Home TR Exclusive Ilapavuluri Murali Mohan Rao అసహనంతో రగిలిపోతున్న రాధాకృష్ణ! 

అసహనంతో రగిలిపోతున్న రాధాకృష్ణ! 

- Advertisement -
ఒకరు కాదు..ఒకేసారి ఇద్దరు మగాళ్లు ఒకేసమయంలో మీద పడి రక్కితే, ఎంత అనుభవం కలిగిన వారాంగన అయినా తట్టుకోగలదా?  ఇద్దరూ ఒకేసారి బలవంతంగా వలువలు ఒలుస్తుంటే ఆ సలుపులు భరించలేక చావుకేకలు పెట్టదా?  మన చెత్తపలుకుల రాధాకృష్ణ పరిస్థితి ఆ వెలయాలికన్నా ఘోరంగా తయారయింది.  తన మిండగాడు తయారుచేసిన మహాకూటమితో తెలంగాణాలో కేసీఆర్ భస్మమైపోతాడని ఎన్నెన్నో ఊహించుకున్నాడు.  అయితే, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు కేసీఆర్ మహాకూటమి మక్కెలు విరగ్గొట్టి అరివీరభయంకరుడు అయ్యాడు.  ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు ఎన్ని స్తోత్రాలు చేసినా, లగడపాటి లాంటి మగవేశ్యతో ఎన్ని డ్రామాలు ఆడించినా, అందరిని మట్టికరిపించి జగన్ మోహన్ రెడ్డి అభినవ అలెగ్జాండర్ గా సింహనాదం చేసి చరిత్ర సృష్టించాడు.  దాంతో తన ఆశలన్నీ భగ్నం కాగా, ప్రకటనలతో, స్థలాల ఆక్రమణతో, తెలుగు రాష్ట్రాలను దోపిడీ చేద్దామన్న బంగారు కలలన్నీ భస్మం కాగా,  ప్రభుత్వ ప్రకటనలు లేక, పలుకుబడి లేక, ఆదాయం ఒకటి వ్యయం పన్నెండు….అవమానం పదకొండు రాజపూజ్యం శూన్యం అన్నట్లు,  కరోనా మహమ్మారి కారణంగా చివరకు పత్రికని కూడా మూసేసుకోవాల్సి వస్తుందేమో అన్న పరికంపముతో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద  “లోపాలు చూపితే శాపాలా?” అంటూ సంధిప్రేలాపనలతో ఒకేసారి  విరుచుకుపడ్డాడు!
 
***
“నాకుకరోనా వైరస్‌ సోకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శపించారు”. అయితే ఆయనకంటే అత్యంత శక్తిమంతుడైన దేవుడి దయవల్ల నేను ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నాను. అయినా మహమ్మారి కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాల్సిన ముఖ్యమంత్రి ఫలానా వారికి కరోనా వైరస్‌ సోకాలని శపించడం ఏమిటి? హద్దులు లేని అసహనానికి ఇది నిదర్శనం కాదా? ఇంతకీ శాపం పెట్టాల్సినంత తప్పు నేను గానీ, ‘ఆంధ్రజ్యోతి’ గానీ ఏమి చేసినట్టు?”
 
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం కాదా ఇది?  కేసీఆర్ తన ప్రెస్ మీట్ లో ఎక్కడైనా ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ అనే పదాలను పలికారా?  ఎవరైతే తన ప్రభుత్వం మీద  దుష్ప్రచారం చేస్తున్నారో వారికి కరోనా సోకాలి అని శపించారు.  తప్పా? తప్పుడు ప్రచారం చేస్తుంటే శాపాలు పెట్టక సన్మానాలు చేస్తారా?  హద్దులు లేని అసహనం ఎవరిది?  తననే అన్నట్లు రాధాకృష్ణ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?  
 
***
 “కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే తొలుత బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారు. ”కరోనా కూడా మామూలు జ్వరం లాంటిదే. పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే తగ్గిపోతుంది” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యం కాదా? ఇంద్రుడుకి ఒళ్లంతా కళ్లు అన్నట్టుగా కేసీఆర్‌కు లేవు కదా!? రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో మనో నేత్రంతో తెలుసుకోలేరు కదా? ప్రభుత్వ నిర్ణయాలలోని లోపాలను, వ్యవస్థలోని లొసుగులను పాలకుల దృష్టికి తీసుకురావడానికే మీడియా ఉంటుంది”
 
నాకు తెలియక అడుగుతాను రాధాకృష్ణా…నీకో, నీ ఇంట్లో ఎవరికో చిన్నపాటి జ్వరం వస్తుంది.  అప్పుడు నువ్వేం చేస్తావు?  క్రోసిన్ లేదా డోలో వేసుకోమని చెబుతావా లేక వెంటనే రోగిని అపోలోకు తీసుకెళ్తావా?  ఎంతపెద్ద విపత్తు వచ్చినా, ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఏ పాలకుడైనా ప్రజలు భయపడకుండా ఉండాలని చూస్తారు.  అంతే తప్ప ప్రజలను ఇంకా భయభ్రాంతులకు గురిచేయరు.   ముఖ్యమంత్రికి మనో నేత్రమో, మూడో నేత్రమో లేకపోవచ్చు.  కానీ, రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా  ఆయనకు సమాచారం ఇవ్వడానికి అనేక వ్యవస్థలు ఉంటాయి.  రాష్టంలో ఏ చిన్న గ్రామంలో వీధి లైట్ వెలగకపోయినా తన డాష్ బోర్డులో కనిపిస్తుందని చంద్రబాబు చెప్పినపుడు ఆయనకు మనోనేత్రం ఉందని భ్రమిశావా లేక చంద్రబాబు తప్ప మిగిలినవారంతా మూర్ఖులు అనుకున్నావా?  
 
***
“వివిధ కారణాల వల్ల తెలంగాణలో కేసీఆర్‌కు మీడియా పూర్తిగా సహకరిస్తున్నది. దీంతో చిన్న చిన్న విమర్శలను కూడా సహించలేని స్థితికి ఆయన వచ్చారు. తాను అద్భుతంగా పనిచేస్తున్నానని ప్రపంచానికి నిత్యం చెబుతుండాలని కోరుకుంటున్నారు. నిజానికి సమీక్షల పేరిట మీరు నిర్వహిస్తున్న సమావేశాలలో జరుగుతున్నది ఏమిటో ప్రజలకు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! మీకు నచ్చిన అధికారులను, పార్టీ వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని గంటల తరబడి ముచ్చట్లు చెప్పే మీరు అధికారులను మాట్లాడనిస్తారా?”
 
ఒహోహోహో….ఏమిటయ్యా ఆ వివిధ కారణాలు?  చంద్రబాబులా కేసీఆర్ గప్పాలు కొట్టడం లేదు…చంద్రబాబులా  అమరావతి పేరుతో జనాన్ని మభ్యపెట్టడం లేదు…చంద్రబాబులా చదరపు అడుగుకు పదకొండువేలు కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదు.  పోలవరాన్ని ఏటీఎం లా  చంద్రబాబు వాడుకున్నట్లు కాళేశ్వరాన్ని కేసీఆర్ వాడుకోలేదు…క్లిష్ట సమయాల్లో కూడా ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని ఆపడం లేదు.  గత ఆరేళ్లలో ఒక్క కుంభకోణం లేదు..   కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏమి రాసినా తెలంగాణాలో నమ్మే జనం లేరు…ఆ పత్రికకు మనుగడ లేదు.   ఇక సమీక్షా సమావేశాల్లో ముక్కుమీద వేలు వేసుకోదగిన అరాచకాలు ఏమి చేస్తున్నారు?  సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారా?  జోకులు వేసుకుంటున్నారా?  
 
*****
“ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌లో దండిగా ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగానికి వెలితి ఉండటం లేదు. అది మీ గొప్ప కాదు. సమర్థులైన అధికారులు తెలంగాణలో ఉన్నందున కేసీఆర్‌ పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా వ్యవస్థ తన పని తాను చేసుకుపోతున్నది. అదంతా మీ గొప్ప అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడపడం నిజం కాదా? కేసీఆర్‌ భాషలో చెప్పాలంటే.. అవతలివాడు నీకంటే సన్నాసి అయినప్పుడు నీకే మంచి పేరు వస్తుంది.”
 
రాధాకృష్ణ బుర్ర మొత్తం రంకుతనంతో నిండిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?   “ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌లో దండిగా ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగానికి వెలితి ఉండటం లేదు…..”  ఏమిటి ఈ వాక్యానికి అర్ధం బాధాకృష్ణా?  అంటే ఇప్పుడు తెలంగాణాలో పనిచేస్తున్న అధికారులు అందరూ చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకున్నవారు..అందుకే అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పడం నీ ఉద్ద్యేశ్యమా లేక ఉత్తమ అధికారులను తయారు చేసే ఫ్యాక్టరీలను చంద్రబాబు హైద్రాబాద్ లో నెలకొల్పారని చెప్పడమా?   అంటే తెలంగాణాలో పనిచేస్తున్న అధికారులు అందరూ కేసీఆర్ కు తెలియకుండానే తమపని తాము చేసుకుని పోతున్నారట!  అది కేసీఆర్ గొప్పదనం కాదట.  ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం అధికారులు ఎంత చిన్న తప్పు చేసినా అది జగన్ దుర్మార్గం, అసమర్ధత!  వహ్వా రాధాకృష్ణా…
 
***
“ఉద్యోగ సంఘాలతో కనీసం మాట మాత్రమైనా సంప్రదించకుండా జీతాల్లో కోత విధించినా నోరెత్తలేని స్థితిలో ఆయా సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో ఇవ్వాళ ఎవరైనా మనుగడ సాగించాలంటే ఆధునిక నిజాం ప్రభువుకు గులాంగిరి చేయాల్సిందే!”
భలే రాశావు బాధాకృష్ణా…ఉద్యోగ సంఘాలతో చర్చించి జీతాల కోతను విధించాలని ఎక్కడైనా రూల్ ఉన్నదా?  కేసీఆర్ నిర్ణయానికి ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు పలికాయన్న సంగతి రాయలేదేమి?  రేపు నువ్వు సగం మంది ఉద్యోగులను తొలగించబోతున్నావని వార్తలు హోరెత్తుతున్నాయి.  జర్నలిస్ట్ సంఘాలను సంప్రదించి తొలగిస్తావా?  పత్రికలో పేజీలను ఎవరిని అడిగి తగ్గించావు?  ప్రధానమంత్రి సైతం ఎంపీల జీతభత్యాలలో కోత విధించారు.  వారిని సంప్రదించి ప్రధాని ఆ నిర్ణయాన్ని తీసుకున్నారా?  ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు?  ప్రస్తావిస్తే నీ యజమానికి కోపం వస్తుందని వెరపా?  
 
***
“దేశంలోని ముఖ్యమంత్రులు అందరూ.. ఆ మాటకొస్తే ప్రపంచ దేశాల అధినేతలందరూ కరోనా మహమ్మారిని అరికట్టే విషయమై తలమునకలై ఉండగా, జగన్మోహన్‌రెడ్డి మాత్రం తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. దేనికైనా సమయం– సందర్భం చూసుకోవాలి అని అంటారు. జగన్‌కు మాత్రం ఇలాంటివేమీ పట్టవు. ఆయనది విపరీత మనస్తత్వం అని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. “
 
అయ్యయ్యో….అయ్యో…ప్రపంచ దేశాధినేతలు అందరూ కరోనాతో యుద్ధం చేస్తుంటే జగన్ మాత్రం ఇంట్లో కూర్చుని భార్యాబిడ్డలతో  అష్టాచెమ్మా ఆడుకుంటున్నాడు!  అంతే కదా!  జగన్ ది విపరీత మనస్తత్వం అని పాపం బాధాకృష్ణ జగన్ నిక్కర్లు వేసుకునేటప్పటినుంచి కూడా రోదిస్తున్నాడు.  అయినా పిచ్చిజనాలు పట్టించుకోలేదు.  చంద్రబాబు  కరుణాసముద్రుడు, నిప్పులాంటి మనిషి అని రాధాకృష్ణ డప్పులు వేస్తూ  ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినిపించుకోలేదు…ఎంత దౌర్భాగ్యమో కదా!  
 
***
“గుడ్‌ఫ్రైడే ప్రభుత్వానికి సెలవు అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీచేయడంతోపాటు ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ జీవో విడుదల చేశారు. అంతేకాదు.. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రమేశ్‌కుమార్‌ను తొలగించడం సరైందా? కాదా? న్యాయ సమీక్షలో నిలబడుతుందా? లేదా? అన్న విషయాలు పక్కనపెడితే.. ఈ సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కేవలం జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. కరోనా వైరస్‌ను ఆయన మొదటి నుంచీ తేలిగ్గానే తీసుకుంటున్నారు”.
 
హమ్మయ్య…ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు రాధాకృష్ణ!  తన కులపు కందగడ్డను జగన్ పెకలించి పారెయ్యడంతో పెల్లుబికిన ఉక్రోషం,  ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఈ విధంగా వాంతులరూపంలో బయటకొచ్చింది.  అంటే దేశంలో కరోనా ఉంటె ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోరాదు.  ఎలాంటి నియామకాలు చెయ్యరాదు.  ఇదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే…ఒకసారి ఊహించుకుందాము…సముద్రాన్ని కంట్రోల్ చేసిన చంద్రబాబు…హుధుద్ తుపానును అరచేతితో అడ్డుకున్న చంద్రబాబు…అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించించిన చంద్రబాబు…కృష్ణ గోదావరిలా అలకలు మూడేసి కట్టేసిన చంద్రబాబు అని వందిమాగధ స్తోత్రాలు గానం చేసినట్లు “కరోనాను కట్టడి చేసి తరిమేసిన చంద్రబాబు””  అంటూ తాటికాయలు కూడా తలవంచుకునే సైజులో  అక్షర విన్యాసాలు చేస్తూ తరించేవాడు మన రాధాకృష్ణ.  తన దురదృష్టమో, ఆంధ్రుల అదృష్టమో…ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.  అందుకే ఎలాంటి ప్రచార ఆర్భాటమూ లేదు…కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి సంబరాలు లేవు…దేశంలోనే అతి తక్కువ పాజిటివ్ కేసులు, మరణాలతో తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందున్నాయి అంటే ఆ ఘనత అంతా ప్రచార పటాటోపం లేని కేసీఆర్, జగన్ లదే.  
 
***
“ఈనెల ఐదవ తేదీన తొమ్మిది నిమిషాలపాటు ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్‌రెడ్డిని గమనిస్తే ఆయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇంటి వెలుపలకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన జగన్మోహన్‌రెడ్డి తొమ్మిది నిమిషాలు కూడా పూర్తికాక ముందే లోపలకు వెళ్లిపోవడానికి రెండు మూడు పర్యాయాలు ప్రయత్నించారు. అధికారులు వారించడంతో ఆగిపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందున ముఖ్యమంత్రి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అధికారులు మాత్రం కరోనా నియంత్రణపై దృష్టిపెట్టారు.”
 
మళ్ళీ ఇక్కడో ప్రల్లదనం….ప్రధాని కోరినట్లుగా జగన్ కొవ్వొత్తులు సరిగా వెలిగించలేదని, ప్రధానికి జగన్ కు మధ్య ఏదో తంపు పెట్టడానికి ఒక వ్యర్ధ ప్రయత్నం!  కేంద్రం అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రర్యవేక్షిస్తుందా  మన ఫెడరల్ దేశంలో?  ముఖ్యమంత్రి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విలువ ఇవ్వకుండా ప్రధాని ఆదేశాలు తీసుకుంటుందా?  బాడ్ లక్ ఏమిటంటే….తన యజమాని, ఆయన పరమశుంఠ తనయుడు కొవ్వొత్తులు పట్టుకుని బాల్కనీలో దీనంగా నిలుచున్నారని రాయడం రాధాకృష్ణ మరచిపోవడం దారుణాతిదారుణం.  కదా బాధాకృష్ణా!  
 
***
“ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి! అంతవరకు పదేపదే విస్తుపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. అధికారం కట్టబెట్టిన ప్రజలే దాని పర్యవసానాలను కూడా అనుభవించాలి. జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏడాది క్రితం ఇదే ఏప్రిల్‌ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి మరీ ఓట్లు వేశారు కనుక మంచికీ–చెడుకీ వారే బాధ్యులు!”
 
ఇదీ మన విలువలు కాపాడే జర్నలిస్ట్ రాధాకృష్ణ ప్రదర్శిస్తున్న విలువలు!  అయిదు కోట్లమంది యాభై శాతం ఓటింగ్ తో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించిన నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏమాత్రం జీర్ణించుకోలేక మార్జాల శాపనార్ధాలు పెడుతూ రక్తం కక్కుతున్న రాధాకృష్ణను ఏ రంకులాడితో పోల్చితే సబబుగా ఉంటుంది?  తన యజమానిని శంకరగిరి మాన్యాలు పట్టించి ఇక ఈ జన్మకు కోలుకోనంతగా తరిమికొట్టిన అఖండమైన ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా కించపరుస్తున్న క్షుద్ర రాతలను ఏ పాదరక్షలతో పీకాలి?  ప్రజలు అర్ధరాత్రి వరకు క్యూలలో ఎందుకు నిలబడ్డారు?  దుష్ట సంహారం కోసమే కదా?  ఆ విషయాన్ని మరచి “మంచికి చెడుకు వారే బాధ్యులు” అంటూ  ప్రజలను శపించడంలో ఏమైనా అర్ధం ఉన్నదా?    కేసీఆర్ తనను శపించారని శోకాలు పెడుతున్న రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో  నారాకాసుర వధను గావించి దీపావళిని తెచ్చుకున్న  ప్రజలను శపించడం ఏమిటి!  బుద్ధీజ్ఞానం  ఉన్నాయా?     
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

(ఇలపావులూరి మురళీ మోహన రావు) 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
- Advertisement -

Related Posts

కొత్త పలుకు – కట్టుకథలతో వండివార్చిన గరళం

పాపం!  ఒక్కోసారి  రాధాకృష్ణ తనను తాను రామోజీరావు స్థాయివాడినని ఊహించుకుంటారు.   పరస్పరం శత్రుభావంతో వ్యవహరిస్తున్న సింహాలవంటి ఇద్దరు నాయకులకు, పార్టీలకు సంధి కుదర్చగలనని భ్రమిస్తుంటాడు.  "గాంధీకి బట్టతల ఉంది నాకూ బట్టతల ఉంది...

మరణం లేని మహానేత వైఎస్… వైయస్సార్ పదకొండవ వర్ధంతి సందర్భంగా

 తారమండలంలో కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు సంచరిస్తుంటాయి.  కానీ, వాటిలో కొన్ని మాత్రమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి.  వాటికే మనం పూజలు పునస్కారాలు చేస్తాము.  అలాగే రాజకీయ తారమండలంలో కూడా వందలాదిమంది నాయకులు...

(చెత్త) పలుకులు పంచదార…నిలువెల్లా విషపుధార!!! 

తాత్కాలికంగా అయినా సరే...జగన్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాము అన్న అల్ప సంతోషం రాధాకృష్ణ మోహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.  కానీ, ఆ విన్యాసాలవలన నష్టం ఎవరికి లభిస్తున్నదో గుర్తించలేక, తన యజమానికి ఏమైనా...

Recent Posts

తక్కెడ రాజకీయాలు : పవన్ మిత్రుడి నుండి గమ్మతైనా వ్యాఖ్యలు

 ఆంధ్రప్రదేశ్ కి ప్రాణాధారమైన పోలవరం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఇప్పటికే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు అయినా కానీ ఆంధ్ర ప్రజలు కావచ్చు, నేతలు...

సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్ర‌ణాళిక‌లు.. హీరో నుండి నిర్మాత‌గా మారే ప్ర‌య‌త్నం

సినిమా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. మ‌న‌కు అంతా గొప్ప‌గానే క‌నిపిస్తున్న ఇండ‌స్ట్రీలో ఉండే ఆర్టిస్టుల జీవితాల‌లో ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ఉంటాయి. వీరి జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుంద‌నే న‌మ్మ‌కం కూడా...

నాకు అలాంటి నేతలే కావాలంటున్న జగన్

 ప్రభుత్వం పనితీరును ప్రజల్లోకి తీసుకోని వెళ్ళటానికి బలమైన మీడియా తో పాటుగా మంచి వాక్చాతుర్యం కలిగిన నేతలు కూడా అంతే అవసరం. ప్రభుత్వ పనితీరు గురించి గొప్పగా చెప్పటానికి, అదే సమయంలో విపక్షాలు...

వైసీపీ పాలకులకు అధికార మదం కళ్లకెక్కింది.. నారా లోకేశ్ ఆగ్రహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. వైసీపీపై నారా లోకేశ్ ఎక్కువగా ట్విట్టర్...

మోనాల్‌ని కాపాడండి.. సోనూసూద్‌కు నెటిజ‌న్ల రిక్వెస్ట్‌లు..!

సుడిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన గుజరాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ, గుజ‌రాతీ భాష‌లలో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి చిత్రం మోనాల్‌కు...

స్ట్రెచర్ పైనే ఆ పని చేసేద్దామంటూ విసిగించిన నర్సు.. దీంతో వార్డ్ బాయ్ ఏం చేశాడంటే?

ఇది నిజానికి ఓ సినిమా స్టోరీనే తలపిస్తోంది. ఓ చిన్న ఘటన ఓ ప్రాణాన్ని తీసేసింది. నర్సు అత్యుత్సాహం.. వార్డ్ బాయ్ భయం.. రెండూ కలిసి ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన...

ఆ మంత్రి రాసలీలల వీడియో వెనుక కుట్ర కోణం ..?

 ఒక పక్క తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే, మరోపక్క తెరాస మంత్రికి సంబంధించిన రాసలీలల వీడియో ఒకటి మీడియాలో హల్చల్ చేసింది. "దశ సంఖ్య" కలిగిన ఒక మీడియా...

దుబ్బాక ప్రజల్లో చైతన్యం వచ్చింది.. టీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూడాల్సిందే.. కిషన్ రెడ్డి కామెంట్స్

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి గతంలో ఏనాడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదు. కానీ.. దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో మాత్రం...

” మిస్ ఇండియా ” లో ఉన్న ఈ చిన్న పాయింట్ తో కీర్తికి హిట్ దక్కుతుందా ..?

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్లాన్ చేసుకున్న సినిమాల లైనప్ బాగానే ఉంది కాని వాటిలో ఎక్కువగా ప్రయోగాత్మకమైన కథ లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఓటీటీలో వచ్చిన పెంగ్విన్ పెద్దగా...

మెగాస్టార్ చిరంజీవి – శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ..?

మెగాస్టార్ కెరీర్ లో 150 సినిమాలని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్న క్రేజీ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదని అంటున్నారు. అదే మెగాస్టార్ చిరంజీవి - శంకర్...

Movie News

సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్ర‌ణాళిక‌లు.. హీరో నుండి నిర్మాత‌గా మారే ప్ర‌య‌త్నం

సినిమా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. మ‌న‌కు అంతా గొప్ప‌గానే క‌నిపిస్తున్న ఇండ‌స్ట్రీలో ఉండే ఆర్టిస్టుల జీవితాల‌లో ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ఉంటాయి. వీరి జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుంద‌నే న‌మ్మ‌కం కూడా...

బాగా కష్టపడుతోంది.. అలా చెమటోడ్చుతున్న రష్మిక మందాన్న… వైర‌ల్ వీడియో..!

రష్మిక మందాన్న ఈ మధ్య జిమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాయామం చేయడంలో రష్మిక ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటోన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య బీచ్‌లో రష్మిక చేసిన విన్యాసాలు ఓ...

మోనాల్‌ని కాపాడండి.. సోనూసూద్‌కు నెటిజ‌న్ల రిక్వెస్ట్‌లు..!

సుడిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన గుజరాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ, గుజ‌రాతీ భాష‌లలో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి చిత్రం మోనాల్‌కు...

మొత్తానికి ఒకే గూటికి చేరారు.. అభిజిత్ మోనాల్ అఖిల్ కథ మళ్లీ...

బిగ్ బాస్ షోలో మొదటి రెండు వారాలు ప్రేమదేశం కథను చూపించారు. వినీత్ టబు అబ్బాస్‌లా అభిజిత్ మోనాల్ అఖిల్ కథ నడిచింది. మొదట్లో అఖిల్ అభి ఇద్దరూ క్లోజ్‌గా ఉన్నారు. బాగా...

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రోజాపై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్

బండ్ల గణేష్ అంటే ఏంటో ఆయన ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. ఓ ఊపులో ఉన్నాడంటే ఏం మాట్లాడాతాడో ఆయనకే తెలియదు. ఎంత దూరమైనా మాట్లాడేస్తాడు. అది మంచైనా గానీ చెడైనా గానీ....

” మిస్ ఇండియా ” లో ఉన్న ఈ చిన్న పాయింట్...

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్లాన్ చేసుకున్న సినిమాల లైనప్ బాగానే ఉంది కాని వాటిలో ఎక్కువగా ప్రయోగాత్మకమైన కథ లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఓటీటీలో వచ్చిన పెంగ్విన్ పెద్దగా...

మెగాస్టార్ చిరంజీవి – శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ..?

మెగాస్టార్ కెరీర్ లో 150 సినిమాలని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్న క్రేజీ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదని అంటున్నారు. అదే మెగాస్టార్ చిరంజీవి - శంకర్...

క్వశ్చన్ మార్క్  `?`   సాంగ్ లాంచ్

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో  నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?)....

మూడేళ్ళ వ‌య‌స్సులో లైంగిక వేధింపులు.. సంచ‌లన విష‌యాలు వెల్ల‌డించిన బ‌బ్లీ గార్ల్‌

హాలీవుడ్‌లో మెద‌లైన మీటూ ఉద్య‌మం బాలీవుడ్‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు పాకింది. హీరోలు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న్స్ వ‌ల‌న ఇబ్బంది ప‌డ్డ భామ‌లు డైరెక్ట్‌గా మీడియా ముందుకు వ‌చ్చి నిజ‌నిజ‌లాను బ‌య‌ట‌పెడుతున్నారు. ముఖ్యంగా మ‌న...

ఇట్స్ అఫిషియల్ : కాజల్ పెళ్లయిపోయింది.. ఫోటోలు వైరల్

కాజల్ అగర్వాల్ పెళ్లయిపోయింది. అక్టోబర్ 30న తాను పెళ్ల చేసుకోబోతున్నట్టు కాజల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి గౌతమ్ కిచ్లుతో జరిగింది. తన...