రోజూ ఆరెంజ్ తింటే ఏమవుతుందో తెలుసా.. ఇది తెలిస్తే షాక్ అవుతారు..!

మన డైలీ డైట్‌లో ఆరంజ్ ఉన్నదంటే అది ఆరోగ్యానికి చాలా పెద్ద బోనస్ లాంటిదే. చిన్నారుల నుండి పెద్దల వరకు ఆరెంజ్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో ఉండే ఈ పండు శరీరానికి రక్షణ కవచం లాంటిది. ప్రతిరోజూ ఒక కమల పండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

ముందుగా చెప్పుకోవలసింది ఇమ్యూనిటీ. ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి చిన్న వ్యాధులు దరిచేరవు. శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడం, సెల్ డ్యామేజ్‌ నుంచి కాపాడడం ఆరెంజ్ ప్రత్యేకత. అంతేకాదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ వల్ల వచ్చే సమస్యలకు గుడ్ బై చెబుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆరెంజ్ కి కూడా మంచి పేరు ఉంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తనాళాల లోపల వాయిదులు లేకుండా చూసి గుండె దెబ్బకు అవకాశం రాకుండా చేస్తుంది. ఇక ఆరెంజ్‌లో ఉన్న ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. కడుపు కాస్త తేలికగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చక్కటి సహాయం. పాలీఫెనల్స్ పేగులో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహకరిస్తాయి.

చర్మానికి కూడా ఆరెంజ్ అద్భుతమైన టానిక్ లాంటిదే. వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే ముడతలు, మచ్చలు ఆలస్యంగా రావడానికి ఇది సహకరిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి సహజ కాంతి ఇస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ నిర్మాణాన్ని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఆరెంజ్ ఎంతో సహాయ పడుతుంది. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఫలితంగా ఎక్కువగా తినే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు, కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పండు సహకరిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం? రోజుకు కనీసం ఒక ఆరెంజ్ తింటే ఆరోగ్యం, అందం రెండూ మీ వశం అవుతాయి. జ్యూస్ రూపంలో కాకుండా, పండు రూపంలో తింటే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మీ ప్లేట్‌లో కచ్చితంగా ఆరెంజ్‌ ఉండేలా చూసుకోండి.