అధికారవియోగాన్ని భరించలేకపోతున్న చంద్రబాబు 

Chandrababu could not bear the resignation
నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రెస్ మీట్ చూసినవారికి ఏమనిపించి ఉంటుంది?  ఆయన డెబ్బై ఏళ్ళవయసు దాటారు.  ఒకరకంగా చెప్పాలంటే ఈ దశాబ్దం ఆయన రాజకీయ జీవితానికి చరమాంకం.  ఈ వయసులో  ఆయన ఎంతో ప్రశాంతంగా, చిద్విలాసంగా, సమాజానికి ఆదర్శంగా జీవించాల్సిన వ్యక్తి.  రాష్ట్ర స్థాయిలో  అన్ని రకాల పదవులను అనుభవించారు.  వెన్నుపోటా ముందుపోటా,  ఎంతమంది బంధుజనులను ముంచాము, ఎంతమందిని తేల్చాము అనే విషయాలను పక్కన బెడితే ఆయనతో పాటు రాజకీయాల్లో ప్రవేశించినవారు దాదాపు అందరూ రాజకీయంగా కనుమరుగయ్యారు.  కేవలం ఎన్టీఆర్ లాంటి మహానటుడు, ప్రఖ్యాత కథానాయకుడికి అల్లుడు కావడం వల్లనే ఆయన తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరగలగడం, ఆ తరువాత సొంత మామగారినే కూలద్రోసి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. లేకపోతే మిగిలిన అనేకమంది కాంగ్రెస్ నాయకుల్లా ఆయన కూడా అనామకుడై రాజకీయంగా అంతరించిపోయేవారు.  
Chandrababu could not bear the resignation
Chandrababu could not bear the resignation
ప్రకృతిసహజంగా చీకటివెలుగులు ఎలాగో ప్రజాస్వామ్యంలో అధికారం, పరాజయం అనేవి సహజం.  అయితే చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఈ ముదిమి వయసులో, పరమశుంఠగా పేరుతెచ్చుకున్న కొడుకును భావిముఖ్యమంత్రి చెయ్యాలని కలలు కంటున్న తరుణంలో ఒకసారి వచ్చిన అధికారం శాశ్వతం అని భ్రమిస్తూ, క్షుద్రభజన పత్రికలు చేస్తున్న కైవారాలతో ఒక త్రిశంకు స్వర్గాన్ని నిర్మించుకుని అవినీతిసముద్రంలో కేరింతలు కొడుతూ, తనవారిని, తన సామాజికవర్గం వారిని తప్ప మరెవ్వరినీ అడుగు పెట్టనీయకుండా లేదా అడుగు పెట్టలేనంత గొప్ప కులరాజధానిని నిర్మించి లక్షల కోట్ల రూపాయల ధనరాశులను పోగెయ్యలని పరితపిస్తున్న వేళ…నిండా యాభై ఏళ్ళు కూడా లేని ఒక యువనేత…తన చిరకాల ప్రత్యర్థి కుమారుడు అయినట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో అత్యంత దారుణంగా పరాభవించబడటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడని, ఆ అవస్థలో ఆయన మానసిక సమతుల్యాన్ని కూడా కోల్పోయారని నిన్నటి పత్రికాసమావేశం కుండబద్దలు కొట్టి చాటింది!  
 
ఒకవంక ఎనభై శాతానికి   పైగా పంచాయితీలను వైసిపి కైవసం చేసుకున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంటే…ఈ ఎన్నికలు వైసిపి పతనానికి నాంది అని మాట్లాడటం చూస్తుంటే ఏమనిపిస్తుంది?  షర్మిలను వాడుకుని వదిలేశారని,  అందుకనే ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టిందని, షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచారు అని చంద్రబాబు మాట్లాడుతుంటే దేనితో నవ్వాలో కూడా అర్ధం కాదు.  దేశం మొత్తంలో వెన్నుపోటు అనే పదం వినిపించగానే మొదటగా చంద్రబాబు పేరే జ్ఞాపకం వస్తుంది జ్ఞానం ఉన్నవారెవరికైనా.  సొంత మామగారినే గద్దె దించి ఆక్రమించుకుని ఆయన మరణానికి కారణభూతుడైన చంద్రబాబు….తోడల్లుడిని సైతం తన కుటిల రాజకీయంలో భాగస్వామిని చేసి ఆ తరువాత వారం రోజులకే తన్ని తరిమేసి చంద్రబాబు…ఎనమండుగురు బావమరుదులను నందకుమారులుగా తయారుచేసి అందరికీ వెన్నుపోట్లు పొడిచి దూరం పెట్టిన చంద్రబాబు…మాతృమూర్తి లాంటి అత్తగారిని ఇంట్లోనుంచి తరిమేసి ఆమెకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు…సోదరికి జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తుంటే నక్కలు కూడా పగలబడి నవ్వుతాయి.  ఇక రాష్ట్ర డిజిపి నుంచి ఒక చిన్న గ్రామానికి పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ వరకు అందరినీ బెదిరిస్తూ..వాళ్ళ అంతు చూస్తామని, కోర్టుకు ఈడుస్తామని చంద్రబాబు ఆవేశంలో నోరు పారేసుకోవడం చూస్తుంటే ఒక వ్యక్తిలో ఇంత అసహనం పేట్రేగుతుందా అని ఆశ్చర్యం కలిగించక మానదు.   చంద్రబాబు మీడియా సమావేశం మొత్తం ఆగ్రహం, అసహనం, కడుపుమంట, ఈర్ష్య, మత్సరం, విద్వేషం ఉడుకుబోతుతనం, క్రోధము, మొదలైన దుర్లక్షణాలతో నిండి అధికారవియోగ బాధ ఇంత తీవ్రంగా ఉంటుందా అని బుగ్గలు నొక్కుకుని చూడాల్సిందే .  
 
 నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత  కుటుంబాన్ని దూరంగా పెట్టారు.  కుటుంబ సభ్యులకు రాజకీయ ఆసక్తి, పరిజ్ఞానం, కొంత అనుభవం ఉన్నాయని తెలిసినా, రాజకీయ ప్రత్యర్ధులు,  ప్రజల నుంచి నిందలు ఎదుర్కోవాల్సివస్తుందేమో అని అందరినీ ఇంటికే పరిమితం చేశారు.  ఈ లక్షణంలో ప్రజాస్వామ్యస్ఫూర్తి ఉన్నది.  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొడుకులు, కోడళ్లను రాజకీయాల్లో వేలు పెట్టటానికి అనుమతించలేదు.  వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా కుటుంబాన్ని సచివాలయం ఛాయలకు కూడా రానివ్వలేదు.  చంద్రబాబు అడ్డదారిలో కొడుకును ఎమ్మెల్సీని, మంత్రిని చేసి కుటుంబపాలనకు అవకాశం ఇవ్వలేదు.  ప్రశంసించాల్సిన అలాంటి లక్షణాన్ని చంద్రబాబు విమర్శించడం చూస్తుంటే ఆయనకు మెంటల్ బాలన్స్ పూర్తిగా కొరవడిందని,  పదవి లేకపోవడంతో అందరిమీద పెత్తనం చేస్తూ అక్రమార్జనకు తావు లేకుండా పోయిందనే బాధ మాత్రమే సామాన్యులకు అర్ధం అయ్యే విషయం.  
 
మొత్తానికి చుక్కలు చూపించడం అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఆచరణలో చూపిస్తున్నాడు!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు