బీజేపీని నిలదీసే ధైర్యం వైసీపీ, టీడీపీలకి లేదా.?

Do the YSRCP and TDP have the courage to depose the BJP?

ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. ప్రత్యేక ప్యాకేజీకి దిక్కు లేదు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో అయోమయం తొలగలేదు.. రాజధాని లేదు, రాజధానులూ లేవు.. వెనుకబడిన జిల్లాలకోసం ఇవ్వాల్సిన ప్యకేజీ కూడా లేదు.. పోర్టూ లేదు, స్టీల్ ప్లాంటూ లేదు.. రైల్వే జోన్ ఏమయ్యిందో తెలియదు.. ఇవన్నీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కిన హక్కులే. కానీ, దేని విషయంలోనూ కేంద్రాన్ని నిలదీసే సాహసం అటు టీడీపీగానీ, ఇటు వైసీపీగానీ చేయడంలేదు. టీడీపీ అధికారంలో వున్నప్పుడే చంద్రబాబు దీక్షలు చేశారు.. అదీ బీజేపీతో తెగతెంపులయ్యాక. టీడీపీ అధికారంలో వున్నప్పుడే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేశారు.. వైసీపీ ఎంపీలు, తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ, ఏం లాభం.? కేంద్రం అస్సలు పట్టించుకోలేదు. ఏళ్ళు గడుస్తున్నాయ్. తాజా బడ్జెట్ సందర్భంగా కూడా రాష్ట్రానికి ఊరట లభించలేదు.

Do the YSRCP and TDP have the courage to depose the BJP?

పైన పేర్కొన్న అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించబడలేదంటే, రాష్ట్రం పట్ల కేంద్రానికి వున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. అయినాగానీ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిలదీయడంలేదు. పైగా, వైసీపీ – టీడీపీ ఒకరి మీద ఒకరు దుమ్మత్తిపోసుకోవడంతోనే సరిపోతోంది. ‘రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడంలేదు..’ అన్నది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు ఉవాచ. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పైన పేర్కొన్న అంశాల్లో చంద్రబాబు ఎన్నింటిని సాధించగలిగినట్లు.? అన్న ప్రశ్నకు టీడీపీ నేతల వద్ద సమాధానం లేదు. ప్రత్యేక హోదా కోసం గతంలో నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్, ఇప్పుడెందుకు కనీసం కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంలేదు.? అంటే, వైసీపీ నేతల వద్ద సమాధానం వుండదు. టీడీపీ హయాంలోనూ వైసీపీ – టీడీపీ మధ్యనే గొడవు. వైసీపీ అధికారంలో వున్నప్పుడూ టీడీపీ – వైసీపీ మధ్యనే గొడవ. అందుకేనేమో, కేంద్రం.. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోంది.