గుంటూరులో వైసీపీ గూబ గుయ్యిమనే రోజులు దగ్గరోనే ఉన్నాయట ?

YSRCP explanation on Razole loss 
గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటలు అనదగిన జిల్లాల్లో కూడ వైసీపీ పాగా వేయగలిగింది.  అందుకు కారణం జగన్ ఛరీష్మా, కార్యకర్తల మొక్కవోని పనితనం.  ఈ రెండు కారణాల వలనే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తవారిని కూడ జనం గెలిపించారు.  జగన్ సపోర్ట్ చేశారు అనే ఒకే ఒక్క రీజన్ పట్టుకుని వారికీ ఓట్లు గుద్దేశారు.  అలాంటి జిల్లాలో గుంటూరు జిల్లా కూడ ఉంది.  మొదటి నుండి ఇక్కడ తెలుగుదేశం హవా కొద్దిగా ఎక్కువే.  పార్టీ తరపున కొమ్ములుతిరిగిన సీనియర్ నాయకులు ఉన్నారు.  వారంతా గత ఎన్నికల్లో యువ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు.  జిల్లాలోని రేపల్లె, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మినహా అన్నిచోట్లా వైసీపీ జెండా రెపరెపలాడింది.  
 
Guntur YSRCP MLA’s doing poor job
 
కొన్ని చోట్ల మంచి మెజారిటీ దక్కితే కొన్నిచోట్ల తృటిలో విజయం సాధించిన నేతలు ఉన్నారు.  మొదటిసారి పోటీలోనే గెలిచిన లీడర్లు ఉన్నారు.  వారిలో మహిళలు కూడ ఉన్నారు.  మొదటిసారి పదవి దక్కితే పాతుకుపోవడానికి ఎంతో క్రమశిక్షణ అవసరం.  లేదంటే తర్వాతి ఎన్నికల్లో ప్రజలు తిప్పికొడతారు.  మరి పాతుకుపోవాలంటే ఏం చేయాలి.. పనితనం కనబర్చాలి.  కానీ గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు అందునా కొత్తవారు దూకుడుగా వెళుతున్నారే తప్ప ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారు.  రాజకీయాల్లో ప్రచారం, పలుకుబడి చూపించడం అవసరమే.  కానీ అచ్చంగా వాటి మీదే పునాదులు కట్టుకుంటామంటే మాత్రం కుదరదు.  సరిగ్గా ఇదే తప్పు చేస్తున్నారు వైకాపా నేతలు. 
 
వైసీపీ తరపున గెలిచిన ఒక మహిళా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో, శ్రేణులతో కలివిడిగా ఉండాల్సింది పోయి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.  సొంత పార్టీ నేతలే ఆమెను ఎప్పుడెప్పుడు దెబ్బకొడదామా అని కాచుకుని కూర్చున్నారు.  ఇక మరొక మహిళా ఎమ్మెల్యే ప్రచారమే ప్రథమం అంటున్నారు.  ఎంపీతో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించాలని, మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.  ఇక మరొక యువ ఎమ్మెల్యే సైతం సొంత లాభం తప్ప జనం ప్రయోజనాలను పట్టించుకోవట్లేదనే అపవాదును మూటగట్టుకున్నారు.  ఇంకొక సీనియర్ నాయకుడు సైతం ఇదే పంథాలో పోతున్నారట.  ఇలా నిత్యం స్వీయ రక్షణ, సొంత ప్రయోజనాల వెంటే పరిగెడుతూ అభివృద్ధిని విస్మరించరాని వీరి మీద జనం గుర్రుగా ఉన్నారట.  రానున్న రెండున్నరేళ్లలో వీరంతా ఇదే పంథాలో నడిస్తే గెలవడం సంగతి దేవుడెరుగు జగన్ సైతం టికెట్ ఇవ్వడానికి వెనుకాడవచ్చని అంటున్నారు.