చిన్న ఉద్యోగం, తక్కువ ఆదాయం, కానీ అవసరాలు పెద్దవిగా మారుతున్న ఈ రోజుల్లో అప్పులు తీసుకోవడం చాలా సాధారణం. కానీ వాటిని తీర్చడం మాత్రం కొందరికి పుట్టిన పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలనుకున్న ఓ యువకుడు AI చాట్ జీపీటీని ఆశ్రయించాడు. అప్పుల నుంచి బయట పడేందుకు ఏం చేయాలి? అని అడిగిన ప్రశ్నకు చాట్ జీపీటీ చాలా స్పష్టమైన పద్ధతిని సూచించింది.
ముందుగా మీ అప్పులన్నింటినీ ఓ కాగితంపై రాసుకోండి – ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు తిరిగి చెల్లించాలో, వడ్డీ ఎంత అని వివరంగా లిస్టు తయారుచేయమంది. అప్పు తీరే వరుసలో మొదటగా చిన్న మొత్తాన్ని ఎంచుకోవాలని, దాన్ని తీర్చడం ద్వారా కలిగే సంతృప్తి తర్వాతి దశకు ప్రేరణగా మారుతుందని చెప్పింది. ఈ విధానాన్ని “డెబ్ స్నోబాల్” అంటారు. చిన్న అప్పులే అయినా ఒక్కొక్కటిగా ముగిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, పెద్ద అప్పుల్ని ఎదుర్కోవడం సులభమవుతుందన్నది సూచన.
క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, స్నేహితుల అప్పులు – వీటన్నింటికీ వేర్వేరుగా వ్యూహం ఉండాలి. తక్కువ వడ్డీతో పెద్ద మొత్తాన్ని తీసుకుని చిన్న అప్పులను క్లోజ్ చేయడమో, లేక గడువు తేదీకి ముందే చెల్లింపులను ప్రారంభించడమో మంచిదని చెబుతుంది. దీంతో వడ్డీ భారం తగ్గుతుందనీ, తలనొప్పులు దూరమవుతాయనీ చెప్పింది.
అదనంగా, ఆదాయాన్ని పెంచే మార్గాలు కూడా వెతకమంది. చిన్న చిన్న ఫ్రీలాన్స్ పనులు, పార్ట్ టైం ఆదాయాలు అన్నీ కలిపి అప్పు తీర్చడంలో ఉపయోగపడతాయని తెలిపింది. అప్పులు ఎక్కువైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచిదని సూచించింది. మొత్తంగా, మొట్టమొదటిగా కావాల్సింది ‘ప్లాన్’… అంతే కాకుండా ఆ ప్లాన్‌ను క్రమశిక్షణగా అమలు చేయడమే అని చాట్ జీపీటీ చెప్పిన మాటలు యువతకు మంచి మార్గనిర్దేశంగా మారాయి.