ఇండస్ట్రీ టాక్ : నెక్స్ట్ “సలార్” నుంచి అతడి విశ్వరూపమే??

ఈ డిసెంబర్ రిలీజ్ లలో ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న మరికొన్ని భారీ చిత్రాల్లో అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “సలార్” కూడా ఒకటి. ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఇది రెండో రిలీజ్ కాగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

అయితే ఇప్పుడు దీనిపై హైప్ గట్టిగానే నెలకొనగా ఈ సినిమా ట్రైలర్ పట్ల మాత్రం కాస్త మిక్స్డ్ స్పందనే వచ్చింది. చూసిన వెంటనే ఇలాంటిది ఎక్కడా చూడలేదు అన్నట్టుగా ఎవరికీ అనిపించలేదు. దీనితో ఇక అంతా రెండో ట్రైలర్ కోసమే చూస్తుండగా ఈ ట్రైలర్ విషయంలో సినీ వర్గాల్లో క్రేజీ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మరి ఈ చిత్రం నుంచి రెండో ట్రైలర్ గా అయితే ఓ క్రేజీ ఎలిమెంట్ ని రివీల్ చేస్తారని అంటున్నారు. మొన్న టీజర్ లో కేవలం దేవా ని మాత్రమే చూస్తే ట్రైలర్ లో డైనోసార్ సలార్ ని మేకర్స్ పరిచయం చేస్తారని అంటున్నారు. దీనితో ఇక నెక్స్ట్ సినిమాపై అంచనాలు ఎలా వెళ్తాయో ఆ ట్రైలర్ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీనితో ఇక అతడి విశ్వరూపం కోసం ఫ్యాన్స్ ఏక్షన్ మూవీ లవర్స్ ఎదురు చూడడమే మిగిలి ఉందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ఈ డిసెంబర్ 22న సినిమా పెద్ద ఎత్తున పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది అని తెలిసిందే.