హత్య చేసినోడు హంతకుడే అవుతాడు.! అధికార పార్టీ నాయకుడైనా, విపక్షాలకు చెందినవారైనా.. వైసీపీ హంతకుడు, టీడీపీ హంతకుడు.. ఇంకో పార్టీ హంతకుడు.. ఇలా వుండవు.! హత్యలకు పాల్పడేవాళ్ళెవరైనా, నరరూప రాక్షసులుగానే చూడాలి.
దురదృష్టం, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చిత్రంగా వుంటాయ్. జుగుప్సాకరంగా ఆ రాజకీయాలు కనిపిస్తుంటాయ్. అక్కడ జరిగేదంతా, అదే రాజకీయం.
వైసీపీ కార్యకర్త ఒకరు, పదో తరగతి చదువుకున్న విద్యార్థి ఉసురు తీశాడు. ఆ విద్యార్థి మంటల్లో కాలిపోయాడు. తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. చనిపోయే ముందు, తనను కాల్చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాడు. ఆ నర రూప రాక్షసుడి పేరు వెంకటేశ్వర్ రెడ్డి.
మృతుడి పేరేమో అమర్నాథ్. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం తక్షణం అందించే ప్రయత్నం చేసింది. ఆ సొమ్మని తీసుకుని, స్వయంగా ఎంపీ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు.
ఇలాంటి సందర్భాల్లో అధికారంలో వున్నోళ్ళూ సంయమనం పాటించాలి. పబ్లిసిటీ స్టంట్లు చేయకూడదు. ఆ సొమ్ము మీడియా కంట పడేలా చేయడంలో అధికార పార్టీ ఉద్దేశ్యమేంటి.? ఆ సంగతి పక్కన పెడితే, ‘వైసీపీలో అందరూ హంతకులే’ అంటోంది తెలుగుదేశం పార్టీ.
కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ని చంపేసిన ఘటన దగ్గర్నుంచి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వరకు.. అన్నిటినీ లాగుతున్నారు టీడీపీ నేతలు. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం.!