Deputy Speaker Warns Jagan: ”అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే” జగన్‌కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

ప్రతిపక్ష హోదా లభించలేదనే కారణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, ప్రతిపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంటి పిల్లాడిలా మారాం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

“అసెంబ్లీ నిబంధనల ప్రకారం, మొత్తం స్థానాల్లో 10 శాతం, అంటే కనీసం 18 స్థానాలు గెలిచిన పార్టీకే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ ప్రాథమిక నిబంధన తెలిసినప్పటికీ జగన్ అనవసరంగా పట్టుబడుతున్నారు” అని రఘురామకృష్ణరాజు అన్నారు. చట్టసభలకు వరుసగా 60 రోజుల పాటు సభ్యులు గైర్హాజరైతే, వారి సభ్యత్వం వాటంతట అదే రద్దవుతుందనే నిబంధనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తాను డిప్యూటీ స్పీకర్‌గా, వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. “వారు సభకు రాకుండా, ఉప ఎన్నికలనే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే వారి ఉద్దేశమైతే మేం చేయగలిగిందేమీ లేదు. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం” అని రఘురామకృష్ణరాజు పరోక్షంగా హెచ్చరించారు. వైసీపీ సభ్యుల నిర్ణయం వల్ల పులివెందుల వంటి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రఘురామకృష్ణరాజు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.

KS Prasad Sensational Comments On Chandrababu Over Jagan Opposition Status | Telugu Rajyam