దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఓటమి: నైతిక బాధ్యత ఎవరిది.?

దుబ్బాక ఫలితం ఎప్పుడో డిసైడ్‌ అయిపోయింది..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లైట్‌ తీసుకున్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటే.. ఆ రెండిటినీ ప్రజలు తరిమికొడతారు..’ అని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘దుబ్బాకలో రికార్డ్‌ స్థాయి విజయం సాధిస్తాం.. బస్తీ మే సవాల్‌..’ అంటూ తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు. కానీ, ఏమయ్యింది.? టీఆర్‌ఎస్‌ ఎందుకు దుబ్బాకలో ఓడిపోయింది.? సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో తలెత్తిన ఉప ఎన్నికని గెల్చుకోలేకపోవడం నిజంగానే దౌర్భాగ్యం.. మరి, ఈ ఓటమికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.!
dubbaka by elections latest news
dubbaka by elections latest news

హరీష్‌రావు రాజీనామా చేయాల్సిందేనా.?

రాజకీయ విశ్లేషకుడు కృష్ణారావు ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, దుబ్బాకలో ఫలితాలు చూస్తోంటే బీజేపీ గెలిచేలా వుంది.. ఒకవేళ గెలవకపోయినా.. తక్కువ మెజార్టీతో ఓడిపోయినా.. నైతికంగా బీజేపీ గెలిచినట్లే.. నైతికంగా టీఆర్‌ఎస్‌ ఓడినట్లే.. మంత్రి హరీష్‌రావు తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. ఇది, రెండు మూడు రౌండ్ల ఫలితాల సమయంలో వ్యక్తం చేసిన అభిప్రాయం. నిజమే, దుబ్బాక ఉప ఎన్నికని టీఆర్‌ఎస్‌లో అత్యంత సీరియస్‌గా తీసుకున్నది హరీష్‌రావు మాత్రమే. బరిలోకి దిగిన అభ్యర్థి సోలిపేట సుజాత కూడా ఆ స్థాయిలో తన గెలుపు గురించి పోరాడలేదేమో.! అన్నీ తానే అయి వ్యవహరించారు హరీష్‌రావు. కానీ, ఫలితం తేడా కొట్టేసింది.
dubbaka by elections latest news
dubbaka by elections latest news

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మొదటి నుంచీ నైరాశ్యమే..

టీఆర్‌ఎస్‌ గట్టిగానే ప్రచారం చేసింది.. ఎక్కడికక్కడ గులాబీ జెండాలు కనిపించాయి.. ఓటర్లను ప్రలోభపెట్టే పర్వంలో టీఆర్‌ఎస్‌ తక్కువేమీ చెయ్యలేదు. బీజేపీ సంగతి సరే సరి. కాంగ్రెస్‌ జెండాలు కూడా ఎక్కువగానే నడయాడాయి. కానీ, పైకి ఎంత హంగామా చేసినా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నైరాశ్యం కనిపించింది. ‘హరీష్‌రావు ఒక్కరే కష్టపడుతున్నారు.. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల్లో చాలామంది లైట్‌ తీసుకున్నారు..’ అన్న ఆవేదన టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో స్పష్టంగా కనిపించింది.

నైతిక బాధ్యత వహించాల్సింది పార్టీ అధినేతే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌, దుబ్బాక ఉప ఎన్నిక పలితానికి నైతిక బాధ్యత వహించాల్సిందే. రాజీనామా చేయడం.. అనే డిమాండ్ల సంగతి పక్కన పెడితే, ‘ఫలితం ముందే డిసైడ్‌ అయిపోయింది..’ అని అధినేత లైట్‌ తీసుకోవడం, పార్టీ శ్రేణుల్లో కొంత అలసత్వానికి కారణమయ్యింది. కేసీఆర్‌ గనుక ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుంటే.. ఇంకాస్త అగ్రెసివ్‌గా టీఆర్‌ఎస్‌ వ్యవహరించి వుంటే, దుబ్బాక ఫలితం ఇంకోలా వుండేది. కానీ, డ్యామేజీ జరిగిపోయింది. టీఆర్‌ఎస్‌కి ఇది నిజంగానే కోలుకోలేని దెబ్బ.