ఇంట్లో చెప్పకుండా పెళ్లి?: రేవంత్ రియల్ లవ్ స్టోరీ తెలుసా..?

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. పదేళ్ల బీఆరెస్స్ ప్రభుత్వానికి చెక్ పెడుతూ హస్తం హవా చూపించింది. కర్ణాటక ఫలితాలు వాపు కాదని చెప్పకనే చెప్పింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. దినదిన ప్రవర్ధమానంగా అన్నట్లుగా ఎదిగిన ఆయన… తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం హాట్ టాపిక్ గా మారడం ఒకెత్తు అయితే… అప్పట్లో ఆయన లవ్ స్టోరీ సినిమా కథను తలపించేలా ఉంటుందని చెబుతుంటారు. ఆ ప్రేమకథలోని ట్విస్టులు, జలక్కులూ రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోనిదిగా ఉంటుందని అంటారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రేమకథ వ్యవహారం ఇప్పుడు చూద్దాం.!

రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఒక వెళ్లి వేడుకలో గీతారెడ్డిని చూశారు. ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి సమీప బంధువు. ఆ సమయంలో అయిన ఆమె మీద మనసు పడ్డారు. అయితే స్నేహంగా మొదలైన వారి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారడంతో గీతారెడ్డికి రేవంతే ప్రపోజ్ చేశారు. అనంతరం ఆమె రేవంత్ ప్రేమకు అంగీకారం తెలిపారు.

అప్పటికే గీతారెడ్డి కుటుంబం సంపన్న కుటుంబం కావడంతో చాలా ప్రేమకథల్లోని ఆర్థిక వ్యత్యాసం రేవంత్ కి కూడా విలన్ గా మారింది. పైగా అప్పటికి రేవంత్ రెడ్డి కూడా సరిగా సెటిల్ కాకపోవటంతో.. గీతారెడ్డిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో ఆమె కుటుంబం సుముఖత వ్యక్తం చేయలేదట. దీంతో ఆమెను ఆమె తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం అని చెప్పి అప్పటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపారు.

దీంతో తీవ్ర నిరాశచెందినప్పటికీ… రేవంత్ వెనక్కి తగ్గలేదు. ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో.. గీతారెడ్డి ఇంట్లో ఉన్న అభ్యంతరాల్ని అధిగమించారు.. వారందరిని ఒప్పించారు.. ఫైనల్ గా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి – గీతారెడ్డిల వివాహం 1992లో జరిగింది. అయితే.. రేవంత్ లవ్ స్టోరీలో మరో మలుపు ఉందని చెబుతారు. ఈ స్టోరీలో అదే ట్విస్టని అంటారు.

ఇందులో భాగంగా ప్రేమించుకుంటున్న సమయంలోనే ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్న రేవంత్.. తర్వాత పెద్దల్ని ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నారని చెబుతారు! ఏది ఏమైనా… తెలంగాణ నూతన ముఖ్యమంత్రి లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్ లే ఉన్నాయి!!