పూర్తిగా పసుపు వర్ణంలోకి మారిపోయిన కన్నా!

రాజకీయాల్లో విమర్శలు – ప్రతి విమర్శలూ అత్యంత సహజం. అయితే ఆ విమర్శల్లో కూడా ఎంతోకొంత పద్దతి ఉండాలి.. కాస్త సత్యానికి దగ్గరగా ఉండాలి.. ప్రజలు కన్వెన్స్ అయ్యేలా ఉండాలి. అలాకానిపక్షంలో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం పుష్కలంగా ఉందన్న విషయం చరిత్ర ఎన్నోసార్లు చెప్పింది! అలాంటి చరిత్ర ఎంతో బాగా తెలిసిన టీడీపీ కుటుంబ కొత్త సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ.. తెలియని వ్యక్తిలా మాట్లాడటం మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఏపీలోని టీడీపీ నేతల్ని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం బాగా టెన్షన్ పెడుతుందట. మొత్తం పని పూర్తయ్యే వరకూ లీకులు ఇవ్వడం, బీరాలకు పోవడం చేయని జగన్… సైలంటుగా ఉంటూ తెరవెనక పనిమొత్తం పూర్తి చేసి, అప్పుడు తమ పార్టీ నేతలతో మాట్లాడిస్తుంటారు. దానివల్ల రెండు ప్రయోజనాలు… ఒకటి ప్రత్యర్థి అలర్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం – రెండు.. జగన్ చెప్పినా – ఆయన పార్టీ నేతలు చెప్పినా.. అందులో వాస్తవం ఉందనే విషయం స్పష్టమవడం!

ప్రస్తుతం చంద్రబాబు స్కూల్లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మాత్రం… నిన్నకాక మొన్న సైకిల్ ఎక్కారో లేదో.. బాబు పాండిత్యాన్ని మొత్తం ఒక్కదెబ్బతో లాగేసినట్లు, పరిపూర్ణ పసుపు మనిషిగా మారినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. అవును… స్కిల్ డెవలప్మెంట్‌ కుంభకోణం పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరినీ వేధింపులకు గురిచేస్తున్నారు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్‌ ను అరెస్ట్‌ చేయటం అన్యాయం.. సీఐడీని జగన్ తన జేబు సంస్థ‌గా మార్చుకుని ప్రత్యర్థులను, నిజాయితీ కలిగిన అధికారులను వేధింపులకు గురిచేయటం తగదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు కన్నా!

దీంతో కన్నా కూడా పూర్తిగా చంద్రబాబు కు బెస్ట్ విద్యార్థి అయిపోయారని.. సేం చంద్రబాబు & కో లా అర్థంలేని విమర్శలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుంభకోణం జరిగిందిరా మొర్రో అని ఒకపక్క సీఐడీ అధికారులు చెబుతుంటే.. వారిచ్చిన రిపోర్ట్ కూడా స్పష్టంగా ఉందని తెలుస్తుంటే… కన్నా మాత్రం… అక్కడ కుంభకోణం జరగలేదు – శ్రీకాంత్ ని అరెస్టు చేయడం అన్యాయం అంటూ వితండవాదం చేస్తున్నారు!

కాగా… స్కిల్ డెవలప్మెంట్‌ ముసుగులో హవాలా, మ‌నీ ల్యాండ‌రింగ్ పెద్దఎత్తున జరిగిందని ఇప్పటికే ఈడీ నిర్ధారణకు రావడం తెలిసిందే. దీంతోపాటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తాము నడుచుకున్నట్లు అప్పటి అధికారులు అంగీకరించారని కూడా కథనాలొచ్చాయి. దీంతో.. ఎలా చూసినా ఈ కుంభకోణం మొత్తం బాబు “స్కిల్స్” మీదే జరిగిందనేది తేలడానికి పెద్ద ఎక్కువరోజులు పట్టదని ఒకపక్క తెలుస్తుంటే… మరోపక్క కన్నా ఇలాంటి మాటాలు మాట్లాడుతున్నారన్నమాట!!