ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ను ‘వికసిత్ భారత్’గా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
సోమవారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తిగా విస్మరించిందని ఆయన మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి సత్యకుమార్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 87 కోట్లను విడుదల చేసిందని తెలిపారు.
గిరిజన విద్యార్థుల విద్యను అభివృద్ధి చేయడానికి 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా సోళ్ల బుజ్జిరెడ్డిని నియమించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అవగాహన కలిగిన అనుభవం ఉన్నవారిని ఎంపిక చేశారని ప్రశంసించారు.
రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ను ‘వికసిత్ భారత్’గా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

