మంత్రి కన్నబాబుకి అంత డ్యామేజీ జరిగిందా.?

Has so much damage been done to Minister Kannababu?

మంత్రి కురసాల కన్నబాబు, వివాదాలకు దూరంగా వుంటారు. స్వతహాగా ఆయన సౌమ్యుడే అయినా, రాజకీయాల్లో అలా సౌమ్యంగా వుండడం కుదరదు. ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నప్పుడు, తన శాఖకు సంబంధించి ఆరోపణలు వస్తే.. అటు ప్రభుత్వాన్నీ, ఇటు ముఖ్యమంత్రినీ వెనకేసుకురావాల్సిందే. ఈ క్రమంలో ఒకప్పటి స్నేహాలు పక్కన పెట్టి, రాజకీయ వైరమే ప్రదర్శించాలి. ఆ ప్రయత్నంలో కొంతమేర కురసాల కన్నబాబు సఫలమవుతున్నారు. అదే సమయంలో, ఆయన పట్ల నెగెటివిటీ కూడా బాగానే పెరిగిపోతోంది. మొన్నీమధ్యనే కన్నబాబుకి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ రికార్డింగ్‌ డాన్స్‌ కార్యక్రమంలో కన్నబాబు కనిపించారు.

Has so much damage been done to Minister Kannababu?
Has so much damage been done to Minister Kannababu?

రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అయితే, వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడం, రాష్ట్రంలో రైతాంగం వరదలు, వర్షాల కారణంగా నష్టపోవడం.. సరిగ్గా ఈ టైమ్‌లోనే కన్నబాబు, రికార్డింగ్‌ డాన్స్‌ని ఎంజాయ్‌ చేస్తున్న వీడియో బయటకు రావడం ఆయనకు చెడ్డపేరు తెచ్చేసింది. వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులకు పలు పేర్లు ప్రచారంలో వున్నాయి. బూతుల మంత్రి అనీ, నోటి పారుదల మంత్రి అనీ.. ఇలా చాలా ట్యాగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

‘స్లీపర్‌’ అంటూ ఓ కీలక పదవిలో వున్న వైసీపీ నేత మీద కూడా ట్వీట్లు పడుతుంటాయి. తాజాగా కన్నబాబుకి ‘రికార్డింగ్‌ డాన్సుల మినిస్టర్‌’ అని ట్యాగ్‌ తగిలించేస్తున్నారు కొందరు ఔత్సాహికులైన నెటిజన్లు. ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా కన్నబాబు ఇమేజ్‌ని దారుణంగా డ్యామేజ్‌ చేసేసిందని సొంత నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట. కాగా, వైసీపీలోనే కొందరు ఈ వీడియో తీసి నెట్‌లో వదిలారన్న అనుమానాలూ లేకపోలేదు. ఈ వ్యవహారంపై మంత్రి కన్నబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారనీ, తనపై దుష్ప్రచారం జరుగుతున్నా, తనకు మద్దతుగా వైసీపీలో ఎవరూ మాట్లాడటంలేదంటూ కన్నబాబు, పార్టీ అధిష్టానం దృష్టికి తన ఆవేదనను తీసుకెళ్ళారట. అదే నిజమైతే కన్నబాబు ఇమేజ్‌కి డ్యామేజీ కాస్త ఎక్కువగానే జరిగిందనుకోవాలేమో.!