మళ్ళీ కెలికిన హరీష్ రావు.! నిజమే చెప్పారు సుమీ.!

ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని మరోమారు ర్యాగింగ్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు. ఇలా ఏపీ లీడర్స్‌ని ఆయన ఏకిపారేయడం ఇదే కొత్త కాదు.! అయినా, పొరుగు రాష్ట్రం గురించి అలా ఎలా హరీష్ రావు విమర్శలు చేయగలుగుతారు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం దృష్టిని ఆకర్షించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారన్నమాట తెలంగాణ నాయకులు.

రాష్ట్రం విడిపోతే తెలంగాణలో కరెంటు వుండదని ఆంధ్రోళ్ళు అన్నారనీ, ఇప్పుడు ఆంధ్రాలోనే చీకట్లు అలముకున్నాయనీ, తెలంగాణలో వెలుగులున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీయార్ మాటలకి వంత పాడుతున్నారు హరీష్ రావు. అయితే, హరీష్ రావు మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ నాయకులకి మాటలెక్కువ, చేతలు తక్కువ. ఔను, చేతలు తక్కువే. చేవగలిగిన నాయకులే అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని ఎందుకు విడిపోనిస్తారు.?

ఇంతకీ, ఏపీ మీద భారత్ రాష్ట్ర సమితికి ఎందుకంత ప్రేమ.? ప్రేమ కాదు, నిజానికి వెటకారం.! ఏపీ నాయకుల్ని తిట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఒలకబోస్తున్నారంతే.!