గన్నవరంలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం.. వంశీకి న‌యా మొగుడు వ‌చ్చాడే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. అక్క‌డ టీడీపీ త‌రుపున వ‌రుస‌గా విన్న‌ర్‌గా నిలుస్తున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇటీవ‌ల ఇన్‌డైరెక్ట్‌గా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అధికార పార్టీకి మ‌ద్ద‌తుతెలిపిన నేప‌ధ్యంలో, ఇక గ‌న్న‌వ‌రంలో చ‌క్రం తిప్పుదామ‌ని భావించిన వంశీకి అనూహ్యంగా కొత్త ప్ర‌త్య‌ర్ధి ఎంట్రీ ఇచ్చాడు.

గ‌త ఎన్నిక‌ల్లో వంశీ చేతిలో ఓడిపోయిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు సీయం జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతో గ‌న్న‌వ‌రంలో వైసీపీ పార్టీ ప‌గ్గాలు త‌న‌వేన‌ని భావించిన వంశీకి, వైసీపీ సీనియ‌ర్ నాయకుడు దుట్టా రామ‌చంద్రరావు మొగుడులా త‌ర‌య్యారు. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన దుట్టా రామచంద్ర‌రావు 2014 ఎన్నిక‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ పై ఓడిపోయారు.

ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుని యార్ల‌గ‌డ్డ‌కు స‌హ‌క‌రించిన దుట్టా, ఆయ‌న ఓడిపోయినా వైసీపీ అధికారంలోకి రావ‌డంతో మ‌రోసారి ఆయ‌న పొలిక‌ల్‌గా యాక్టీవ్ కావ‌ల‌ని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నుండి వంశీ వైసీపీలోకి రావ‌డంతో గ‌న్న‌వ‌రం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

ఇక ఒవ‌వైపు వ‌ల్ల‌భ‌నేని వంశీ క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెంద‌ని నేత. మ‌రోవైపు దుట్టా కాపుసామాజిక‌వ‌ర్గానికి చెంద‌ని నేత కావ‌డంతో గ‌న్న‌వ‌రంలో వంశీకే అనుకూలంగా ఉంది. అయితే ప్ర‌స్తుతం దుట్టా అల్లుడు, రెడ్డి వ‌ర్గానికి చెందిన డాక్టర్ శివ‌భ‌ర‌త్ రెడ్డి గ‌న్నవ‌రం రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఊసుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్న భ‌ర‌త్ రెడ్డి, వంశీ వ్య‌తిరేకుల్ని ఏకం చేసి త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌ల్ల‌భ‌నేని అంటే గిట్ట‌ని వారికి, త‌గిన ప్రాధాన్యం ఇస్తూ.. గ‌న్న‌వ‌రం పార్టీ ఇంచార్జ్ త‌న‌కు ఇస్తే, అక్క‌డ‌ త‌న‌దైన శైలిలో అభివృద్ధి చేస్తాన‌ని నాయ‌కుల‌కు హామీ ఇస్తున్నారు శివ‌భ‌ర‌త్ రెడ్డి.

మ‌రోవైపు గ‌న్న‌వ‌రంలో ఉపఎన్నిక జ‌రిగితే టిక్కెట్ త‌మ‌కే ఇవ్వాల‌ని దుట్టా రామ‌చంద్ర‌రావు ప‌ట్టుప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే అక్క‌డి ఇంచార్జ్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ‌ద్ద ప్రస్తావించార‌ని స‌మాచారం. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వారికి ప‌దవులు ఇచ్చి, ఎప్ప‌టి నుంచో పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేద‌ని రామ‌చంద్ర‌రావు తేల్చి చెప్పార‌ట‌.

ఈ క్ర‌మంలో గ‌న్న‌వ‌రంలో ఉప‌ ఎన్నిక జ‌రిగితే వైసీపీ నుండి అక్క‌డి సీటు భ‌ర‌త్‌రెడ్డిదే అంటూ ఆయ‌న వ‌ర్గం ప్రచారం చేస్తోంది. మ‌రోవైపు వల్లభనేని వంశీని కూడా వైసీపీ పక్కన పెట్టే పరిస్థితి లేదు. గ‌న్న‌వ‌రంలో గ‌త కొన్నేళ్ళుగా వంశీ దుకుడుగా ఉన్నారు. మ‌రి శివ‌భ‌ర‌త్ రెడ్డికి సీటు ఇస్తే వంశీ ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో గ‌న్న‌వ‌రంలో జ‌రుగుతున్న‌ రాజ‌కీయాని సీయం జ‌గ‌న్ ఎలా డీల్ చేస్తారు.. ఫైన‌ల్ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నేది రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.