కొన్ని రోజుల క్రితం.. “చంద్రబాబు హస్తిన యాత్రకు వెళ్లారు.. ఆ టూర్ లో భాగంగా అమిత్ షా తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భెటీ అయ్యారు.. పొత్తులపై తీవ్రంగా చర్చలు జరిపారు.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ – టీడీపీ పొత్తు ఉండబోతోంది.. ఈ సందర్భంగా చంద్రబాబుని అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు.. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరిమధ్యా చర్చలు జరిగాయి..” ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియాల్లో వచ్చిన వార్త. అయితే ఇదంతా ఫేక్ అయి తెలుస్తుంది!
అవును.. పైన చెప్పుకున్న అన్ని పాయింట్లలోనూ… “చంద్రబాబు హస్తిన కు వెళ్లడం మాత్రమే నిజమని, మిగిలినదంతా హంబక్కే” అని తెలుస్తుంది. తీరా ఢిల్లీకి వెళ్లాక కలవడానికి టైం లేదని అమిత్ షా చెప్పారు అని అంటే బాబుకు ఉన్న ఆకాస్త పరువు కూడా పోతుందని టీడీపీ అనుకూల మీడియా అలా కవరింగ్ ఇచ్చిందంట! తాజాగా ఈ విషయాలపై తాజాగా స్పందించారు సునీల్ ధియోదర్!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరగనే లేదని.. టీడీపీ నేతలు వారి అనుకూల మీడియాని అడ్డుపెట్టుకుని అలా బిల్డప్ ఇస్తున్నారని.. బాబుతో భేటీకి టైం లేదని అమిత్ షా అన్నారని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోదర్ ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు! ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారుతున్నాయి. చంద్రబాబును ఢిల్లీ పెద్ద్దలు ఆ స్థాయిలో లైట్ తీసుకున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది.
ఈ విషయాలపై మరింత స్పందించిన సునీల్ ధియోదర్… అమిత్ షాతో బాబు భేటీ జరగలేదని.. పైగా అమిత్ షాను నిజంగా కలిసి వుంటే బయటికి వచ్చిన తర్వాత మీడియాతో చంద్రబాబు తప్పక మాట్లాడేవారని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నిజంగా అమిత్ షాను బాబు కలిసి వుంటే అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో బాబు ఎందుకు పెట్టుకోలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.
దీంతో ముక్కుపై వేలేసుకోవడం ఏపీ ప్రజల వంతవ్వగా… స్పందించకుండా సైలంటుగా ఉండటం తమ్ముళ్ల వంతవుతుంది! మరి ఈ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా ఎలా స్పందింస్తాదనేది వేచి చూడాలి.