తప్ప కదా బాలయ్యా.! ఇలా ఎందుకు చేశావ్.?

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ రాజకీయ కుదుపుకు కారణమవుతోంది. సంక్రాంతి సినిమాలు గనుక, టిక్కెట్ రేట్లను పెంచుకోవాలనీ, అదనపు షోలు వేసుకోవాలనీ మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది.

‘వీర సింహా రెడ్డి’తోపాటు, ‘వాల్తేరు వీరయ్య’ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వీటికి ప్రత్యేక అనుమతులు కూడా రాబోతున్నాయి. అయితే, ఇంతలోనే ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో వైఎస్ జగన్‌ని ఉద్దేశించి పరోక్షంగా వేసిన డైలాగ్‌తో సీన్ మొత్తం మారిపోయింది.

‘ఆ డైలాగ్ తొలగించాల్సిందే..’ అంటూ ‘మైత్రీ’ సంస్థపై వైసీపీ నుంచి ఒత్తిడి షురూ అయ్యిందట. మరోపక్క, ఈ డైలాగ్ బాలకృష్ణ ప్రేరేపించడం వల్లే వచ్చిందంటూ ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ చెప్పిన డైలాగ్ ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ ఈ మొత్తం వివాదానికి కారణం. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య ఇలా ఎందుకు చేసినట్టు.? బావ మెప్పు కోసమా.?