బాలయ్యతో మాస్ కా దాస్ మల్టీస్టారర్.!

విక్టరీ వెంకటేష్‌తో కొద్ది రోజుల క్రితమే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓ సినిమా చేశాడు. ‘ఓరి దేవుడా’ పేరుతో వచ్చిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అసలు విశ్వక్ సేన్ ఎలా వెంకటేష్‌ని ఆ సినిమా కోసం ఒప్పించాడన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు.

తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న హాటెస్ట్ గాసిప్ ఏంటంటే, మాస్ కా దాస్ ఏకంగా ఈసారి గాడ్ ఆఫ్ మాసెస్‌కే టెండర్ పెట్టాడట. నందమూరి బాలకృష్ణ‌తో ఓ సినిమా చేసేందుకు విశ్వక్ సేన్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ బ్యానర్ ఒకటి విశ్వక్ సేన్‌తో ఓ మీడియం బడ్జెట్ సినిమా తీయబోతోంది. ఆ బ్యానర్‌లో బాలకృష్ణ కూడా ఓ సినిమా చేయాల్సి వుంది. దాంతో, గెస్ట్ రోల్ కోసం విశ్వక్ సేన్ ఇప్పటికే బాలయ్య‌తో ఓ మాట చెప్పాడనీ, ‘చూద్దాం’ అని బాలయ్య అన్నాడనీ సమాచారం.

‘సార్..’ అని పిలిస్తే బాలయ్యకు నచ్చదనీ, ‘బ్రో’ అని తనను పిలవాలని చెబుతారనీ విశ్వక్ సేన్ ఈ మధ్య చాలా వేదికలపై చెబుతూ వస్తున్నాడు. సో, ఈ మాస్ ‘బ్రొమాన్స్’ త్వరలో తెరపై చూడబోతున్నామన్నమాట.