Home TR Exclusive ఏంది స్వామీ, కడపోళ్లంతా ఇట్ల చేస్తాండారు? టిడిపి ఎమ్మెల్యే సస్పెన్షన్

ఏంది స్వామీ, కడపోళ్లంతా ఇట్ల చేస్తాండారు? టిడిపి ఎమ్మెల్యే సస్పెన్షన్

రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లే అనిపిస్తుంది. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన కడప జిల్లా పంచాయతీకి హాజరు కాలేదు. ఇది తెలుగుదేశాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. జమ్మలమడుగు వ్యవహారానికి ఇపుడు రాజంపేట కూడా తోడు కావడంతో ముఖ్యమంత్రి చీకాకు పడ్డట్లు సమాచారం. ఈ వార్త రాస్తున్నపుడే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు,

ఏది ఏమయినా కడప జిల్లాను ప్రతిపక్ష నేత జగన్ అకౌంట్ నుంచి లాగే సుకుని టిడిపి సామ్రాజ్యంలో కలుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ పరంగా చాలా సమస్యలెదురవుతున్నాయి. ఆయన ఎంపి ఎన్నికల్లో నిలబడేందుందుకు క్యాండిడేట్లు దొరకడం లేదు. ఉదాహరణకి కడప లోక్ సభ నియోజకవర్గం తీసుకుందాం. అక్కడి నుంచి జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డినో లేదా మంత్రి ఆదినారాయణ రెడ్డినో నిలబెట్టాలని ఆయన చూస్తున్నారు. ఇద్దరు రెడీగా లేరు. మాకు జమ్మలమడుగు చాలు,  అసెంబ్లీ మేలు అంటున్నారు తప్ప ఎంపిగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు.

ఇపుడు రెండో లోక్ సభ స్థానం రాజంపేట. అక్కడి నుంచి పోటీ చేసే వ్యక్తికి లోకల్ ఎమ్మెల్యే సపోర్టు కావాలి. లోకల్ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున రెడ్డి పార్టీ మీద అలిగాడు. ఆయన వైసిపివైపు చూస్తున్నారని పుకారు. ఇదేందో తేల్చుకుందామని పంచాయతీకి రమ్మంటే రాలేదు. కాబట్టి ఆయన ఇక పోయినట్లే నని కడప తెలుగుదేశం పెత్తనం చలాయించే రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అంటున్నారు.

రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డిని సీఎంతో జరిగే సమావేశానికి రావాలని తానే స్వయంగా ఆహ్వానించానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌‌ తెలిపారు. తనతో వస్తానని చెప్పిన మేడా.. తర్వాత మాట మార్చారన్నారు. సీఎంతో సమావేశానికి వెళ్లేముందు రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. మేడా మల్లికార్జునరెడ్డి లేకపోయినా కడప జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పారు. గత ఎన్నికల్లో మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెదేపా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ భాజపాతో పొత్తుతో దెబ్బతిన్నామన్నారు. ఈసారి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని తీరుతామని ఆయన‌ ధీమా వ్యక్తం చేశారు. ‘మేడాను గెలిపించి, (జిల్లాలో టిడిపి తరఫున గెలిచింది ఆయనొక్కరే), ప్రభుత్వ విప్ ను చేశారు ముఖ్యమంత్రి. అంతేకాదు, ఆయన తండ్రిని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా చేశారు. ఇపుడాయన వైసిపి వైపు చూస్తున్నారు. ఇది ద్రోహం. ఆయన ఉన్నా ఊడిన రాజం పేట లోక్ సభ స్థానం, అసెంబ్లీ స్థానం గెల్చుకుంటాం,’ అంటున్నారు రమేష్.

కడప మీద పట్టుకోసం చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన, కుమారుడు లోకేష్ జిల్లాకు అనేక సార్లు వచ్చి సమావేశాలుపెట్టారు. బాగా డబ్బున్న నాయకుడు, మంత్రి ఘంటాను ఇన్ చార్జ్ చేశారు. పులివెందుకు నీళ్లిచ్చారు. గండికోట్ ఫెస్టివల్ నడుపుతున్నారు. ఇపుడు తాజాగా స్టీల్ ప్లాంట్ కుశంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పరంగా జిల్లాలో గ్రిప్పులో ఉన్నట్లు కనిపించినా, పార్టీ పరంగా సమస్యలు జటిలమవుతున్నాయి. జిల్లాలో సిఎం రమేష్ పెత్తనం చాలా మందికి ఇష్టం లేదు. ముఖ్యంగా ప్రొద్దుటూరు నేతలకు అసలు ఇష్టం లేదు. మరి కడప ఎలా దారికి వస్తుందో…

- Advertisement -

Related Posts

ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకోని చంద్రబాబు నాయుడు 

"నేనేం తప్పు చేశానో తెలియదు.. అభివృద్ధి చేయాలనుకోవడం తప్పైతే క్షమించండి" అంటూ చంద్రబాబు చెప్పే నంగనాచి కబుర్లు ఇంకా నమ్మేవారున్నారు అనుకోవడమే ఆయన చేస్తున్న అసలైన పెద్ద తప్పు.  రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు...

పొలిటికల్ కోడి కత్తి: కుత్తుకలు తెగుతున్నాయ్!

ఈ కోడి కత్తి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కత్తి లాంటిదే. కానీ, ఇక్కడి సందర్భం వేరు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే ముందుగా...

చంద్రబాబు డ్రామాలు పండటం లేదు

ఎందుకో తెలియదు...చంద్రబాబు హఠాత్తుగా రైతుజనబాంధవుడు అయ్యాడు.  రైతుల కంట కనీరు కనిపిస్తే చాలు చంద్రబాబు గారి నవనీతహృదయం కరిగి నీరైపోతున్నది.  సమయానుకూలంగా ఆయన పరమభక్తుడై పోతారు.  కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ...

నెరవేరనున్న జగన్ సంకల్పం: విశాఖకు ఆ హోదా అతి త్వరలో

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది విశాఖపట్నం పరిస్థితి. టూరిజం సహా అనేక అనుకూలతలు విశాఖపట్నంకి వున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత అంతటి ప్రత్యేకతలున్న ఏకైక...

Latest News