నక్కలు బొక్కలే వెతుకుంటాయి…అలాగే మన రాధాకృష్ణ

నక్కలు బొక్కలే వెతుకుంటాయి...అలాగే మన రాధాకృష్ణ
“ఇదే స్వామి వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి హోమం చేస్తున్నానని ప్రారంభంలో ప్రకటించి, కరోనా వ్యాప్తి చెందడంతో ఆశ్రమాన్ని మూసివేశారు. ప్రాణభీతికి ఎవరూ మినహాయింపు కాదు. మే 5వ తేదీ తర్వాత వైరస్‌ తగ్గుముఖం పడుతుందని చెబుతున్న స్వరూపానంద మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే!”
ప్రారంభంలోనే తన బ్రాహ్మణవిద్వేషాన్ని కాళియసర్పంలా చిమ్మేసాడు బాధాకృష్ణ.  స్వరూపానంద స్వామి తాను దేవుడిని అని ఎన్నడూ చెప్పుకోలేదు.  మానవమాత్రుడిలానే ప్రవర్తిస్తారు.  కొంతమంది బాబాల మాదిరిగా ఆయనెప్పుడూ పట్టు పీతాంబరాలు ధరించి పల్లకీలు ఎక్కి ఊరేగుతూ గాలిలోంచి శివలింగాలు, నోట్లోంచి ఆత్మలింగాలు తీసి అమాయక భక్తులను మభ్యపెట్టి వ్యాపారసామ్రాజ్యాలు నిర్మించుకోలేదు.  ఒక ఆధ్యాత్మకవ్యక్తిగా ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు.  అంతెందుకు అతి తెలివి రాధాకృష్ణా…వైకుంఠాలని, కైలాసాలని, స్వర్గధామాలని మనం నమ్ముతూ రెప్పపాటు దర్శనం కోసం పదిపదిహేను గంటలు క్యూలలో నించునే పెద్ద పెద్ద దేవాలయాలనే కరోనా దెబ్బకు మూసేశారు.  రాధాకృష్ణ లెక్క ప్రకారం దేవుళ్ళు కూడా కరోనాకు భయపడుతున్నారు కాబట్టి ఆ ఆలయాలలో మహాత్మ్యాలు ఏమీ లేవు!  అంతేకదా!  
 
***
“కరోనా వ్యాప్తిని మత కోణంలో చూడకూడదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ప్రభుత్వాలు కూడా మత కోణంలో కాకుండా దాన్ని ఒక మహమ్మారిగానే చూసి ఉండాల్సింది. 
“శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రికార్డు కాని విషయం వాస్తవమే! అయితే అందుకు ప్రభుత్వ చర్యలు కారణం కాదు. ఆ రెండు జిల్లాలలో ముస్లింలు అతి తక్కువగా ఉంటారు. మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారని ప్రభుత్వమే చెప్పింది. వెనుకబాటుతనం కూడా ఈ రెండు జిల్లాలను వైరస్‌ బారిన పడకుండా కొంతవరకు కాపాడిందని చెప్పవచ్చు.”
అరెరెరె….ఒక పేరాలో ఒక మాట..మరొక పేరాలో మరో మాట!  సర్పజాతికి ఉన్నట్లు రాధాకృష్ణకు రెండు నాలుకలు తీవ్రంగా పనిచేస్తున్నాయి.  మొదటి పేరాలో కరోనాను మత కోణంలో కాక మహమ్మారిగానే చూడాలట…మరో పేరాలో ముస్లింలు తక్కువుగా ఉండటమే ఆ జిల్లాల్లో కరోనా ఎఫెక్ట్ లేకపోవడానికి కారణమట!  అంటే ముస్లిముల కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతున్నదని రాధాకృష్ణ ఉవాచ…. దేనిని నమ్మాలి మనం?  పైగా  ఆ రెండు జిల్లాల్లోని  వెనుకబాటుతనాన్ని చూసి విహరించడానికి కరోనా వెనుకాడిందని బుద్ధిలేని సూత్రీకరణ చేస్తున్నాడు మన చెత్తపలుకుల మృగతృష్ణ!!
 
***
“శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వం తీసుకుంటున్న మహత్తర చర్యల వల్ల ఉత్తరాంధ్రలో వైరస్‌ వ్యాప్తి చెందడం లేదు” అని అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారంనాడు ప్రకటించారు. మరి ఆ మహత్తర చర్యలను గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుతారు?”
భలే లాజిక్కు లాగి తన మాటల మ్యాజిక్కును ప్రదర్శించారు రాధాకృష్ణ.  ఇదెలా ఉందంటే…మనింటి పొరుగువాడికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు.  మనకు ఎందుకు రాలేదు అన్నట్లు లేదూ?  విశాఖపట్నంలో సముద్రం ఉన్నది…మరి గుంటూరులో, కర్నూలులో ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?  ఈ కరోనా వ్యాప్తికి విరుగుడు లేదు.  స్వీయనియంత్రణ చాల ముఖ్యం అని ప్రభుత్వాలు నెత్తినోరు మొత్తుకుంటున్నాయి.  అయినా ఎంతమంది ఆ సూచనలను పాటిస్తున్నాయి?  మొన్న విజయవాడలో గంటసేపు ట్రాఫిక్ జామ్ అయిందంటే ప్రజలకు ఏమైనా బుద్ధిజ్ఞానం ఉన్నాయని అనుకోవాలా?  గుంటూరులో కూడా పిచ్చికుక్కల్లా వాహనాలు రోడ్లమీద తిరుగుతున్నాయి.  మొన్నెవరో ఒక యువతి స్కూటీని పోలీసులు ఆపితే “వడియాలు పెట్టడానికి వెళ్తున్నానని” సమాధానం ఇచ్చింది. ఇంత బాధ్యతారహితంగా మన ప్రజలు ఉన్నప్పుడు వైరస్ పరిగెత్తక చేతులు ముడుచుకుని కూర్చుంటుందా?  తద్భిన్నంగా ఉత్తరాంధ్ర వాసులు లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు.  అందుకే ఆ మూడు జిల్లాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నదని బుర్రతక్కువ సన్నాసులు కూడా అర్ధం చేసుకుంటారు.  
 
***
“పోతే, విశాఖ నగరంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం లేదనీ, ఆ కారణంగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య బయటకు రావడంలేదనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు భేషజాలకు పోవాల్సిన సమయం కాదు ఇది.”
ఆ దేవుడు శాసిస్తాడు…ఈ బాషా పాటిస్తాడు అన్నది ఒక ఫేమస్ డైలాగ్.  చంద్రబాబు నిన్న ఇవే సూక్తులను వల్లించాడు.  ఈరోజు పచ్చమీడియా ఆ కశ్మలాన్ని పీయూషభాండంలా శిరస్సున ధరించి మోస్తుంది.  మరికొంత అడుసును ఒడుపుగా చేర్చి జనం నెత్తిన చిమ్ముతుంది…విశాఖలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడం లేదని బాధాకృష్ణకు ఎవరు చెప్పారో?  బహుశా అక్కడి పచ్చముఠా కూడా చెప్పిఉండదు.  కొరియానుంచి ఆగమేఘాలమీద లక్ష కిట్లు తెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఆ కిట్లు అన్నీ కృష్ణా గుంటూరు జిల్లాలకు మాత్రమే వినియోగిస్తాడని భయపడుతున్నాడా?  
 
***
“ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కరికి మూడు వంతున దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేదలు కానివారికి ఉచిత మాస్కులు ఎందుకు? ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలతో వందల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు?”
అటు తిప్పి ఇటు తిప్పి ఆవు వ్యాసం లాగా జగన్ మీద బురద చల్లే క్రతువును మాత్రం వదిలిపెట్టడు మన పచ్చబానిస.  ఆ మాస్కుల వెల ఎంత?  మహా ఉంటె నాలుగు రూపాయలు ఉంటుంది.  అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగి మాస్కులు ఇచ్చి అమరావతి ఇటుకలు వసూలు చేసినట్లు పదిరూపాయలు వసూలు చెయ్యాలా?  ఈ లాక్ డౌన్ సమయంలో ఆ పది రూపాయలకు కూడా ఎవరూ ఇబ్బంది పడగూడదని జగన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటే మెచ్చుకోవడం పోయి గుండెలు బాదుకోవడం దేనికి రాధాకృష్ణకు?  ఆ పదహారు కోట్ల మాస్కులకు మహా అయితే యాభై కోట్లు ఖర్చు అయి ఉంటుంది.   తన యజమాని ధర్మపోరాటదీక్షలని, పోలవరం శంకుస్థాపనలు అంటూ వేలకోట్లు నాకేసినపుడు, పసుపుకుంకుమ, అన్నదాతా సుఖీభవ పేర్లతో ముప్ఫయివేలకోట్ల ప్రజాధనాన్ని దోచినపుడు ఈ నీతులు చెప్పాడా రాధాకృష్ణ?  
 
 
నక్కలు బొక్కలు వెదకున్
నక్కరతో యూరపంది యాగడిత వెదకున్ 
కుక్కలు చెప్పులు వెదకున్ 
దక్కడి నా XXXకొXకు తప్పే వెదకున్ 
 
అని మనకో చాటుపద్యం ఉన్నది.  వారం వారం దాన్ని గుర్తుచేస్తాడు మన రాధాకృష్ణ!  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు