, రెండుసార్లో పొరపాట్లు దొర్లేవి.  వాటిని గమనించి ప్రభుత్వ సమాచారశాఖవారు వివరణలు పంపితే వాటిని కూడా ప్రచురించి తమ నిబద్ధతను చాటుకునేవి ఒకప్పుడు.  మరి నేడు?  గిట్టనివారిపై అబద్ధాల కూతలు కూయడం,  వారి రాజకీయభవిష్యత్తును సర్వనాశనం చెయ్యడం కోసం కట్టుకథలు ప్రచురించి వ్యక్తిత్వహననానికి పాల్పడటం  కులగజ్జి పత్రికలకు దినచర్యగా మారింది.  వాటిలో ఆంధ్రజ్యోతిది బంగారుపతకం అందుకోవలసినంత ఘనకీర్తి!  జగన్ మీద ఒక క్షుద్ర అధికారి అక్రమకేసులను బనాయించి అరెస్ట్ చేయించి బెయిల్ కూడా రాకుండా అడ్డుకున్నపుడు ఎన్నెన్ని అబద్ధాల వార్తలు ప్రచురించాయి ఆ రెండు పత్రికలు!  కడపలో ఉక్కు కర్మాగారం పెడతామంటే అక్కడ లేళ్ళు, సెలయేళ్ళు, గుళ్ళు గోపురాలు, పచ్చని ప్రకృతి ప్రళయతాండవాలు చేస్తున్నాయని తప్పుడు కూతలు రాసింది ఈ రెండు క్షుద్రపత్రికలు కావా?  మన తెలుగునాట ఈ కులగజ్జి పత్రికల రోత బూతు రాతలను ఖండిస్తూ వివరణలు ఇవ్వాలంటే ప్రభుత్వ సమాచారశాఖ వారు ఒక పదిమంది సిబ్బందితో ప్రతిరోజూ రాధాకృష్ణ ఆఫీసులోనే మరొక చేంబర్ లో కూర్చోవాలి.
 
***
“ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాడే మీడియా పట్ల తనకున్న అక్కసు బయటపెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా మీడియాను రాక్షసులుగా అభివర్ణించారు. అధికారంలోకి రాకముందు కూడా ఆయనకు స్థానిక మీడియా పట్ల చిన్నచూపు ఉండేది. ఈ కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పర్యాయం కూడా తెలుగు మీడియాతో ఆయన మాట్లాడలేదు. తాను అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలో కొనసాగడానికి గానీ తన సొంత మీడియా చాలు.. ఇతర మీడియా అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టున్నారు.”
 
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాడే మీడియాపట్ల అక్కసు…అంటూ వెర్రివాగుడు వాగే రాధాకృష్ణ…జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే తన అక్కసును కక్కసులో కక్కిన  నీళ్ల విరేచనంలా  కక్కడం మొదలు పెట్టిన వాస్తవాన్ని మర్చిపోతున్నారు.   లేచినప్పటినుంచి అబద్ధాలు, అవాస్తవాలు, కులగజ్జి రాతలు రాసుకుంటూ చంద్రబాబు విసర్జించే అశుద్ధాన్ని శరీరమంతా సుగంధంలా పూసుకుంటూ పచ్ఛాభజనలో తరించిపోతున్న తెలుగుమీడియాతో ఏమి మాట్లాడాలి?  ఇక తాను అధికారంలోకి రావడానికి సొంత మీడియా చాలు అనుకుంటున్నాడని విషం కక్కే రాధాకృష్ణ..మీడియాతోనే విజయం వరించేట్లయితే 2014  ఎన్నికల సమయంలో కూడా జగన్ కు సొంత మీడియా ఉన్నది.  అప్పుడెందుకు ఓడిపోయాడు?  పచ్చ మీడియా మొత్తం కట్టగట్టుకుని చంద్రబాబుకు స్తోత్రాలు, భజనలు చేసినా, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు చిత్తుగా ఓడిపోయాడు?  రాధాకృష్ణ దగ్గర ఉన్న జవాబు ఏమిటి?  జగన్ తొలినుంచి జనాన్ని నమ్ముకున్న నాయకుడే తప్ప మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకోలేదు.  రాధాకృష్ణకు ఈ చేదునిజం తెలియనిది కాదు.  ఏదో..కాస్త బురద చల్లాలి.. అంతే!  
 
***
“అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేసిన కియ మోటార్స్‌ సంస్థ తమిళనాడుకు తరలిపోవాలని భావిస్తున్నట్టు ఆ మధ్య రాయిటర్స్‌ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించగా.. అదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అని నిందించారు. రాయిటర్స్‌ సంస్థను ప్రభావితం చేయగల శక్తి చంద్రబాబుకు ఉంటుందా? అసంభవం”
 
అయ్యో…చంద్రబాబు శక్తి తెలియనట్లు రాధాకృష్ణ ఏమి నాటకాలు ఆడుతున్నాడు!  రాయిటర్స్ తాను ప్రచురించిన తప్పుడు వార్తకు విచారం వ్యక్తం చేస్తూ మరొక ప్రకటన కూడా చేసినట్లు గుర్తు!  ఆ విషయమే ఎక్కడా ప్రస్తావించలేదేమిటి రాధాకృష్ణా?  రాయిటర్స్ సంస్థతో సంబంధాలు కలిగిన సంస్థకు వందలకోట్ల రూపాయల కాట్రాక్టును చంద్రబాబు కట్టబెట్టినట్లు,  ఆ తప్పుడు వార్తలు వండి వడ్డించింది ఆ సంస్థవారే అన్న నిజం ప్రపంచం మొత్తం తెలిసినా, రాధాకృష్ణ లాంటి గుడ్డిపిల్లికి తెలియకపోతే మనమేం చేస్తాం?  
 
***
“రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్‌రెడ్డి కాదా? ఇందులో మీడియా పాత్ర ఎక్కడ? పుండు మీద కారం చల్లినట్టుగా రైతులను మరింత మనోవ్యథకు గురిచేయడానికే ఇటువంటి నిర్ణయాలు దోహదపడతాయని విమర్శించకుండా ఎవరైనా ఎందుకుంటారు? మంత్రులు అన్నట్టుగా ఎడారిలోనో, శ్మశానంలోనో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పేదలకు మాత్రం ఏమి ఉపయోగం?”
 
అవును మరి!   పేదలకు రాజధాని నడిబొడ్డున ఇళ్ల స్థలాలు ఇవ్వడం పరమఘోరం.  వారిని నగరశివార్లలో నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలోనే అంటరానివారుగా ఉంచాలి.  విలాసవంతమైన మహళ్లను నిర్మించుకుని,  చంద్రబాబు లాంటి కోటీశ్వరులు మాత్రమే నగరాల్లో ఉండాలి!  రాజధానిలో అక్రమార్కులు, దోపిడీదారులకు పదెకరాలు, ఇరవై ఎకరాలు ఇచ్చినా దోషం లేదు.  పేదవాడికి సెంటు భూమి ఇస్తే మాత్రం అది ఉరిశిక్షకు పాత్రమైన నేరం!  చంద్రబాబు అమరావతిని ఎవరికోసం నిర్మించాలనుకున్నాడో ఈ వాక్యాలతో స్పష్టమై పోయింది కదూ!   అయినా, ఊరిబయట, కాల్వగట్ల మీద, నదుల ఒడ్డున గుడిసెలు వేసుకుని అనునిత్యం భయంతో జీవించే పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇస్తామంటే ఎంత పేదవారైనా వద్దంటారా?    కష్టించి పనిచేసుకునే పేదలకు రాజధాని ప్రాంతం అయితే ఏమిటి?  ఎడారి ప్రాంతం అయితే ఏమిటి?  రాజధానిలో చేసుకోవడానికి వారికి పనులు దొరకవా?  ఏమిటి ఈ వితండం రాధాకృష్ణా?  
 
***
“తాను ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే, అసూయతో, కడుపు మంటతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది జగన్మోహన్‌రెడ్డి అభిప్రాయం. ఉద్దేశం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల ఓట్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో దాదాపు పది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పసుపు–కుంకుమ పేరిట పంచిపెట్టారు. అయినా ప్రతికూల ఫలితమే వచ్చింది కదా? ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రకటించి అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు వంచనతో కూడినవి కాగా, మరికొన్ని నిరుపయోగం కాబోతున్నాయి.”
 
‘పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం’ అని చెప్పాడట!  మన రాధాకృష్ణ వైఖరి కూడా అలాగే ఉంది కదూ!  ఎన్నికలకు ఆరు నెలలముందు ప్రజలను మోసం చెయ్యడానికి హడావిడిగా చంద్రబాబు పసుపుకుంకుమ, అన్నదాతా సుఖీభవ పేర్లతో ఇతర సంస్థలకు కేటాయించిన నిధులను హాంఫట్ చేసి ఓట్లను కొనుగోలు చెయ్యాలని వెధవ్వేషాలు వేసినపుడు చంద్రబాబు రాజకీయ ఎత్తులతో జగన్ చిత్తు అయ్యాడని, ఓటర్లంతా చంద్రబాబు దూరదృష్టికి మురిసిపోయి మరోసారి తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని, జయము జయము చంద్రన్నా అంటూ కీర్తనలు చేస్తున్నారని ఈ రాధాకృష్ణేకదా రాసింది అప్పట్లో?  ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి ఏడాదిలోనే జగన్ తన హామీలను అమలు చేస్తుంటే రాధాకృష్ణకు చలిజ్వరం రాకుండా ఎలా ఉంటుంది?  ఇక తన యజమానికి భవిష్యత్తు గగనకుసుమం అని ఎరుక అయ్యాక నిద్ర ఎలా పడుతుంది?  
 
****
“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్ట్‌ వద్ద ముందుకు కదలకుండా అధికార పార్టీ కార్యకర్తలనేవారు అడ్డుకోవడం చూశాం. ఇది జగన్మోహన్‌రెడ్డి నైజానికి మచ్చు తునక మాత్రమే! గతంలో జగన్మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకోలేదా? అని సమర్థించుకోవచ్చు గానీ.. అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. ఇదీ తేడా!” 
 
హరేరేరే….గతంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఎవరు?  అసలు వారు పోలీసులే కారని, పెయిడ్ ఆర్టిస్టులని ఆనాడే వైసిపి ఆరోపించింది.  ఒకవేళ వాళ్ళు పోలీసులే అయినా, ఆ పోలీసులు చంద్రబాబు ఆదేశాలు లేనిదే ప్రతిపక్షనాయకుడిని అడ్డుకునే సాహసం చెయ్యగలరా?  మొన్న చంద్రబాబును అడ్డుకున్నది వైసిపి కార్యకర్తలా?  వారు విశాఖప్రజలు కారా?  కేవలం కార్యకర్తలు అడ్డుకున్నంతమాత్రాన చంద్రబాబు వెనక్కు వెళ్ళిపోతారా?   విశాఖకు వ్యతిరేకంగా  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ చేరిన జనసముద్రాన్ని చూసి పోలీసుల సాయంతో చంద్రబాబు తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్ప కేవలం పార్టీ కార్యకర్తలే అయితే, అక్కడ వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు లేరా?  ఎవరిని వంచించడానికి ఈ పిచ్చి రాతలు? 
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు