కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటి పై ఐటి దాడులు చేస్తోంది. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్, కొడంగల్ తో సహా 15 చోట్ల ఐటి సోదాలు నిర్వహిస్తోంది. పదవి రాగానే ఈడి,ఐటి దాడులు జరుగుతాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టుగానే గురువారం ఉదయం రేవంత్ రెడ్డి ఆస్తులు, ఇంటి పై ఐటి దాడులు ప్రారంభించింది. గతంలో ఓటుకు నోటు కేసు, జూబ్లీహిల్స్ లో అక్రమ ఫ్లాట్ల విక్రయం చేశారని ఇటీవల పోలీసులు రేవంత్ కు నోటిసులు ఇచ్చారు.
రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్, హైదరాబాద్ ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్తుల పత్రాలు, వ్యాపార లావాదేవిలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను స్విచ్చాఫ్ చేయించి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు ఐటి బృందాలు సోదాలు చేస్తుంది. రేవంత్, అతని సోదరుని కంపెనీల పై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం ఎన్నికల ప్రచారం కోసం 3 కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం కోసం కొడంగల్ తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రచార కార్యదర్శి పదవి కోరుకున్నా ఆయన ఆశించిన పదవి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పదవి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోరు విప్పలేదు. ఇటీవల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసి 14 రోజుల పాటు జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో తన పై కూడా దాడులు జరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టుగా దాడులు జరుగుతున్నాయి. రేవంత్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగానే దాడులు జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా కాంగ్రెస్ నేతల మీద దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని గురువారం నుంచి షురూ చేద్దామనే ఉద్దేశ్యంతో ఆయను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకన్నను దర్శించుకొని బుధవారం రాత్రి కొడంగల్ చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిద్దామనుకునే లోపే ఐటి దాడులు మొదలయ్యాయి. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేవంత్ రెడ్డి ఇంటి పై దాడుల స్కెచ్ ఇదే.. కింద లింక్ పై క్లిక్ చేయండి వివరాలు వస్తాయి.