Beard: గడ్డం పెంచితే స్టైలే కాదు.. హెల్త్‌కి కూడా లాభమేనంట..!

ప్రస్తుతం చాలా యువకులు వయసుతో సంబంధం లేకుండా.. గడ్డం ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు గడ్డం పెంచితే బాగుండదు.. అందం పోతుంది’ అన్నవాళ్లే ఇప్పుడు గడ్డం పెంచి దాన్ని సరిగ్గా గోముగా.. ట్రిమ్‌గా ఉంచుతూ స్టైల్ చూపిస్తున్నారు. కానీ గడ్డం ఫ్యాషన్ మాత్రమే కాదు.. హెల్త్‌కి కూడా మేలు చేస్తుందని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తాజా రీసెర్చ్‌ల ప్రకారం.. గెడ్డాలు పెంచుకోవడం ఎంతో పాజిటివ్ ఉందని తెలిపారు. దక్షిణ క్వీన్స్‌ల్యాండ్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, గడ్డం సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి 95% రక్షణ ఇస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే సన్‌స్క్రీన్ లాగా పని చేసి చర్మ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎండల రాష్ట్రీయాల్లో ఉండేవాళ్లకి ఇది బంపర్ గుడ్ న్యూస్.

ఇక అమెరికాలోని ఒహియో స్టేట్ వెక్స్నర్ మెడికల్ సెంటర్ పరిశోధకులు గడ్డం చర్మానికి ఒక రక్షక కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు. షేవ్ చేసిన వారికంటే గడ్డం పెంచుకున్నవారి చర్మం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుందని, మొటిమలు, మచ్చలు తక్కువగా వస్తాయని చెబుతున్నారు. అంటే గడ్డం అంటే కేవలం షరతులు పాటించకుండా పెంచేయడమే కాదు.. శుభ్రంగా ఉంచితే చాలు చర్మం మెరిసిపోతుందన్న మాట.

మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, ముక్కులోని వెంట్రుకలు వాతావరణ కాలుష్యం లోపలికి రాకుండా అడ్డుపడతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే, గడ్డం కూడా అలెర్జీ కలిగించే ధూళి, కాలుష్య కణాలను చర్మంలోకి రాకుండా నిలువరించే శక్తి కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం రోజూ గడ్డాన్ని క్లీన్ గా ఉంచడం తప్పనిసరి.

అంతేకాదు ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో వచ్చిన ఒక రీసెర్చ్ ప్రకారం, గడ్డం ఉన్న యువకుల పట్ల మహిళల్లో ఆకర్షణ ఎక్కువని తేలింది. గడ్డం ఉన్నవాళ్లు కాస్త రఫ్ అండ్ టఫ్ గా, మేచ్యూర్డ్ గా కనిపిస్తారని అందుకే ఆకర్షణ ఎక్కువంటున్నారు. గడ్డం వల్ల వృద్ధాప్యం కూడా ఆలస్యమవుతుందట. ముఖంపై ముడతలు త్వరగా రాకుండా చూస్తుందని, సూర్య కిరణాల ప్రభావం తగ్గుతుందని డర్మటాలజిస్టులు చెబుతున్నారు. పైగా, ముక్కు, నోరు చుట్టూ దుమ్ము, ధూళి చేరకుండా ఒక కవచంలా పనిచేస్తుంది.

ఇప్పుడు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నవాళ్లు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. గడ్డం బాగుండాలంటే క్లీన్ గా, ట్రిమ్ గా, నెయ్యిగా ఉంచాలి. లేదంటే ఇన్ఫెక్షన్, దద్దుర్లు వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి గడ్డం అంటే స్టైల్ సింబల్ మాత్రమే కాదు.. శరీరానికి, చర్మానికి కూడా గుడ్ గార్డ్ అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఈ beard trend ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించడం ఖాయం.