Pink Book: తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ తన ప్రత్యేకమైన రాజకీయ స్టైల్ తో ముందుగు సాగుతున్నారు. 2024 ఎన్నికల ముందు టీడీపీ శ్రేణులపై జరిగిన వేధింపులకు ప్రతిగా ఆయన తీసుకున్న “రెడ్ బుక్” నిర్ణయం పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్‌ను తీసుకువచ్చింది. వైసీపీ పాలనలో జరిగిన దౌర్జన్యాలను రికార్డు చేయడమే లక్ష్యంగా ఆయన ఈ రెడ్ బుక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ దారుణాలకు పాల్పడ్డవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
లోకేశ్ పిలుపుతో టీడీపీ కార్యకర్తల్లో విశ్వాసం పెరిగింది. ఆ ఉత్సాహం 2024లో రికార్డు స్థాయి విజయంగా మారింది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే లోకేశ్ తన మాట నిలబెట్టుకున్నారు. రెడ్ బుక్‌లో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. లోకేశ్ ఆచరణాత్మక శైలి వైసీపీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశమైంది. జగన్ సైతం “మీరు రెడ్ బుక్ రాస్తే, మేము వైట్ బుక్ రాస్తాం” అంటూ వ్యాఖ్యలు చేశారు.
అయితే లోకేశ్ ప్రభావం ఇక్కడితో ఆగలేదు. తాజాగా తెలంగాణలోనూ ఆయన ట్రెండ్ ప్రేరణగా మారింది. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, లోకేశ్ రెడ్ బుక్‌ను ప్రస్తావిస్తూ, తాము “పింక్ బుక్” తీసుకువస్తామని ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అన్యాయాలు చేస్తున్నాయని, వాటిని రికార్డు చేసుకుని, అధికారంలోకి రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలు లోకేశ్ రాజకీయ శైలికి మరింత బలాన్ని చేకూర్చాయి. విపక్షాలు సైతం ఆయన పద్ధతిని అనుసరిస్తుండటంతో, లోకేశ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే మాటకు మరోసారి ముద్రపడింది.