నిన్న చూసింది ట్రైలర్… ఇవాళ సినిమా చూపించేసిన అనసూయ!

నిన్నమొన్నటివరకూ అప్పుడప్పుడూ ఆన్ లైన్ వేదికగా అందాల ఆరబోత చేసేది అనసూయ. ఆ క్రమంలో అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా పరిధి దాటుతుండేదనే కామెంట్లు వినిపించేవి. అయితే తాజాగా డోస్ పెంచిన అనసూయ… ఆన్ లైన్ లో అరాచకం సృష్టిస్తుంది. వరుసపెట్టి హాట్ షో చేస్తూ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

అవును… గత రెండు రోజుల నుండి అనసూయ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ వేదికగా రచ్చ రచ్చ చేస్తోంది. తన పెళ్లి రోజు కానుకగా నెటిజన్స్ అందరికీ తన భర్తతో ఒక లిప్ లాక్ పెట్టిన ఫోటో, అనంతరం ఎమోషనల్ గా ఒక వీడియో పోస్ట్ చేసిన అనసూయ ఈరోజు మరొ వీడియో షేర్ చేసింది.

అయితే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో అనసూయ హద్దులు చెరిపేసింది. కాదు హద్దులు లేకుండా చెలరేగిపోయింది. వైట్ కలర్ బికినీ దరించిన రంగమ్మత్త… తొలిసారి పరిపూర్ణమైన అందాల విందును అందించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

కురివిప్పి నెమలి నాట్యం చేస్తున్నట్లు, హొయలు ఒలకబోస్తూ, సముద్రుడికి సైతం చెమలు పట్టించే స్థాయిలో అనసూయ చెలరేగి పోయింది. ఈ అందాల విందుకి ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తుండగా… కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే అనసూయ ఇలాంటివి పట్టించుకోదనే విషయం అందరికీ తెలిసిందే!

కారణం… ఎలాంటి కామెంట్లు వస్తాయో ముందుగా గ్రహించుకున్న తర్వాత, వచ్చిన కామెంట్లకు రిప్లై లు కూడా ఎలా ఇవ్వాలో ఒక అంచనాకు వచ్చిన తర్వాతే అనసూయ ఇలాంటి పోస్ట్ లు పెడుతుందని అంటుంటారు. ఏది ఏమైనా… గతంలో అనసూయ ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేసినా, ఎన్నో హాట్ హాట్ ఫోటోలు పెట్టినా… తాజాగా పోస్ట్ చేసిన వీడియో ముందు అవన్నీ దిగదుడుపే!