భారత్ రాష్ట్ర సమితి విజయావకాశాల్ని తెలంగాణలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ స్వయంగా దెబ్బ తీసుకున్నారు. దళిత బంధు పథకానికి సంబంధించి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లు కేసీయార్ స్వయంగా బీఆర్ఎస్ ప్రతినిథుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ అంశంపై తెలంగాణ సమాజం విస్తుపోతోంది. గ్రామస్థాయిలో కేసీయార్ వ్యాఖ్యల్ని చర్చకు పెడుతున్నాయి విపక్షాలు. ‘అవినీతి నిజమే కదా..’ అంటూ జనంలో చర్చ జరగడమంటే, ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడం దాదాపుగా కేసీయార్‌కి అసాధ్యమేనని అనుకోవాలి.
బీఆర్ఎస్‌లో ఇంకెవరైనా ఈ వ్యాఖ్యలు చేసి వుంటే, ‘ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం’ అని ఆ పార్టీ నేతలు కొట్టి పారేసేవారే. కానీ, అధినేత నోట ఆ వ్యాఖ్యలు వచ్చేసరికి ఎలా ‘కవర్ డ్రైవ్’ చేయాలో అర్థం కాని దుస్థితి వైసీపీ నేతలది.
‘అబ్బే, కేసీయార్ ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, మరింతగా ఇరుక్కుపోతున్నారు.
జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలనుకుంటున్న కేసీయార్, తెలంగాణలో తమ ప్రభుత్వంలోనే.. అందునా అధికార పార్టీ నేతలే అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడం ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్’ కాకపోతే ఇంకేంటి.? ఈ దెబ్బతో కేసీయార్ గ్రాఫ్, బీఆర్ఎస్ గ్రాఫ్ గణనీయంగా దెబ్బ తింది తెలంగాణలో.