Vijayasai Reddy: సాయిరెడ్డి సొంత మీడియా ప్రయాణం మొదలైందా?

Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వి. విజయసాయిరెడ్డి రాజకీయాల్లో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినా, వ్యక్తిగత వ్యాపారాలతో మాత్రం బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన సొంత మీడియా హౌస్ ఏర్పాటు చేసే పనులు మళ్లీ జోరందుకున్నాయన్న టాక్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ మధ్య తరచుగా ప్రయాణాలు చేయడంపై ఊహాగానాలు పెరిగాయి.

సాయిరెడ్డి త్వరలో ‘వి-టీవీ’ పేరుతో కొత్త మీడియా సంస్థను ప్రారంభించనున్నారని సమాచారం. దీని కోసం నార్త్ ఇండియా నుంచి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఫండింగ్ వ్యవహారాలను చూసుకుంటున్నాడట. ఈ ఏడాది దసరా నాటికి ఛానెల్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులను ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ఓ ప్రముఖ ఛానెల్‌కు సీఈవోగా పని చేసిన అధికారితో చర్చలు కొనసాగుతున్నాయని కూడా సమాచారం.

ఇప్పటికే సాయిరెడ్డి సొంత ఛానెల్ గురించి గత ఏడాది ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం వల్ల పూర్తి స్థాయిలో దాని పై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో స్వల్ప విరామం తీసుకున్న నేపథ్యంలో, సొంత మీడియా కలను నిజం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తనకు ప్రత్యేక వేదిక అవసరమని భావించిన సాయిరెడ్డి, త్వరలో తన దారిని స్పష్టంగా చూపించనున్నారు.

చానెల్ ఏర్పాట్ల విషయంలో సాయిరెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బయటకి పెద్దగా సమాచారం లీక్ కాకుండా అన్ని ఏర్పాట్లను గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడలో మీడియా సమావేశంలో సొంత మీడియా వ్యాపారంపై అడిగిన ప్రశ్నకు, “త్వరలో అప్డేట్ ఇస్తాను” అని సమాధానం ఇచ్చి తప్పించుకున్న ఆయన స్టేట్‌మెంట్ వెనుక మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి, సాయిరెడ్డి సొంత మీడియా ప్రయాణం త్వరలోనే అధికారికంగా వెలుగులోకి రావచ్చు. దీంతో రాజకీయ రంగంలో మరో మేజర్ మీడియా వేదిక సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

జైలుకు జగన్.! || Ex Home Minister Mysura Reddy About Ys Jagan Arrest || Yscrp Vs TDP || TeluguRajyam