నీళ్లు ఇలా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. త్వరలోనే మీ కిడ్నీలు ఫసక్..!

ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే నీరు తాగడం ఎంత ముఖ్యమో.. నీరు తాగే విధానం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. మన శరీరానికి అవసరమైన నీరు సరైన పద్ధతిలో తాగితేనే దాని ప్రయోజనాలు దక్కుతుంది. కానీ ఆధునిక జీవనశైలిలో ఒక చిన్న అలవాటు మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే నిలబడి నీళ్లు తాగే అలవాటు.

నిలబడి నీళ్లు తాగినప్పుడు, అది శరీరంలో సరిగా శోషించబడకుండా వేగంగా కిడ్నీ, మూత్రాశయానికి చేరుతుంది. దీని వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి ఏర్పడి, కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, నీరు వేగంగా శరీరంలో కిందికి వెళ్లిపోవడం జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్, ఆమ్లాల పనితీరును భంగం చేస్తుంది. దీంతో అజీరణం, వాయువు, గ్యాస్ వంటి సమస్యలు మొదలవుతాయి.

కొన్నిసార్లు వేగంగా నీరు తాగడం వల్ల అది తప్పు మార్గంలో ఊపిరితిత్తుల వైపు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు లేదా శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాదు నీరు సరైన పద్ధతిలో శోషించబడక నేరుగా రక్తంలో కలిసిపోవడం వల్ల హఠాత్తుగా రక్తం తక్కువ సాంద్రతతో మారి గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యాలు చెబుతున్న ఒకే సూత్రం నీరు కూర్చుని, మెల్లగా, గ్లాస్‌లో తాగాలి. శరీరం సడలిన స్థితిలో ఉండగా నీరు తాగితే అది మెరుగ్గా శోషించబడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

సాధారణంగా కనిపించే ఈ అలవాటు.. ఒక రోజులోనే సమస్యను రాకపోయినా, సంవత్సరాల పాటు కొనసాగితే శరీరానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. కాబట్టి నీరు తాగే విధానంలో చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని పెద్ద ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.