తొమ్మిదిన్నరేళ్ళలో ఎందుకు చెయ్యలేదు కేసీయార్.!

గజ్వేల్ నుంచి కేసీయార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంకోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. దాంతోపాటుగా, కామారెడ్డి నియోజకవర్గం కూడా.!

తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా కేసీయార్ అధికారంలో వున్నారు. వరుసగా రెండు దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. మూడో దఫా మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని కేసీయార్ అంటున్నారు.

గజ్వేల్, కామారెడ్డి.. ఇంకే నియోజకవర్గమైనా.. గడచిన తొమ్మిదిన్నరేళ్ళలో ‘బంగారం’లా మారిపోవాలి కదా.? మళ్ళీ కొత్తగా ఇప్పుడు, ‘మళ్ళీ అధికారంలోకి వస్తే, అభివృద్ధి చేస్తాం..’ అని కేసీయార్ చెబుతారేంటి.? అదే మరి, పొలిటికల్ మాయ అంటే.!

తెలంగాణ రాష్ట్రమంటూ ఏర్పడితే, ఆ తెలంగాణ రాష్ట్రానికి దళితుడే తొలి ముఖ్యమంత్రి.. అని ఇదే కేసీయార్, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు. ఏదీ ఆ మాట.? అంటే, అదంతే.! ఎవరన్నా ఈ విషయమై ప్రశ్నిస్తే, వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే.

ఈసారి కేసీయార్, గజ్వేల్‌లో ఓడిపోతారట.. అందుకే, కామారెడ్డి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారట.. అన్నది ఓ వాదన. ఛాన్సే లేదు, కేసీయార్ ఓడిపోవుడేంది.? అంటే, ఏం.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో స్వయంగా ఓటమి చవిచూడలేదా.?

కేసీయార్ విషయంలోనూ అదే తరహా ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందట. రెండు చోట్లా కేసీయార్ ఓడిపోతారనే చర్చ అంతటా జరుగుతోంది. ఇదో నెగెటివ్ సెంటిమెంట్. అందుకే, ‘గెలిస్తే, అద్భుతంగా అభివృద్ధి చేస్తా..’ అంటూ కేసీయార్ ఏవేవో కతలు చెపుతున్నారు.