Hi Nanna Movie Review – ప్రేమించిన ప్రేమని పెళ్లి చేసుకోలేని తండ్రి కథ ..Hi నాన్న!!

Hi Nanna Movie Review

Hi Nanna Movie Review – ప్రేమించిన ప్రేమని పెళ్లి చేసుకోలేని తండ్రి కథ … Hi నాన్న !!!

వివరాల్లోకి వెళ్తే :
ఒక కూతురున్న ప్రతి తండ్రి చూసే చిత్రం ..
ప్రేయసున్న ప్రేమికుడు చూడాల్సిన చిత్రం …
ప్రేమ మీద నమ్మకం ఉన్న ప్రతివాళ్ళు చూడాల్సిన చిత్రం ..
కూతురుకి తండ్రి గా , భార్య కి భర్త గా , ప్రేయసి కి ప్రేమికుడు గా ..
ప్రతి మగవాడి జీవితం ప్రేమ తో నిండిన పోయింది కదా ..

విధి రాత ఎలా ఉన్న, తండ్రి ప్రేమ ముందు అది ఓటమి చెందాల్సిందే…
విపరీతాలు ఎన్ని జరిగినా , ప్రేమ నిండిన మనసులు కలవాల్సిందే …

hi నాన్న , చిత్రం చూసిన ప్రతి తండ్రి ఎంతో గర్వంగా feel అవుతాడు .. ఎందుకంటె చిత్రం లో చూపించిన ప్రతి విషయం నిజం కాబట్టి .. ప్రతి చిన్న ఆనందం నిజం కాబట్టి ..

కథ :

ప్రాణంలా చూసుకుంటున్న కూతురు , అమ్మ గురించి అడిగితే … చెప్పలేకపోతాడు విరాజ్ ..
ప్రాణంలా ప్రేమించిన ప్రేయసి పెళ్లి చేసుకోమంటే కుదరదు అని చెప్తాడు విరాజ్ ..అసలేమైంది … ప్రేమించిన అమ్మాయిని ఎందుకని దూరం పెడుతున్నాడు విరాజ్… కూతురు గురించి ప్రేయసికి చెప్పలేని కష్టం ఏమొచ్చింది విరాజ్ కి … కూతురు ప్రేయసిల మధ్య నలిగిన తండ్రి కథే Hi నాన్న ..

Also Read : ఇంట్లో చెప్పకుండా పెళ్లి?: రేవంత్ రియల్ లవ్ స్టోరీ తెలుసా..?

నాని :

తెలుగునాట కమల్ హాసన్ చిత్రాలు చూసి చాల రోజులైంది … నాని ఆ లోటుని భర్తీ చేస్తున్నాడు .. మన తెలుగువారికి మరో కమల్ హాసన్… నాని అని చెప్పటానికి ఏమాత్రం సందేహపడక్కర్లేదు ..
కూతురి కి తన కష్టం చెప్పలేడు ..
ప్రేయసికి తన ప్రేమ చెప్పలేడు …
ప్రాణాలు పోతున్నా నవ్వుతూ నిలబడి …
” నా ప్రేమ నీకు చాలలేదా ” అని అడుగుతుంటే
” నాన్న కోసం ఆగాలని అనిపించలేదా ” అని అడుగుతుంటే ..
“ఇదేనా ప్రేమ ” అని ప్రేయసిని అడుగుతుంటే ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టాల్సిందే ….నాని నటన ఒక అద్భుతం …

శౌర్యువ్ :

మొదటి సీన్ తో నే తాను ఎంత పెద్ద కథ చెప్తున్నాడో చెప్పకనే చెప్పేసి … ఇక ఆ కథ ఎన్ని మలుపులు తిరిగిందో అన్నిటిని ఒక మాల గా చేసి తన వృత్తి మీద ఉన్న గౌరవానికి హారం గా మార్చేశాడు .. పాటలు విన్నా , కధనం లో అయినా .. కధలో అయినా శౌర్యువ్ చాల పరిణితి చెందిన వాడిలా కనిపిస్తాడు … ముక్యంగా తన కథ మీద తనకున్న clarity మనకి ప్రతి ఫ్రేమ్ లో ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తుంది .. చాల బాగుంది తన direction

ఇతర తారాగణం : Kiara కూతురుగా ఎంతో బాగా చేసింది … తండ్రి పట్ల ప్రేమ, కోపం, బాధ అన్నింటిని ఎంతో చక్కగా ప్రదర్శించింది ..
మృణాల్ ఠాకూర్ సీతారామం తరవాత అంతటి మంచి performance కావాల్సిన పాత్ర చేసింది … ఎంతో చక్కగా కనిపించింది ..
అంగన్ బేడీ కూడా బాగా నటించాడు .. బేబీ fame విరాజ్ అశ్విన్ కూడా కనిపిస్తాడు, బాగున్నాడు
ప్రియదర్శి మెప్పిస్తాడు ..

హెషం అబ్దుల్ వాహబ్ : మెల్లగా అబ్దుల్ తెలుగు చిత్రాలలో పెద్ద పేరు అయిపోయేలా ఉంది .. మొన్న ఖుషి , అంతకు ముందు Hridayam చిత్రాలలో పాటలతో మనకి పరిచయం అయ్యి , hi నాన్న తో మరింత దగ్గరయ్యాడు .. ముక్యంగా చెప్పాల్సింది తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రతి సన్నివేశం గుండెకి హత్తుకునేలా , చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించిన అద్భుతమైన విషయం అబ్దుల్ సంగీతం …

సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ చాల రిచ్ గా ఉంది , చాల natural గా కూడా ఉంది…

Also Read : ఇండస్ట్రీ టాక్ : నెక్స్ట్ “సలార్” నుంచి అతడి విశ్వరూపమే??

డబ్బింగ్ : ఈ చిత్రానికి మరో మంచి విషయం ఏంటంటే , అది ఆర్టిస్ట్స్ dubbing , చిన్మయి అయినా , నాని అయినా , జయరాం గారికి చెప్పిన వారు , అందరు ఎంతో బాగా చెప్పారు , ముక్యంగా ఏ క్యారెక్టర్ ఏ బాధ వ్యక్తం చేస్తోందో ఎంత వేదన అనుభవిస్తోందో చాల స్పష్టంగా వినిపిస్తుంది , సౌండ్ మిక్సింగ్ బాగుంది ..

విషయమేంటంటే :

తండ్రి కూతుళ్ల ప్రేమ చూడాలి అంటే ..
భార్య భర్తల బంధం ఎంత గట్టిదో చూడాలి అంటే ..
నాని నటన చూడాలంటే .. శౌర్యువ్ అద్భుతమైన కధనం చూడాలంటే … మంచి సినిమా ఫామిలీ తో చూడాలంటే …

ఈ వారం ..hi నాన్న చూడాల్సిందే – అందుకే మా రేటింగ్ – 3.5/5

/పవన్ దావులూరి

Hi Nanna Movie Review – Pls share if you liked the review.