మోడీకి వెన్నుపోటు… కాంగ్రెస్ కు ఏపీ బీజేపీ నేత భారీ విరాళం!

“కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు.. కనిపించనివన్నీ అబద్ధాలు కాదు.. రాజకీయం ఒక చదరంగం.. కాకపోతే ఇక్కడ తెలుగు నలుపు అనే రెండు రంగులు ఉండవు”… రాజకీయ నాయకుల పెర్ఫార్మన్స్ లు మరీ ఎక్కువగా చూసేసిన వారికి ఈమాత్రం పొలిటికల్ వేదాంతం, పొలిటికల్ తత్వం మాటలు రావడం సహజమనే చెప్పాలి! తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యవహార శైలిని గమనించినవారికి పైన చెప్పిన లైన్స్ మరోసారి చదవాలనిపించినా అతిశయోక్తి కాదు!

నేరుగా పాయింట్ లోకి వెళ్తే… సీఎం రమేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవగానే అదే ఏడాది జూన్ లో బీజేపీలో చేరారు! అయితే… టీడీపీ అధికారం కోల్పోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో… తన మనుషులందరినీ బీజేపీలోకి బాబే పంపించారనే చర్చా రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందుకే సీఎం రమేష్ తో పాటు పలువురు నేతలను కాషాయదళంలో పసుపు బ్యాచ్ అని అంటుంటారు!

అయితే అది మాత్రమే కాదు.. ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్టర్, శ్రేయోభిలాషి అని కూడా అనొచ్చు అని అంటున్నారు పరిశీలకులు. కారణం… ఆయన 2023లో చేసిన పనే! 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆయన స్థాపించిన మైనింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొంది. అదేముందిలే… బీజేపీలో ఉన్నారు, టీడీపీ సపోర్టర్ అని అందరికీ తెలుసు అందుకు కొని ఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్లే!

ఎందుకంటే… ఆ 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లలో రూ.30 కోట్లను కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోకి, రూ.5 కోట్లను టీడీపీ ఖాతాలోకి, మరో రూ. 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్‌ (ఎస్‌) ఖాతాలోకి వేశారు సీఎం రమేష్. ఇలా బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకుండా… రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ ఖాతాలో వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే… ఏపీ వరకూ కాంగ్రెస్ పార్టీని గ్రిప్ లో పెట్టుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఇదంతా చంద్రబాబు ఆడించిన ఆట అంటూ విమర్శలు తెరపైకి వస్తున్నాయి. దీంతో… చంద్రబాబు రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటున్నారు ఆయన అభిమానులు! మరోపక్క బీజేపీలో ఉన్న తన మనుషులతో చంద్రబాబు ఆడించిన ఈ తెరవెనుక డ్రామాను మోడీ, అమిత్ షా లు ఎలా తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

దీన్ని బీజేపీని వెన్నుపోటు పొడవడంగానే అటు మోడీ, ఇటు అమిత్ షా లు భావిస్తే… భావించి సీరియస్ గా తీసుకుంటే… చంద్రబాబు, సీఎం రమేష్ ల పరిస్థితి ఏమిటనే చర్చ కూడా వినిపిస్తుంది. ఇది ఏపీలో కూటమిపై ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే నిజమైతే… ఏపీలో చంద్రబాబుకు మోడీ వెన్నుపోటు పొడిచినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.