Nara Lokesh – Amit Shah: ఢిల్లీకి చేరిన మంత్రులు లోకేశ్, అనిత.. రేపు అమిత్ షాతో కీలక భేటీ!

Nara Lokesh – Amit Shah: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో, కేంద్రం నుంచి సాయం కోరేందుకు వారు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

ఘనస్వాగతం పలికిన ప్రముఖులు మంత్రులకు స్వాగతం పలికిన వారిలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్ (చిన్ని), లావు కృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, పార్థసారథి, అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ కూడా మంత్రులకు స్వాగతం పలికారు.

అమిత్ షాతో రేపు భేటీ ఈ పర్యటనలో భాగంగా మంత్రులు లోకేశ్, అనిత మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు.

ప్రధాన ఎజెండా ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ‘మొంథా’ తుఫాను వల్ల జరిగిన తీవ్ర నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర నివేదికను వీరు కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు. ప్రధానంగా తుపాను ప్రభావం, పంట నష్టం, మరియు పునరావాస చర్యలకు అవసరమైన నిధుల విడుదలపై కేంద్రంతో చర్చించి, తక్షణ సాయం కోరనున్నారు.

పవన్ అజ్ఞానం || Analyst Ks Prasad About Why PM Modi insult to Pawan Kalyan || Nara Lokesh || TR