విశాఖ పట్నానికి చెందిన టిడిపి నేత నలంద కీశోర్ అస్వస్థతతో శనివారం మృతి చెందారు. కరోనా అవునా కాదా అనేది నిర్థారణ కాలేదు. నలంద కిషోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు దగ్గర అనుచరుడు. గత నెల 23 వతేదీ సిఐడి పోలీసులు నలంద కీశోర్ ను విశాఖలో అరెస్టు చేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ రావుపై సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టారనే నేపంపై అరెస్టు చేసి రోడ్డు మార్గాన కర్నూలుకు తీసుకు పోయి విచారణ జరిపి వదలి పెట్టారు. గమనార్హమైన అంశమేమంటే అప్పట్లో నలంద కీశోర్ అరెస్టు జరిగినపుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై కోపముంటే తనమీద తీర్చుకోవాలని తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టడం తగదని వైకాపా ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. కాని ప్రస్తుతం అస్వస్థతకు గురై నలంద కీశోర్ మృతి చెందితే వెళ్లి పార్థివ దేహంపై పూల మాల వేసి వచ్చారు. కాని ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడలేదు.
విజయసాయి క్వారంటైన్లో ఉండటమే గంటాకు కలిసొచ్చిందట
మరో విశేషమేమంటే రాష్ట్రంలోని ఎక్కువ మీడియా కూడా గంటా శ్రీనివాసరావు అనుచరుడు అని వార్తలు ఇచ్చాయి. తక్కువ స్థాయిలో టిడిపి నేత అని వివరణ ఇచ్చాయి.ఈ లోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇంకా ఇంకా టిడిపి నేతలు అందరూ ఒక టిడిపి నేతను కోల్పోయామని వివరణ ఇచ్చారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వైకాపా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించినందన ఆ ఆవేదన క్షోభతో నలంద కీశోర్ మృతి చెందారని ఇది సర్కారు హత్యగా ఆరోపిస్తున్నారు. అరవై సంవత్సరాల వయసు గల నేతను ఇంత దూరం తీసుకెళ్లి వదలి పెట్టడం అనంతరం మృతి చెందడం రాజకీయంగా ఉపయోగించుకొనేందుకు స్పీడ్ పెంచారు. ఒక్క టిడిపి నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా నలంద కీశోర్ ను అక్రమ అరెస్టు చేశారని ఫలితంగానే మృతి చెందారని బహిరంగ ప్రకటనలు చేస్తున్నా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నోట ప్రస్తుతం ఒక్క మాట రావడం లేదు.
ఇందుకు రాజకీయ వర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి. వారం రోజులుగా గంటా శ్రీనివాసరావు వైకాపా గూటికి చేరతారని సోషల్ మీడియాలోనే గాక ప్రింట్ మీడియాలో కూడా వార్తలు హోరెత్తుతున్నాయి. ఇంత క్రితమే ఈ వార్తలు వున్నా ప్రస్తుతం తీరు వేరు. ఆగస్టు 15 వతేదీ ముహూర్తం ఖరారైనదని ప్రచారంలో వుంది. ఈ పరిస్థితుల్లో వైకాపాకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా ఇబ్బందే. పైగా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి విశాఖ లో లేని సమయంలో కొందరు మధ్య వర్తుల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద యస్ అనిపించుకున్నారని ప్రచారం వుంది. ఈ పరిస్థితుల్లో నోరు విప్పడమంటే ఇంతే సంగతులు. మరో విశేషమేమంటే శ్రీనివాస్ రావు వైకాపాలో చేయడంపై అవునని గాని కాదని గాని చెప్ప లేదు. పైగా టిడిపితో అంటీ అంటనున్నట్లు వున్నారు.
గంటా 5 కోట్లు స్కామ్.. వైసీపీ ఎంపీ సంచలనం..!
ఈ నేపథ్యంలో నలంద కీశోర్ అకాల మృతి చెందారు. గతంలో అరెస్టు అయిన సందర్భంలో కోపముంటే తనపై తీర్చుకోవాలని ప్రకటన చేసిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం వాస్తవం చెప్పాలంటే తన అనుచరుణి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రకటన చేయ వలసి వుంది. ప్రస్తుతం నోరు విప్పడం లేదు. ఎందుకంటే తన అనుచరుని మృతికి ప్రభుత్వానిది బాధ్యత అని చెబితే ప్రచారంలో వున్నట్లు ఇక వైకాపా గేట్లు మూత పడతాయి. అందుకే గంటా శ్రీనివాసరావు నోరు విప్పడం లేదని అందరు భావిస్తున్నారు.
టిడిపి నేతలు మాత్రం వ్యూహాత్మకంగా నలంద కీశోర్ మృతి మొత్తం ప్రభుత్వ దమన కాండకు చుడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని దిగమింగుకొని వైకాపా గూటికి చేరతారా? లేక అనుచరుని కోసం నిలబడతారా?ఈ సందర్భంలో గంటా శ్రీనివాసరావుకు మరో ముప్పు వుంది. వైకాపా పోలీసు జులుంతో తన అనుచరుడు నలంద కీశోర్ చనిపోయారని టిడిపి కోడై కూస్తుంటే చెవులు మూసుకొని వైకాపా గూటికి చేరితే నలంద కీశోర్ మృతి కారణంగా మనస్థాపంతో వున్న కేడరు ఎంత మంది గంటా శ్రీనివాసరావు వెంబడి వెళతారో మిలియన్ డాలర్ల ప్రశ్నే