Pawan Kalyan: పవన్ కల్యాణ్.. వంగవీటి రంగాను లైట్ తీసుకున్నారా..?

Pawan Kalyan: కాపు సమాజికవర్గం హీరోగా చూసే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి ఈరోజు (డిసెంబర్ 26). విజయవాడలో దీక్షకు కూర్చున్న రంగాను.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి చేసి అంతం చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నరనే విషయంపై ఒక ఇంటర్వ్యూలో దేవినేని నెహ్రూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు! ఆ సంగతి అలా ఉంటే.. ఈ రోజు రంగా వర్ధంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నుంచి ఒక్క పోస్టు కూడా రాకపోవడంతో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

కాపు సామాజిక వర్గం హీరోగా చూసే వంగవీటి రంగాను పవన్ వద్దనుకుంటున్నారా..?

ఎంతో మంది నాయకుల జయంతులకు, వర్ధంతులకు.. బర్త్ డేలకు ఎక్స్ వేదికగా స్పందించే పవన్ కల్యాణ్.. రంగా విషయంలో స్పందిచకపోవడాన్ని ఆయనను అభిమానించే జనం ఎలా చూడాలి..?

కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్.. రంగాను లైట్ తీసుకోవడం వెనుక ఎవరి మెప్పు కోరిక ఉంది..?

ఈ దెబ్బతో పవన్ కల్యాణ్ ముసుగు తీసేసి పూర్తిగా టీడీపీ మనిషిగా మారిపోయారని భావించొచ్చా..?

పోనీ.. రంగా వర్ధంతిని ఏదైనా రాజకీయ పార్టీ నిర్వహిస్తుంటే.. పవన్ మౌనాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ.. జనరల్ గా ఓ వ్యక్తిగా, కాపు సామాజికవర్గానికి చెందిన మనిషిగా అయినా పవన్ ఎందుకు స్పందించలేదు..?

చంద్రబాబు, లోకేష్ ల ఆగ్రహానికి గురవ్వకూడదనే రంగాను పవన్ లైట్ తీసుకున్నారనే కామెంట్లలో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వైఖరిపై తీవ్ర చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చే స్టేట్ మెంట్లు, చెప్పే మాటలు, ప్రజలకు ఇచ్చే హామీలు.. ఏ ఎండగాగొడుకు అన్నట్లుగా చేసే ప్రసంగాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయి! అయితే… జనసేన చంద్రబాబు పార్టీ అని, పవన్ కల్యాణ్ బినామీ అని వైసీపీ నాయకులు గతంలో కామెంట్లు కూడా చేశారు! అవన్నీ ఇప్పుడు ఆప్రస్తుతం!

అసలు విషయానికొస్తే… ఇవాళ (డిసెంబర్ 26) వంగ‌వీటి మోహ‌న్‌ రంగా వ‌ర్ధంతి. కాపు సామాజిక వ‌ర్గం హీరోగా చూసే.. మోహ‌న్‌ రంగా విజ‌య‌వాడ‌లో దీక్షలో కూర్చున్నారు. ఆ సమయంలో వైఎస్సార్ తో పాటు చాలామంది నాయకులు ఆయన సంఘీభావం ప్రకటించినట్లు చెబుతారు! అప్పుడు ఏపీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా టీడీపీ పాలన నడుస్తోంది. ఆ సమయంలో రంగాను అంతం చేశారు.

ఆ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో పనిచేసిందంటే… ఆ త‌ర్వాత 1989లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మి పాలైంది. అందుకు ప్రధాన కారణం రంగా హ‌త్యే అని అంటారు. అందుకే మెజార్టీ టీడీపీ నాయకులు రంగాను శ‌త్రువుగా భావిస్తుంటారని చెబుతారు. ఎవరైనా వ్యక్తిగతంగా రంగాను అభిమానిస్తే అభిమానించొచ్చు కానీ.. పార్టీ పరంగా మాత్రం వారంతా యాంటీ రంగా బ్యాచ్ అన్నమాట!

1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 202 స్థానాలు గెలుచుకున్న టీడీపీ కేవలం 1989 లో 74 స్థానాలను మాత్రమే గెలుచుకుంది . 42 లోక్‌ సభ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కేవలం 2 మాత్రమే గెలుచుకుంది. ఈ రేంజ్ లో టీడీపీపై రంగా ఎఫెక్ట్ పని చేసిందని చెబుతారు. ఈ విషయం చాలా మంది కాపు సోదరులు మరిచిపోయి ఉంటారు!!

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రంగా వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల కాపు సామాజిక వర్గ ప్రజానికం.. మరికొన్ని చోట్ల కులాలకు అతీతంగా సామాన్య ప్రజానికం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా… “పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు” అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

ఇక… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ల నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటనలు రాలేదు! ఇది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు! అయితే… అనూహ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజానికం ఎంతో బలంగా నమ్మిన, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి వంగవీటి మోహన్ రంగా వర్ధంతికి కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా కనిపించలేదు! దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

పైగా… ఈ రోజు రంగా వర్ధంతి సందర్భంగా వెలిసిన పలు ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ ఫోటోలను చాలా మంది జత చేశారు. మరికొంతమంది ముద్రగడ పద్మనాభం ఫోటోలు పెట్టారు! అయితే… పవన్ మాత్రం రంగాని లైట్ తీసుకోవడం.. ఇప్పుడు కాపు సామాజికవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు! దీని ప్రభావం పవన్ పై ఏమైనా పనిచేస్తుందా.. లేక రంగా అభిమానులు సైతం లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి!

అమరావతి ఆవకాయ | Analyst Ks Prasad Reacts On Amaravati Avakai Festival | Chandrababu | Ys Jagan | TR