ట్యాపింగ్ ఆరోణల్లో ఆధారాలుంటే ఇవ్వండి.. చంద్రబాబుకు డీజీపీ లేఖ

Gowtham Sawang and Chandra Babu Naidu
రాష్ట్రంలో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  ఈ ఆరోపణలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది.  ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు.  అందులో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను.. వైకాపా ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు.  ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.  ఈ విషయమై కేంద్ర ఐటీ శాఖా మంత్రికి కూడా లేఖ రాశారు.  ఈ లేఖపై ఏపీ హోం మంత్రి స్పందించగా తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం లేఖ ద్వారా చంద్రబాబు లేఖకు స్పందించారు. 
 
Gowtham Sawang and Chandra Babu Naidu
 
లేఖలో డీజీపీ మీరు 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీగారికి రాసిన లేఖ రాశారు.  ఆ లేఖ మీడియాలో బాగా కవరేజ్ పొందింది.  అందులో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, లాయర్ల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నట్టు మీరు ఆరోపించారు.  కొందరు ప్రైవేట్ వ్యక్తులు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్టు మీరు తెలిపారు.  కానీ ఇప్పటివరకు ఈ విషయమై మీరు చెబుతున్న బాధితుల నుండి మాకు ఎలాంటి పిర్యాధు అందలేదు.  ఇండియన్ టెలిగ్రాఫ్ టాక్ట్ 1885, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  ఈ సంధర్భంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల, వ్యక్తుల హక్కులను కాపాడటానికి మేము ఖచ్చితంగా నిలబడతాం అన్నారు.  
 
అంతేకాకుండా ప్రజల హక్కులను కాపాడటానికి, న్యాయం ప్రకారం ముందుకెళ్లడానికి తమకు సహకరించాలని చంద్రబాబు నాయుడును కోరారు.  ఈ లేఖను బట్టి చంద్రబాబు నాయుడుగారు అంటున్నట్టు ట్యాపింగ్ మీద తమకు ఎలాంటి పిర్యాధులు అందలేదని, మీరంత బలంగా చెబుతున్నారు కాబట్టి విచారణ కోసం అవసరమైన సమాచారం, ఆధారాలు ఎమైనా మీ దగ్గర ఉంటే తమకు అందించి సహకరించాలని డీజీపీ సవాంగ్ తెలిపారు.  మరి ఈ బాబుగారు ఎలాంటి ఆధారాలు ఇస్తారో చూడాలి.